03.05.2012 గురువారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజునుంచి సాయి.బా.ని.స. డైరీ - 1996 చదువుకుందాము.
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజునుంచి సాయి.బా.ని.స. డైరీ - 1996 చదువుకుందాము.
సాయి.బా.ని.స. డైరీ -
1996 (01)
27.05.1996
సీ.డీ.ఆర్. హాస్పిటల్
నా
గుండెకు ఆపరేషన్
విజయవంతముగా జరిపించినందులకు బాబాకు
కృతజ్ఞత తెలియచేసుకొని
- బాబా నన్ను
త్వరగా యింటికి
పంపమని వేడుకొని
నిద్రపోయినాను.
శ్రీసాయి
ఫకీరు రూపములో
కలలో దర్శనము
యిచ్చి నెమలి
కన్నుల ఈకల
కట్టతో నాశరీరముపై
మూడు సార్లు
శుభ్రము చేసినారు. నాలో
కొత్త శక్తి
వచ్చినది. లేచి
వారి పాదాలకు
నమస్కరించినాను. వారు
చిరునవ్వుతో నన్ను ఆశీర్వదించి అదృశ్యమైనారు.
యింకొక
దృశ్యములో శ్రీసాయి చిన్న పిల్లల ఆసుపత్రి
వద్ద నిలబడి
అక్కడ ఓతల్లి
తన పిల్లవాడు
పూర్తి ఆరోగ్యము
పొందిన తర్వాత
డాక్టరుగార్కి కృతజ్ఞత తెలియచేసి తన పిల్లవానిని
యింటికి తీసుకొని
వెళ్ళినది. శ్రీ
సాయి ఆతల్లిని,
పిల్లవానిని ఆశీర్వదించినారు ఈ రెండు
దృశ్యములు చూసిన తర్వాత నేను కూడా
పూర్తి ఆరోగ్యముతో
యింటికి వెళ్ళుతాను
అని నమ్మకము
కుదిరినది.
29.05.1996
యింటి.నుంబరు. 1-7-204, కమలాననగర్
నిన్నటిరోజున శ్రీ సాయి
దయతో ఆసుపత్రినుండి
యింటికి క్షేమముగా
చేరుకొన్నాను. నూతనజీవితానికి
సలహాలు సూచనలు
ప్రసాదించమని శ్రీ సాయిని వేడుకొన్నాను. శ్రీ
సాయి ఓ
అజ్ఞాత వ్యక్తి
రూపములో యిచ్చిన
సలహాలు.
1) యికమీదట, విందులు, వినోదాలు.
షికార్లు మానివేయి.
2) నీగత జీవిత స్నేహితులు
నిన్ను మానసికముగా
బాధ పెడతారు,
ఓరిమితో భరించక
తప్పదు.
3) నీజీవిత యాత్ర పాసింజరు
రైలుబండి ప్రయాణములాగ యుంటుంది. అటువంటి
యాత్ర అలవాటుకు
సిధ్ధపడు.
4) నీ నూతన జీవిత
యాత్రలో ఎవరినీ
మోసగించవద్దు. నీవు
మోసగించపడవద్దు. జాగ్రత్త.
5) ఆఫీసు జీవితములో ఎవరితోను
గొడవలు పడవద్దు.
6) ధనవ్యామోహము, పరస్త్రీ మీద
వ్యామోహమును విడనాడు.
7) భార్యా వియోగము సంభవించిన
నీవు తిరిగి
వివాహము చేసుకోవద్దు.
8) ఆధ్యత్మిక రంగములో నీవు
ఒంటరి ప్రయాణము
చేయాలి. అందుచేత
యితరుల యింట
సత్ చరిత్ర
పారాయణ చేయవద్దు.
(యింకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment