01.07.2012 ఆదివారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి.బా.ని.స. అనుభవాలు
- 23
మన సాయి బంధువులందరూ
ఇంతకు ముందు
బాబాతో సాయి.బా.ని.స. అనుభవాలు
చదివారు. ఈ రోజున మరికొన్ని
అనుభవాలను మీముందు ఉంచుతున్నాను. 16.06.2012 తేదీన
నేను సాయి..బా.ని.స. యింటికి
వెళ్ళి ఆయనను
కలిసే భాగ్యం కలిగింది. ఆరోజున
ఆయన స్వయంగా
ఈ క్రింది
అనుభవాలను చెప్పారు. వాటిని యధాతధంగా
మీముందు ఉంచుతున్నాను.
***
అనుభవం - 23 ( కలల ద్వారా పొందిన అనుభవాలు)
అనుభవం - 23 ( కలల ద్వారా పొందిన అనుభవాలు)
సాయియే మారుతి
సాయిబానిస అనేక సార్లు
సత్ చరిత్ర
చదివినపుడెల్ల మహల్సాపతి ఖండోబా మందిరం వద్ద
"ఆవో సాయి" అని నామకరణం చేసిన
సంఘటన గుర్తుకు
వచ్చి, బాబాకు
అంతకు ముందు,
మహల్సాపతి పిలవకముందు పేరు లేదా అనే
బాధతో రాత్రి
కలలో ప్రార్ధించి,
బాబా నీకు
అంతకు ముదు
నామమే లేదా?
అన్నపుడు నాపేరు లక్షల సంవత్సరాల క్రితం
కూడా సాయియే. కావాలంటే
నీదగ్గరున్నటువంటి ఆంగ్లేయ డిక్షనరీ
లో ఉన్న
సాయి అన్న
పదానికి అర్ధము
చూసుకో అనిసాయి
ఒక అజ్ఞాత
వ్యక్తి రూపంలో
చెప్పారు. నేను
మరుసటి దినము
డిక్షనరీ చూడగా సాయి అన్న పదానికి
అర్ధము. దక్షిణమెరికాలోని
బ్రెజిల్ దేశములోని అడవులలోని కోతులను (*) సాయి
అందురు.
ఒకానొకపుడు ఈ దక్షిణ అమెరికా, ఆఫ్రికా, భారతఖండములన్నియు భూమధ్యరేఖ పై కలిసి ఉండేవి. బాబా కూడా ధులియా కోర్టులో తనవయస్సు లక్షల సంవత్సరాలని తనని సాయి అని పిలుస్తారని తన తండ్రి పేరు కూడా సాయి అని తెలియచేశారు. దీనిని బట్టి మనము సాయి వానరులలో అగ్రగణ్యుడయిన మారుతిగా సాయి మారుతి అని పూజిస్తున్నాము.
ఒకానొకపుడు ఈ దక్షిణ అమెరికా, ఆఫ్రికా, భారతఖండములన్నియు భూమధ్యరేఖ పై కలిసి ఉండేవి. బాబా కూడా ధులియా కోర్టులో తనవయస్సు లక్షల సంవత్సరాలని తనని సాయి అని పిలుస్తారని తన తండ్రి పేరు కూడా సాయి అని తెలియచేశారు. దీనిని బట్టి మనము సాయి వానరులలో అగ్రగణ్యుడయిన మారుతిగా సాయి మారుతి అని పూజిస్తున్నాము.
(సాయి పాఠకులకు 20 చాంబర్స్
డిక్షనరీ లోని సాయి అన్నపదానికి అర్ధము
ఉన్న పేజీ
833 లింక్
ఇక్కడ ఇస్తున్నాను. చూడండి.
లాపిడేషన్:
సాయి.బా.ని.స. సాయి
తత్వం మీద
అనేక విషయాలు
తెలుసుకోవాలనే జిజ్ఞాసతో హైదరాబాదులో ఉన్నటువంటి పేరు
ప్రఖ్యాతులు కలిగి శ్రీషిరిడీ సాయిపై అనేక
పుస్తకాలు రచించిన ఒక భక్తురాలి వద్దకు
వెళ్ళి
విషయాలు తెసులుకోవాలనే తపనతో ఉండగా, బాబా
గారి అనుమతిని
కోరినపుడు, బాబా కలలో సాయి.బా.ని.స.
కు దర్శనమిచ్చి,
నీవు ఆవిడ
దగ్గరకు నా
గురించి తెలుసుకోవడానికి
వెళ్ళినా ఆమె నీపై లాపిడేషన్ ఆపరేషన్
చేయును జాగ్రత్త
అని చెప్పి
వారించినారు.
మరుసటిరోజు లాపిడేషన్ అనే
మాటకు అర్ధము
తెలుసుకోవడానికి డిక్షనరీ చూడగా
రాళ్ళతో కొట్టి
శిక్షించుట అని అర్ధము కనిపించినది.
ఆ అర్ధము గ్రహించిన తర్వాత సాయి.బా.ని.స. ఆమె
వద్దకు వెళ్ళడానికి
సాహసించలేదు.
( సాయి పాఠకులకు
20 చాంబర్స్ డిక్షనరీ లోని లాపిడేషన్ అన్నపదానికి
అర్ధము ఉన్న
పేజీ 512 వ.పేజీ లింక్ ఇక్కడ
ఇస్తున్నాను. చూడండి.
బ్రోస్:
సాయి.బా.ని.స. ఒకసారి
బ్రిటిష్ సాయి భక్తుడు (ఆర్థర్ ఆస్
బోర్న్) రాసిన
పుస్తకముపై విశ్లేషణ చేయుటకు ప్రయత్నిస్తుండగా
సాయి.బా.ని.స.కు
కఠినతరమయిన ఆంగ్ల భాష పదాలను అనువాదము
చేయుటకు కష్ఠతరమయిన
సందర్భములో బాబాను ప్రార్ధించగా, బాబా
స్వప్న దర్శనములో
తెల్లటి సూటు,
ధరించి ఒక
మల్టీ నేషనల్
కంపనీ చీఫ్
ఎగ్జిక్యూటివ్ గా దర్శనము ఇచ్చి,
సాయి.బా.నిస.ను, తెల్లటి
అంబాసిడర్ కారులో ఒక పెద్ద
ఆధునిక పరమైన
హోటలుకు తీసుకుని
వెళ్ళారు. ఆయనకు
"బ్రోస్" అనే వేడి
పానీయమును త్రాగడానికి ఇచ్చి ఆశీర్వదించెను. కలలో
ఆవేడి పానీయము
త్రాగుటవలన నాలిక కాలిన అనుభూతిని పొంది
సాయి.బా.ని.స.
నిద్రనుంచి లేచి కూర్చొనెను. ఉదయము
నిద్రనుండి లేచి బ్రోస్ అనే పానీయము
గురించి ఎంతమందిని
అడిగినను అర్ధము చెప్పలేకపోయారు. అపుడు
ఆయనదగ్గర ఉన్నటువంటి ఛాంబర్స్ 20యత్ సెంచరీ
డిక్షనరీ లో బ్రోస్ పదానికి అర్ధము
చూడగా ఈ
క్రింది విధముగా
ఉన్నది.
బ్రోస్: వేడి పాలలో
ఓట్స్ వేసి
అందులో వెన్న,
తేనె కలిపిన
పానీయము.
( సాయి భక్తులకు బ్రోస్
అన్నపదానికి అర్ధము ఉన్న పేజీ లింక్
118 ఇస్తున్నాను చూడండి )
నీకు జన్మ ఇచ్చిన
తల్లే నీపాలిట
దేవత:
2000 సంవత్సరము అక్టోబరులో చికాగో కాన్
ఫరెన్స్ కు
(విశ్వసాయి భక్తుల సమ్మేళనము) వెళ్ళేముందు
బాబా సాయి.బాని.సకు
తన మాతృమూర్తి
రూపములో దర్శనమిచ్చారు. 100 సంవత్సరముల
క్రితం, వివాకానందులవారు
చికాగోలో ఆధ్యాత్మిక ఉపన్యాసము (సర్వమత సమ్మేళనము)
ఇవ్వడానికి వెళ్ళేముందు, రామకృష్ణ పరమహంసవారు ఆయనకు
జగన్మాత కాళికాదేవిని
ప్రత్యక్ష దర్శనము చేయించారు.
సాయి.బా.ని.స., మరి
నేను కూడా
చికాగో వెడుతున్నాను
కదా, మూడవ
అధ్యాయములో త్రిగుణాత్మ స్వరూపము నేనే, జగన్మాతను
నేనే అని
చెప్పావు కదా,
మరి నాకు కూడా అమ్మవారి దర్శనము కలిగించు అని అడిగారు.
మరి నాకు కూడా అమ్మవారి దర్శనము కలిగించు అని అడిగారు.
బాబా సాయి.బా.ని.స కు
ఆయన మాతృమూర్తి రూపములో దర్శనమిచ్చారు. ఆయన తల్లి సాయి.బా.ని.సకు. మంచి
పట్టుచీర కట్టుకుని, నగలతో వచ్చి సాయి.బా.ని.స. ప్రక్కన
కూర్చుని, ఎందుకు పిలిచావు అని అడగగా
నిన్నెవరు పిలిచారు అని సాయి.బా.ని.స.
తన తల్లిని
జగన్మాతగా ఊహించలేక తూలనాడి పంపివేయగా,
బాబా దర్శనమిచ్చి
నీతల్లే నీజగన్మాత. ఆమెను
నీవు గుర్తించకుండా,
కనీసం ఆమెకు
నమస్కారము కూడా చేయకపోవడం నీ దురదృష్ఠం
అని ఫకీరు
రూపములో దర్శనము
ఇచ్చి చెప్పారు.
(*) నా విశ్లేషణ ::
(*) నా విశ్లేషణ ::
(డార్విన్ సిధ్ధాంతము ప్రకారము శాస్త్రీయముగా చూసినా కోతియే మనకు ఆదిమానవుడు. సాయి ఎప్పుడూ తన గొప్పతనాన్ని చాటుకోలేదు. ఆ గొప్పతనమంతటినీ తన భక్తులకు సంపాదించి పెట్టారు.. హేమాద్రి పంత్ చేత తన చరిత్రను తానే వ్రాయించుకొని సాయి సత్ చరిత్రను వ్రాసిన కీర్తిని ఆయనకు సంపాదించి పెట్టారు. అలాగే "సాయి" అన్న మాట లక్షల సంవత్సరాల క్రితమే ఉన్నా తన నామధేయాన్ని భక్త మహల్సాపతి నోటివెంట పలికించి మొట్టమొదటగా "సాయి" అన్న పదం ఆయనే పలికారనే పేరు ఆయనకు ఆపాదించి గొప్పవాడిని చేశారు. ... త్యాగరాజు )
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment