Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Tuesday, July 17, 2012

బాబా లీలలు, అనుభూతులు

Posted by tyagaraju on 2:33 AM
 
 
 
17.07.2012  మంగళవారము
ఓం సాయి  శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ  రోజు అమెరికా నుంచి ఒక సాయి భక్తురాలు తనతోటి ఉద్యోగులు చెప్పిన కొన్ని బాబా అనుభూతులను మీముందుంచుతున్నాను.
 
1.  సుమారు రెండు వారాల క్రితం 2 సంవత్సరాల వయసుగల మా అమ్మాయి ఆడుకుంటు మొదటి అంతస్తునుండి కిటికీలోనించి (దాదాపు 15 అడుగు ల ఎత్తు ఉంది) క్రిందకు గ్రౌండ్ ఫ్లోర్ మీద పడిపోయింది మేము వెంటనె ఆస్పత్రికి తీసుకునివెళ్ళాము. అక్కడ అన్ని పరీక్షలు, సి.టి .స్కాన్,అల్ట్రా సౌండ్,ఎక్స్ రే అన్నీ చేశారు. సీ.టీ.స్కాన్ లో అంతా నార్మల్ గానే ఉంది, కాని లివర్ లో చిన్న గాయం ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేసి దానికి శస్త్రచికిత్స అవసరమవుతుందని చెప్పారు. మాకు చాలా భయం వేసి బాబాని ప్రార్ధిస్తూ ఊదీని రాశాము. రెండు రోజులు ఐ.సీ.యూ.లో అబ్జర్వేషన్ లో ఉంచారు. బాబా దయవల్ల తరువాత అన్ని రిపోర్ట్స్ నార్మల్ గా వచ్చయి. ఏవిధమైన సమస్యలు లేవని చెప్పారు. బాబా దయ అనుగ్రహం వల్ల మా పాప క్షేమంగా ఉంది.
ఇది నిజంగా చాలా అద్భుతమైన బాబా లీల.ఈ సంఘటన జరిగినప్పుడు నాకు చాలా ఆందోళన కలిగింది నా పాపకు ఏమన్న జరిగితే కనక నీ పాదాలను ముట్టుకోనని బాబా కు చెప్పి శపదం చేశాను. ఆస్పత్రినుంచి వచ్చిన తరువాత నా పాపని క్షేమంగా రక్షించి తన దయను ప్రసరింప చేసినందుకు ఆయన పాదాలకు నమస్కరించాను.
మూడు సంవత్సరాలనుంచి మేము రెండవ సంతానం కోసం ప్రయత్నిస్తున్నాము. మిస్ కారేజెస్ జరగసాగాయి. ఎన్ని మందులు వాడినా ఏమీ ఫలితం కనిపించలేదు. బాబా వద్ద ఎంతో ఏడిచాను. నేనిక షిరిడీ రానని చెప్పాను. నాకు శ్రధ్ధ సహనం లేదు. 8 నెలల క్రితం డాక్టర్ల మీదే వదిలేశాను. నెల క్రితం నాకు సత్ చరిత్ర చదవాలనిపించింది. 45 రోజులు పారాయణ చేశాను. పారాయణ పూర్తి అయిన ఆఖరిరోజున మాకు సంతానం కలుగుతుందనిపించింది. నాకిప్పుడు ఏడవ నెల. అంతా సవ్యంగా జరుగుతోంది.
                                                                    **********
 
 
2.  ఇప్పుడు నేను చెప్పబోయే అనుభవం చాలా సంవత్సరాల క్రితం జరిగింది.
నేను డిగ్రీ పూర్తి చేసిన తరువాత ఉద్యోగం కోసం హైదరాబాదులో నా స్నేహితులతో కలిసి ఉంటున్న రోజులు. ఆరోజుల్లో నాకు బాబా గురించి అసలేమీ తెలీదు, ఆయన ఫోటో కూడా చూడలేదు. నాతో ఉన్న నా రూమ్మేట్ తమిళనాడునుంచి వచ్చాడు. ఒకరోజు అతను తమిళ పుస్తకం చదువుతుంటే కుతూహలంతో అదేమిటని అడిగాను. అది సద్గురువైన షిరిడీ సాయిబాబా సత్ చరిత్ర అని చెప్పాడు. అదివినగానే నేను ఆ పుస్తకమే కనక తెలుగులో ఉంటే నేను కూడా చదివేవాడిని అన్నాను.
 
మరునాడు మాఊరినించి మా నాన్నగారు నన్ను చూడటానికి వచ్చారు. మేమిద్దరము మానాన్నగారి స్నేహితుని ఇంటికి చూడటానికి వెళ్లాము. వారి ఇంటినుంచి బయలుదేరి వచ్చటప్పుడు మానాన్నగారి స్నేహితుడు తన వద్ద సాయి సత్చరిత్ర అదనం గా మరొక పుస్తకం ఉన్నదని నువ్వు చదువుతావా అని నన్నడిగారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. నాకు మాటలు రాలేదు.ఆయన ఇచ్చిన పుస్తకాన్ని తీసుకుని అప్పటినుండీ చదవడం ప్రారంభించాను. ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయమేమిటంటే, నేను మా నాన్నగారి స్నేహితుని యింటికి వెళ్ళడం అదే మొదటిసారి. ఆయన నాకు ఆ పుస్తకాన్ని ఇచ్చేముందు కూడా మేము సాయి గురించి కూడా మాట్లాడుకోలేదు.
ఈ సంఘటన నన్ను సాయి పాదాల చెంతకు చేర్చింది .                                     
 
                                        *****************
 
3.  వరంగల్ లో పెద్ద ఆస్పత్రిని నడుపుతున్న ఒక డాక్టర్ గారు తన సోదరికి చెప్పిన బాబా లీలను ఇప్పుడు మీముందుంచుతున్నాను.
 
3 సంవత్సరాలు, 8 సంవత్సరాలు వయస్సుగల ఇద్దరు అన్నదమ్ములు ఇంటి బయట ఆడుకుంటున్నారు. చిన్న పిల్లవాడు బయట పెరడులో ఉన్న మునిసిపల్ వాటర్ సంప్ లో పడిపోయాడు. పెద్దపిల్లవాడు వెంటనె పరిగెత్తుకుని ఇంటిలోకి వెళ్ళి లోపల టీ.వీ. ముందు సీరియల్స్ చూస్తున్న తన తల్లితోను, మిగతావారితోను, జరిగిన విషయం చేప్పాడు. మొదట వారికేమీ అర్ధమవలేదు, తెలిసిన తరువాత వారికి విపరీతమయిన భీతి కలిగింది. పిల్లవాడిని రక్షించడానికి వెంటనే బయటకు పరుగెత్తుకుని వెళ్ళారు. సంపు కి గుండ్రటి మూత ఉంటుంది, ప్రమాదం జరిగినప్పుడు బహుశా మూత సంప్ మీద సరిగా ఉండిఉండదు.
 
వారు భయంతో లోపలికి చూసేటప్పటికి ఏదో మంత్రం   వేసినట్టుగా పిల్లవాడు నీటిపైకి తేలుతున్నాడు, వారు వెంటనె పిల్లవాడిని బయటకు లాగి ప్రధమ చికిత్స చేసి నీటిని కక్కించారు. పిల్లవాడు కొద్ది నిమిషాలు ఏడిచాడు అంతే. వారు వెళ్ళి లోపలకు చూడగానే బాబు నీటిపైకి ఎలా తేలి వచ్చాడో వారికర్ధం కాలేదు.
 
 
బాబుని రక్షించిందెవరో తెలుసుకోవడానికి వారికి అట్టేసేపు పట్టలేదు. అదే సమయంలో బాబు తాత, అమ్మమ్మ షిరిడీలో ఆరతి జరుగుతున్న సమయంలో బాబా ప్రార్ధనలో ఉన్నారు.
 
ఇది నాకు బాబా ధునిలో తన చేతిని  పెట్టి పాపను రక్షించిన సంఘటనని గుర్తుకు తెచ్చింది.
 
సర్వం  శ్రీ  సాయినాధార్పణమస్తు
 
 
 

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List