Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Monday, August 27, 2012

శిఖరాలు - లోయలలో శ్రీ సాయి (రెండవభాగము) - 13

Posted by tyagaraju on 7:20 AM



27.08.2012  సోమవారము
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

 శిఖరాలు - లోయలలో శ్రీ సాయి (రెండవభాగము) - 13

121.  నిజ జీవిత ప్రయాణము నీవాళ్ళతో కలసి సాగించే రైలు ప్రయాణము వంటిది.  ఆధ్యాత్మిక జీవిత ప్రయాణము ఏకాకిగా నింగి నేల కలిసే చోటుకు 
చేరుకోవాలనె తపనతో సాగించే ప్రయాణమువంటిది. 

      - 28.03.94

122.  గతజన్మలో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తము ఈజన్మలో మనము అనుభవించుతున్నాము అని తలచటము ఆధ్యాత్మిక రంగ ప్రవేశ ద్వారము.  తోటిమానవుడు చనిపోయినపుడు అతని శరీరానికి అంతిమ సంస్కారాలు జరుగుతున్న సమయములో మనము శరీర సుఖాలగురించి ఆలోచించటము ఆధ్యాత్మిక రంగ నిష్క్రమణ ద్వారము. 

      - 30.04.94

123.  నాపేరిట గారడీ విద్యలు చేసి చూపించి పొట్ట నింపుకొనే స్వాములువారి దగ్గరకు వెళ్ళటము నీతప్పు.  అంతేగాని ఆస్వాములువారి తప్పు మాత్రము కాదు.

      - 15.05.94

124.  ధన సంపాదన విషయములో పరుగులు పెట్టరాదు.  ఆపరుగులు నీజీవితానికి మెరుగులు పెట్టేబదులు ఆశాంతిని కలిగించుతుంది.    

      - 11.06.94

125.  తగాదాలు, గొడవలు పడవద్దు.  పగవైషమ్యాలు పెంచుకోవద్దు.  వీలు అయితే నీశత్రువులను క్షమించు.  లేదా వాళ్ళనుండి దూరంగా ఉండు.

      - 12.06.94

126.  నీకు సహాయము చేసినవారిని నీవు మరచిపోతున్నావే. మరి నీకు అపకారము చేసినవారిని గుర్తు పెట్టుకోవటములో అర్ధము లేదు.

      - 24.06.94

127.  నాకు నైవేద్యముగా ధనముతో కొన్న బత్తాయి ఫలాలుకంటే చెట్టునుండి రాలిపడిన తాటిపండును సమర్పించితే నేను చాలా సంతోషించుతాను.

      - 11.08.94

128.  జంతువు ప్రాణముతో ఉన్నా లేకపోయినా మానవుడికి ఉపయోగపడుతుంది.  మానవుడు చనిపోయిన తర్వాత ఎలాగు ఎవరికి ఉపయోగపడడు.  అందుచేత మానవుడు బ్రతికి యుండగానే తోటిమానవునికి ఉపయోగపడాలి. 

      - 02.09.94

129.  నాపూజకు మడిబట్టలు, తడిబట్టలు ధరించనవసరములేదు.  శుచి, శుభ్రతయుంటే చాలు.  కొబ్బరిబొండాలు నాకు నైవేద్యముగా పెట్టిన చాలు.  నీయింటికి ప్రసాదము స్వీకరించడానికి వచ్చినవారిలో నన్ను చూసుకొని వారితో ఆప్యాయముగా మాట్లాడినా అదే నాకు నీవు అర్పించే భక్తితో కూడిన పూజ.   

      - 07.09.94

130.  నిలుటద్దములో ఒకసారి నన్ను చూడు.  నానిజస్వరూపము నీకు చూపిస్తాను.  నీవైపు కన్ను ఆర్పకుండ చూస్తాను.  


      - 13.09.94

(యింకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు



Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List