28.08.2012 మంగళవారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శిఖరాలు - లోయలలో శ్రీసాయి (రెండవభాగము) - 14
131. భగవంతుని అన్వేషణలో కావలసిన శక్తిని ప్రసాదించమని శ్రీసాయిని కోరుకో.
శ్రీసాయి శక్తి నీలో ప్రవేశించగానే భగవంతుడు అయస్కాంతములాగ నిన్ను అంటిపెట్టుకొనే యుంటాడు.
- 24.09.94
131. చెడుపని కొంచము చేసిన, ఎక్కువ చేసిన ఫలితము ఒక్కటే అని నీకు తెలిసిన తర్వాత ఆకొంచము పని కూడా చేయటము ఎందుకు? లేనిపోని తలనొప్పి కొనితెచ్చుకోవటము ఎందుకు.
- 24.09.94
132. నీపిల్లలు నీనుండి ఎంత దూరములో ఉన్నా నీవు వాళ్ళ మంచిచెడ్డలు ఆలోచించుతూ ఉంటావే - నీవు తల్లి తాబేలువి. నీపిల్లలు అవతలి ఒడ్డున యున్న పిల్లతాబేళ్ళు. అదే విధంగా నేను తల్లి తాబేలుని. నాభక్తులు పిల్ల తాబేళ్ళు.
- 26.09.94
133. సత్ గురువు చూపిన ఆధ్యాత్మిక రంగపు మెట్లను నీవు ఒక్కడివే ఎక్కగలవు అని తెలిసికూడా మెట్లు ఎక్కుతున్న సమయములో నేను, నావాళ్ళు అని ఆలోచించటములో అర్ధము లేదు.
- 02.10.94
134. నీముసలితనములో కుక్కపిల్లలను చేరదీసి ప్రేమించితే అవి నిన్ను వదలవు.
నీవు చికాకుతో విదిలించుకొన్న రోజున అవి చచ్చిపోతాయి. అది మహాపాపము. ముసలితనంలో ఆధ్యాత్మిక విషయాలు ఆలోచించాలి. కుక్కపిల్లలను చేరదీయకూడదు.
- 02.10.94
135. మనసు కోరికలపుట్ట. ఆకోరికలకు ఆకాశము హద్దు. మనసు అనే రాకెట్టులో కోరికలును తీసుకొని ఆకాశములోనికి వెళ్ళగలము. ఆరాకెట్టులో శక్తి నశించిన తర్వాత తిరిగి అది భూమి మీద పడక తప్పదు అని గుర్తించగలగటమే మనసును అదుపులో పెట్టడము.
- 05.11.94
136. భగవంతుడు మనుషుల యోగక్షేమాలు చూడటానికి ఈభూలోకంలోనికి తన ప్రతినిధులను పంపుతాడు. వారే మానవుల మధ్య తిరుగుతున్న యోగులు.
- 20.12.94
137. సంఘములో పవిత్ర జీవితము గడుపుతున్నవారి యింటి ముంగిట, ఆకాశమునుండి నెమళ్ళు భగవంతుని అనుగ్రహము అనే దీపాలను తీసుకొని వచ్చి వ్రాలుతాయి అని నేను గట్టిగా చెప్పగలను.
- 22.08.97
138. భగవంతుని సేవ చేసుకోవటానికి ఈశరీరము చాలా అవసరము. ఆశరీరాన్ని ఆరోగ్యముగా యుంచుకోవటానికి మితముగా ఆహారము తీసుకోవాలనేది ముఖ్యము.
- 25.08.97
139. నీయింటిలో కష్టాలు వచ్చినపుడు నీవు నీవాళ్ళను వదలి పిరికివాడిలాగా పారిపోవటము మానవతా ధర్మము కాదు. అటువంటి స్థితిని నీజీవితములో రానీయకు.
- 30.08.97
140. అనాధలు, అవటివారు కష్టాలులో యున్నపుడు మానవతా ధర్మముగా నీవు వారిని ఆదుకోవాలి. అటుల చేయనివాడు మానవుడు కాదు వాడు దానవుడు.
- 30.08.97
(యింకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment