12.08.2012 ఆదివారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శిఖరాలు - లోయలలో శ్రీసాయి (రెండవభాగము) - 4
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శిఖరాలు - లోయలలో శ్రీసాయి (రెండవభాగము) - 4
31. ఆధ్యాత్మిక జీవితములో సాక్ష్యాలు - ఆధారాలు ఉండవు. అనుభవాలు, అనుభూతులు మాత్రమే యుంటాయి.
- 05.09.95
32.
నీవు ప్రాపంచిక రంగములో నీఆస్థిని, సంపాదనను భీమా చేసి నిశ్చింతగా
యుంటావే, మరి ఆధ్యాత్మిక రంగములో నీవు సంపాదించినది నాదగ్గర భీమా చేయి.
నేను నీ ఆత్మను పరమాత్మ దగ్గరకు చేర్చుతాను.
- 31.10.95
33. ఆనాడు
అరిషడ్ వర్గాలు అనే హేమమాలిని "వాలి" తన మెడలో ధరించి పతనము చెందినాడు నీవు నీలోని అరిషడ్ వర్గాలును విడనాడి "భగవంతుని" మెడలోని
వైజయంతిమాలగా మారిపో.
- 02.11.95
34. నీవు
నీజీవితములో కష్టాలబాటలో ప్రయాణము సాగించుతున్నపుడు సాయి సత్ చరిత్ర అనే
పసిపాపను నీఒడిలో ఉంచుకో.
ఆపాప చిరునవ్వు నీకష్టాల బాధను మరిపింప
చేస్తుంది. ఆచిరునవ్వు నీకు మానసిక, శారీరిక శక్తిని ప్రసాదించి కష్టాలను
దాటించుతుంది.
- 14.12.95
35. నీవు
నీశత్రువుని శిక్షించటానికి ధనవంతుల సహాయము, స్త్రీల సహాయము కోరవద్దు. నీశత్రువునుండి నీవు దూరముగా యుంటు వారిని మరచిపోవటము నీశత్రువుకి తగిన
శిక్ష.
- 27.15.95
36.
నీగుమ్మములోనికి ధనవంతులు దాహముతో వచ్చిన నీవు ఈర్ష్య, ద్వేషాలులేకుండ
వారికి చల్లని మంచినీరు యివ్వగలిగిన నీవే నిజమైన ధనవంతుడివి.
- 29.12.95
37. నీజీవితములో అరిషడ్ వర్గాలతో జీవించటము అనారోగ్యమునకు మూలము. ఆమూలాన్ని విడనాడటము ప్రశాంత జీవితానికి ఆరంభము.
- 30.12.95
38. మరణము నీనీడలాగ నిన్ను వెంటాడుతూ ఉంటుంది. నీనీడనుండి నీవు ఎంత దూరము పారిపోగలవు. అందుచేత నీనీడను చూసి (మరణాన్ని) భయపడకు.
- 02.01.96
39.
నీయింట దొంగలు పడితే పోలీసులకు ఫిర్యాదు చేసుకొంటావు. మరి నీమనసులో
మమతలు, మమకారాలు అనే దొంగలు పడితే ఎవరితో ఫిర్యాదు చేసుకోవాలి అనే విషయము
ఆలోచించు.
- 11.01.96
40.
మోక్షసాధనలో నీవు నీస్వధర్మము మీదనే ఆధారపడు. స్వధర్మము బావిలోని
నీరువంటిది. పరధర్మము ఎండమావులువంటివి. ఎండమావుల వెనుక పరిగెత్తటములో
అర్ధము లేదు.
-13.01.96
(యింకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment