శిఖరాలు - లోయలలో శ్రీ సాయి (రెండవభాగము) - 9
21.08.2012 మంగళవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శిఖరాలు - లోయలలో శ్రీ
సాయి (రెండవభాగము)
- 9
76. ఆపదలలో ఉన్న తన
పిల్లలను తల్లికోడి తన రెక్కల క్రింద
దాచి కాపాడునట్లుగా
- ఈ ద్వారకామాయి తన
పిల్లలను ఆపదలనుండి రక్షించుకొంటుంది.
- 04.04.97
77. ఇంటిదగ్గర బంగారు
నగలను దాచుకొని
తీర్ధ యాత్రలకు
బయలుదేరి అనుక్షణము యింటదాచిన బంగారు నగలు
గురించి
ఆలోచించుతూ
ఉంటే యింక
ఆ తీర్ధ
యాత్రలకు అర్ధము ఏమిటి ? ఆలోచించు.
- 13.05.97
78. నీతల్లిని గుళ్ళుగోపురాలకు
తీసుకొని వెళ్ళటము ముఖ్యముకాదు. ఆమె ఆఖరి శ్వాస
తీసుకొనే సమయములో ఆమెకు గుక్కెడు
నీరు త్రాగించటము
ముఖ్యము.
- 13.05.97
79. ఆధ్యాత్మిక రంగ
ప్రయాణములో గురువు బస్సు డ్రైవరుగా యుండి
మనలను ముందుకు
తీసుకొనివెళతారు. ఆప్రయాణములో
మధ్యలో ఎవరైనా
దిగిపోతే వారి గురించి ఆడ్రైవరు (గురువు)
బస్సును ఆపరు.
బస్సులో
మిగిలియున్న కొద్దిమందితోను ముందుకు
సాగిపోతారు.
- 13.05.97
80. ఎవరో తప్పుడు
పనులు చేస్తూ
సుఖముగా జీవించుతున్నారు
అని నీవు
గట్టిగా అరచినా
వారు ఆపనిని
మానివేయరు కదా! మంచి మార్గములో
ప్రయాణము చేసేవారికి మాత్రమే సుఖశాంతులు లభించుతాయి. "నీకు
సుఖశాంతులు కావాలి అంటే ఏమి చేయాలి
అనేది నీవు
ఆలోచించుకోవాలి."
- 16.05.97
81. జీవించటానికి కొందరు
శ్రమపడి ఫలాన్ని
సంపాదించుతారు. జీవించటానికి
కొందరు దొంగతనము
చేసి ఫలాన్ని
సంపాదించుతారు. జీవించటము
ముఖ్యము అయినపుడు
జీవించటానికి ఎన్నుకోవలసిన మార్గము కూడా ముఖ్యమైనదేకదా
- నీవు ఎన్నుకోవలసిన
మార్గము నీవిజ్ఞత
మీద ఆధారపడినది.
- 29.05.97
82. జీవించటానికి మానవుడు
ప్రకృతిలోని అడవులను కొట్టివేసి మేడలు కడుతున్నాడు.
ఈప్రపంచములో
జీవించటానికి మానవులకు ఎంత హక్కు ఉందో
అడవులలో జీవించుతున్న
జీవరాశులకు అంతే హక్కు ఉంది
- 29.05.97
83. భగవంతుని గొప్పతనాన్ని
నేను కళ్ళారా
చూసేను. మీకళ్ళకు
ఉన్న అజ్ఞాన
పొరలను తొలగించి
మీలో ఉన్న
జ్ఞానముతో భగవంతుని మీకు చూపటమే నా
కర్తవ్యము.
- 14.06.97
84. వృధ్ధాప్యములో నీకు
మంచినీరు అందించటానికి నీపిల్లలు
నీదగ్గర ఉండనవసరము
లేదు.
నీమనసు మంచిది అయితే నీప్రక్క యింటి
పిల్లవానిని నీపిల్లవానిగా ప్రేమించు. ఆపిల్లవాడే
నీకు గుక్కెడు
నీరు అందించుతాడు
నీ ఆఖరి
క్షణాలలో.
- 14.07.97
85. శ్రీహరిని కీర్తించేవారు
కూడా తమ
ఆయువు తీరిన
వెంటనే శరీరాన్ని
వదలివేస్తారు. శ్రీహరిని
కీర్తించేవారికి ఆయువు పెరగకపోయినా
మరణానంతరము హరిసాన్నిధ్యము కలిగి తీరుతుంది.
- 15.97.97
(యింకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment