Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Sunday, September 16, 2012

శ్రీ శివ స్వరూపము - సాయి (2 వ.భాగము)

Posted by tyagaraju on 7:45 AM
శ్రీ శివ స్వరూపము - సాయి (2 వ.భాగము)
                                           
                                                  
                                         
16.09.2012  ఆదివారము 
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు


శివ మహాపురాణము నుండి

విద్వేశ్వర  సం హితలో --

పరమ శివుడు స్వయముగా అన్నమాట  "నాకు లింగానికి, లింగానికి మూర్తిత్వానికి ఏవిధమైన భేదము లేదు. 


నిత్యం  లింగారాధన చేయండి.  ఎక్కడ లింగ ప్రతిష్ఠ జరుగుతుందో అక్కడ మాత్రం తప్పకుండ నేను ఉంటాను."

శ్రీ సాయి సత్ చరిత్రలో - శ్రీసాయి స్వయముగా అన్నమాటలు.  "నాకు నాపటానికి తేడా లేదు" (41 వ. అధ్యాయము).(హేమాద్రిపంతు యింటికి హోళీ పండగనాడు పటము రూపములో వెళ్ళడము) 
బాబా మహా సమాధి అనంతరము బాబా విగ్రహాలు ప్రతిష్టింపబడినవి.  సాయి విగ్రహానికి శ్రీసాయికి తేడా లేదు అని గ్రహించాలి.  శ్రీసాయి మేఘుని గదిలో అదృశ్యరూపములో వెళ్ళి అక్షింతలు చల్లి త్రిశూలము గీయమని ఆదేశించి 

మరుసటిరోజున గురుస్థానములో శివలింగ ప్రతిష్ఠ చేయించినారు.  ఆయన శివస్వరూపుడు.  అందుచేత ప్రతి సాయి మందిరము గుమ్మములో నంది విగ్రహములు  ప్రతిష్టించబడుతున్నాయి. 
రుద్ర సం హితంలో : -- బ్రహ్మ నారదునితో అన్న మాటలు " నీయందు నాయందు, మన అందరియందు ఉన్నవాడు ఆశివుడే.  మన అందరి విభూతులు కూడా ఆశివుడే.  ఆయన తప్ప మరేదీ లేదనీ తెలుసుకొని ఆయనను ఆరాధించువాడు తరించుతాడు."

శ్రీ సాయి సత్చరిత్ర 15వ. అధ్యాయములో బాబా స్వయముగా అన్నమాటలు.  నానివాస స్థలము మీహృదయమునందు గలదు.  నేను మీశరీరములోనే యున్నాను.  ఎల్లపుడు మీహృదయములోను, సర్వజన హృదయములందు గల నన్ను పూజింపుడు."

విద్యేశ్వర సం హితములో.--

బిల్వమహిమ : బిల్వ వృక్సము శివస్వరూపం.  బిల్వవృక్షమూలాన్ని గంధ పుష్పాదులతో పూజించిన వంశాభివృధ్ధి కలుగుతుంది.  


(బిల్వాష్టకం - విని ఆస్వాదించండి)


http://www.youtube.com/watch?v=kCNSY19DK4Q  

బిల్వ వృక్షం చుట్టూ దీపాలు పెట్టినవారికి శివ జ్ఞానం సిధ్ధిస్తుంది.  ఒక శివభక్తునికి బిల్వ వృక్షము క్రింద పరమాన్నం మరియు నెయ్యి సమర్పించిన మరి ఏజన్మలోను కూడా దరిద్రుడు కాడు.

శ్రీ సాయి సత్చరిత్ర - (28 వ. అధ్యాయం) మేఘశ్యాముడు మకరసంక్రాంతినాడు శ్రీసాయిని శివ స్వరూపముగా భావించి ఆయన శిరస్సుపై మారేడు (బిల్వదళాలు)
 

పెట్టి గోదావరినుండి తెచ్చిన నీరుతో అభిషేకము చేసి శ్రీసాయి అనుగ్రహాన్ని పొందినాడు.  శ్రీసాయిస్వయముగా ద్వారకామాయిలో వంటలు చేసి అన్నదానము చేసి యున్నారు.


రుద్ర సం హిత : 

రుద్ర సం హితలో బీదవారికి అన్నదానం గురించి ప్రముఖంగా చెప్పబడింది. అన్నదానము చేసేటప్పుడు తర తమ భేదములు లేకుండా చేయాలి. 

ఉమరుద్ర సం హిత : -

అన్నదానము : అన్నం తినడము వలన ప్రాణము నిలబడుతోంది.  కాబట్టి అన్నము పెట్టినవాడు ప్రాణం పోసిన వాడితో సమానము.  ప్రాణాన్ని మించి మరేదీ లేదు.  కనుక అటువంటి ప్రాణం నిలిపే అన్నదానము వలన అన్నిదానాలు చేసిన  ఫలము లభించుతుంది.  ఎంత పాపాత్ముడైన అన్నము లేక మరణించబోతున్న సమయములో అతనికి అన్నము పెట్టి అతని ప్రాణాన్ని కాపాడగలిగితే దానిని  మించిన పుణ్యకార్యము యింకొకటి లేదు.  అందుచేత ఆకలితో ఉన్నవాడికి అన్నము  పెట్టాలి.

సాయి సత్ చరిత్ర : 38 వ. అధ్యాయము : బాబా స్వయముగా రెండు గుండిగలలో అన్నము వండి అన్నదానము చేసేవారు.  

బాబా స్వయంగా అన్నమాటలు. "మిట్టమధ్యాహ్న్నమున మన యింటికి అతిధి వచ్చిన వానిని ఆదరించి భోజనము పెట్టాలి.  ఆహారము పరబ్రహ్మస్వరూపము.  ఆహారమునుండి  సమస్త   జీవులూ ఉద్భవించినవి.  చచ్చిన పిమ్మట అవి తిరిగి ఆహారములో ప్రవేశించును.

బాబా స్వయముగా చక్కెరపొంగలి, పప్పుచారులో గోధుమపిండి బిళ్ళలు వేసి చక్కగా చారు చేసేవారు.  జొన్నపిండిని ఉడకబెట్టి మజ్జిగలో కలిపి వడ్డించేవారు. పలావు తయారు చేసేటప్పుడు వేడి గుండిగలో తన చేయి పెట్టి కలిపేవారు.  

(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు




Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List