Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, September 15, 2012

శ్రీ శివ స్వరూపము - సాయి

Posted by tyagaraju on 9:54 AM



సాయి బంధువులకు ఒక మనవి.

14.09.2012 న "బాబా నాపెళ్ళికి సర్వం సమకూర్చారు" ప్రచురించాను.  ఈరోజు సాయిబంధువులలో ఒకరు  నాకు ఫోన్ చేసి ప్రచురణ  మీద 
కొంత సద్విమర్స చేయడం జరిగింది.  వారి 
విమర్శ ను సంతోషంగా అంగీకరిస్తున్నాను.  ఇది శ్రిమతి ప్రియాంకా రౌతేలాగారి బ్లాగు లొ ప్రచురింపబడటంవలన దీనిని అనువాదం 
చేయడం జరిగింది.  ఇందులో అనుభవాన్ని రాసిన ఆమె కూడా తాను ఇటువంటి క్లిష్ట దశవలననే బాబాను తెలుసుకోగలిగాను అని చెప్పడం,
 ఆమె బెంగళూరులోని స్థూపానికి కూడా ప్రదక్షిణలు చేసి శ్రధ్ధగా బాబాని ప్రార్ధించడం వీటినే దృష్టిలో పెట్టుకుని ప్రచురించడం జరిగింది.  ఇది మరెవరికయినా అభ్యంతరకరంగా ఉంటే మన్నించవలసినదిగా కోరుతున్నాను.  ఇక ముందు ఇటువంటి పొరపాటు జరగకుండా 
మన బ్లాగు పూర్తిగా సాయి భక్తికే అంకితమయేలా చూస్తానని మనవి చేసుకుంటున్నాను. దీనిమీద అందరి అభిప్రాయాలను కోరుతున్నాను.

మన సద్గురువు బాబా కి క్షమాపణలతో

మీ అభిప్రాయాలను నా మెయిల్ ఐ.డీ.కి పంపండి. లేదా నాకు ఫోన్ చేయండి. ఫోన్ నంబరు: 9440375411 

ఈ రోజునుండి సాయి.బా.ని.స. శ్రీ శివస్వరూపము - సాయి ప్రారంభిస్తున్నాను.  మీ అభిప్రాయాలను కూడా నాకు తెలపండి.

త్వరలో మీకు అధ్బుతమైన "శ్రీ సాయితో మధుర క్షణాలను" 
అందిస్తాను.  ఈ లీలలను మనకు ప్రతీక్షణం బాబాను తలపుకు 
తెస్తాయి . సాయి భక్తిలో ఓలలాడుతాము.  

మీరు చదివే ప్రతీ ప్రచురణకి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో 
తెలిపినా సరే, నాకు మెయిల్ చేసినా సరే.  tyagaraju.a@gmail.com

ఓం సాయిరాం. 






శ్రీశివ స్వరూపము - సాయి



                                                
                               
15.09.2012 శనివారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజునుండి సాయి.బా.ని.స. రచించిన "శ్రీ శివస్వరూపము - సాయి" ప్రచురిస్తున్నాను.  మన సాయి బంధువులలో కొంతమందికి కొన్ని సందేహాలు ఉండవచ్చు.  ఉదాహరణకి - సాయి మందిరంలో సాయికి ఎదురుగా నంది విగ్రహం ఎందుకు ఉంటుంది, సాయి మెడలో రుద్రాక్ష మాల ఎందుకు ఉంటుంది అని సందేహాలకు సమాధానం ఈ శివస్వరూపములో - సాయి లో లభిస్తాయి.  
                           


సాయి.బా.ని.స.రచించిన తమ అమూల్యమైన రచనలను నాద్వారా మన సాయిబంధువులకు అందచేసే భాగ్యాన్ని కలిగించినందుకు మొదటగా సాయి మహరాజ్ కి, సాయి.బా.ని.స.కు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 

శివమహాపురాణం ఆవిర్భావం 

మనకు పచ్చని ప్రకృతి, నదీనదాలు,పవిత్ర నదీ జలాలు,  పక్షుల కిలకిలారావాలు అన్నికూదా భగవంతుడు మంకిచ్చిన వరప్రసాదం. గంగా నదిఒడ్డున వున్న "ప్రయాగ" మనకు లభించిన పుణ్యక్షేత్రాలలో ఒకటి. ప్రయాగ హిందువులకు పవిత్రక్షేత్రం. శ్రీమహావిష్ణువు యొక్క చరణకమలాలనుంచి ఉద్భవించిన గంగా నది ఇక్కడ ప్రవహిస్తున్న కారణంగానే ఇది పవిత్ర క్షేతమైంది.  గంగా యమునలు రెండూ ఇక్కడ కలసికొని ఒక్కటిగా ప్రయాగనుంచి ప్రవహిస్తున్నాయి. 

పూర్వకాలంలో సౌనకమహాముని తన శిష్యులతో ప్రయాగలో మహాశత్ర యాగాన్ని చేశారు.  ఎంతోమంది సాధువులు, మహర్షులు, తపస్వులు విచ్చేసి ఆయాగాన్ని తిలకించారు. సూతమహాముని కూడా తన 
శిష్యులతో ఆయాగానికి విచ్చేశారు.

సూతమహాముని రోమహర్షుని కుమారుడు.  ఆయన వేదవ్యాసుల
వారికి ప్రియ శిష్యుడు. త్వరలోనే సూతమహాముని సకల శాస్త్ర పారంగతుడయ్యాడు. వేదవేదాంగాలన్నిటినీ కూలంకషంగా 
అధ్యయనం చేశాడు. సూతమహాముని కూడా యాగానికి
 వేంచేస్తున్నారని తెలిసి మహర్షులందరూ ఎంతో సంతోషించారు.  ఆయనకు స్వాగతం చెప్పడానికి చాలా ఆత్రుతతో వేచి ఉన్నారు. ప్రముఖులందరూ అక్కడకు చేరి సూతమహాముని పాండిత్యాన్ని 
ఎంతగానో శ్లాఘించారు. 

సహజంగానే, అక్కడున్నవారందరూ తమకేదయిన  మంచి మంచి విషయాలు, ముఖ్యమైనవి, నూతనమైనవి చెప్పమని సూతమహా
ముని వద్ద తమ కోరికను వెల్లడించారు. యాగం జరుగుతున్న శుభసందర్భములో అది ఆయన తమకిచ్చే ఆశీర్వాదముగా
 భావిస్తామని చెప్పారు. తమకు జీవితంలో ప్రతీరోజు సుఖ
శాంతులు కలగడానికి, తమలో భక్తిభావం మరింతగా 
పెంపొందడానికి అవసరమైన విషయం మీద 
ఉపదేశాన్నిమ్మనమని అందరూ ఏకకంఠంతో కోరారు. 

పాపాలు తొలగించుకొని ప్రాపంచిక విశాయాలనుండి  ముక్తిని 
పొందడానికి చేయవలసిన దానిమీద సంభాషణ చేస్తానని 
సూతమహాముని చెప్పారు. స్వయంగా భగవానుడే సృష్టించిన
 దానిని ప్రస్తుతిస్థూ శివమహాపురాణం జ్ఞానాన్ని కలిగించి 
భగవంతునిపై విశ్వాసాన్ని పెంపొందిస్తుందని సెలవిచ్చారు. శివమహాపురాణం అజ్ఞానాన్ని కూకటివేళ్ళతో సహా నిర్మూలించి , 
జ్ఞానజ్యోతి వెలిగి భగవంతునిగురించి ఆయన చేసే పనుల  
గురించి అర్ధమయేలా చేస్తుందని వాక్రుచ్చారు. 

గతంలో మీరు విన్నదానికి ఈ "శివమహా పురాణానికి" వ్యత్యాసం 
ఉంది.  క్రమం తప్పకుండా "శివ మహాపురాణం" చదివేవారికి ఆత్మ
 జ్ఞానం సిధ్ధిస్తుంది. శివ మహాపురాణాన్ని ఒక్కసా రి విన్నా 
పాపాలన్నీ  పటాపంచలయిపోతాయి. ఎవరయితే చతుర్దశినాడు 
శివమహాపురాణాన్ని భక్తులందరికీ చదివి వినిపిస్తారో  వారు 
అందరిచేత గౌరవింపబడతారు.  

శ్రీ శివ స్వరూపము - సాయి

                            గురుగీత

గురుగీత స్కాంధ పురాణములో ఉంది.  దీనిని "సనత్కుమార సం హిత" అని కూడా అంటారు. సనత్ కుమార సం హిత మూడు అధ్యాయాలుగా విభజింపబడింది. పార్వతీ పరమేశ్వరుల మధ్య సంవాద రూపములో నడచిన పవిత్ర విషయమే గురుగీత.

భగవంతుని గురించి తెలుసుకొనగోరేవారికి ఇది జ్ఞాన జ్యోతి. 

గురువు చూపిన మార్గాన్ననుసరించాలి. మనలని ఆవరించిన 
మాయను తొలగించుకోవడానికి ప్రయత్నించి, మనలో ఆత్మ
జ్ఞానాన్ని  పెంపొందించుకునేదుకు కృషి చేయాలి. 
                         ***********


ఓం శ్రీ గణేసాయనమహ - ఓం శ్రీ సరస్వత్యైనమహ - ఓం శ్రీ సమర్ధ సద్గురు సాయినాధాయనమహ 

బాబా 15 వ. అధ్యాయములో తాను తన భక్తులకి సేవకుడినని చెప్పారు. తాను అందరి హృదయాలలో నివసించుతున్నానని చెప్పారు.  అసలు విషయానికి వచ్చేముందు సాయిబానిసగా మీకు నానమస్కారాలను తెలియచేసుకుంటున్నాను. 


1992 లో సాయి నాకు ప్రీతిపాత్రమైన శివస్వరూపములో స్వప్నదర్శనమిచ్చారు.  
తరువాత నేను షిరిడీ సందర్శించినపుడు 
అక్కడ ఒక షాపులో సరిగా నేను స్వప్నము
లోనే చూచిన ఫోటో కనపడింది.  దానిని కొని గుర్తుగా నావద్ద 
ఉంచుకొన్నాను. నేను శివమహాపురాణాన్ని చదువుతున్నపుడు అడుగడుగునా నేను సాయినే శివుడిగా అనుభూతి చెందాను. 
గురుగీతనుచదువుతున్నపుడు, సాయే నాసద్గురువుగా  
కనిపించారు. 

ఈనాటి నా ఉపన్యాసంలో, శివమహాపురాణం, గురుగీత, సాయి 
సత్చరిత్ర ఈ ముడింటిలోని సారూప్యాలను వివరించడమే నా ముఖ్యోద్దేశ్యం.  

సూతమహాముని మునులకు, తపస్వులకు చెప్పినదే శివ
మహాపురాణం. సాయినాధుని ఆశీర్వాదముతో హేమాద్రిపంత్ 
సాయి భక్తులకు సాయి సత్చరిత్రను అందించారు. 

శివమహాపురాణములో 7 సం హితాలు ఉన్నాయి. 1) విద్యేశ్వర, 
2) రుద్ర 3) శతరుద్ర, 4) కోటిరుద్ర 5) ఉమా 6) కైలాస 
7) వాయనిస సం హిత. శ్రీ సాయి సత్చరిత్రలో 51 అధ్యాయాలు ఉన్నాయి.  గురుగీత స్ఖంధ పురాణంలో ఒక భాగం. ఇదే 
సనత్కుమార సం హిత.   గురుగీతలోని 351 శ్లోకాలు గురువు
యొక్క గొప్పతనాన్ని వివరిస్తాయి. అటువంటి గొప్ప 
లక్షణాలన్నిటినీ నేను శ్రీ షిరిడీ సాయిబాబాలో చూడగలిగినాను. 


ఈ గురుగీతలోని 351 శ్లోకాలు - గురువుయొక్క లక్షణాలుగురువు
యొక్క గొప్పతనాన్ని తెలియ చేస్తాయి. ఈ లక్షణాలుగొప్పతనాన్ని - శ్రీశిరిడీసాయిలో నేను చూడగలిగినాను.  శ్రీశిరిడీసాయి నాకు 1992 లో శివస్వరూపములో దర్శనము ఇచ్చి అదే దృశ్యాన్ని---

శిరిడీలో పటము రూపంలో నిర్ధారణ చేసినారు. శ్రీసాయిని శివస్వరూపముగా నేను పొందిన అనుభూతులను మీముందు  ఉంచుతాను.


(యింకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List