25.09.2012 మంగళవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ శివస్వరూపము - సాయి
(8 వ. భాగము)
గురుగీత 292 వ. శ్లోకం:
ఏ మహాత్ముని దర్శింపగనే
మనస్సు ప్రశాంతతను పొందునో, ధైర్యము శాంతి స్వయముగా లభించునో అట్టి మహితాత్ముడు పరమ
గురువనబడును.
శ్రీసాయిని దర్శించిన
హేమాద్రిపంతు - కాకా సాహెబ్ దీక్షిత్ - నానా సాహెబ్ చందోర్కర్ - సోమదేవస్వామి,
మొదలగువారు సాయిని చూడగనే వారి మనసుకు ప్రశాంత
కలిగినది. అదే తమ జీవితములో విశ్రాoతి
ధామము అనిరి.
గురుగీత 294 వ.శ్లోకం:
ఎవడు కామినీ కాంచనముల
యందలి మోహము నశింపచేసి తన దేహమును శవముగా దర్శించుచు అద్వితీయమైనన ఆత్మను నిత్యము
దర్శించునో అతడే పరమ గురువు.
శ్రీ సాత్యి సత్చరిత్ర 14వ. అధ్యాయములో శ్రీసాయి కాంతా కనకములకు దూరముగా యుండాలి అని
తాను స్వయముగా ఆచరించి తన భక్తులను పరీక్షంచేవారు. బాబా భక్తులను బడికి (రాధాకృష్ణ మాయి యింటికి)
పంపేవారు.
తనవద్దకు వచ్చిన భక్తులలో ఎవరికయితే ధన వ్యామోహము వుందో
వారినుండి మాత్రము మాటిమాటికి గురు దక్షిణ అడిగి వారిలో ఉన్న
ధనవ్యామోహాన్ని తొలగించేవారు.
వారినుండి మాత్రము మాటిమాటికి గురు దక్షిణ అడిగి వారిలో ఉన్న
ధనవ్యామోహాన్ని తొలగించేవారు.
గురుగీత 324 వ. శ్లోకం:
ఏగురుదేవునికి ఆది
మధ్యoతములు లేవో, కరచరణాలు లేవో, ఎవరు పురుషుడు కాడో , స్త్రీ కాడో , నపుంసకుడు కాడో, ఎవరికి ఆకారము
లేదో, వికారములేదో, పుణ్యపాపాలు లేవో, అసత్యము లేదో, ఏకమై సమరసమై యుండునట్టి
గురుదేవునికి నమస్కారము చేయుచున్నాను.
శ్రీ సాయి ధులియా
కోర్టులో తన వయసు లక్షల సంవత్సరాలు అని చెప్పెను.
తనకు పేరు లేదు. తనను సాయిబాబా అని
అంటారు అన్నారు. శ్రీసాయి సత్ చరిత్ర 28 వ. అధ్యాయం.
గురుగీత 342 వ.శ్లోకం.
శివుడు కోపించిన గురువు రక్షించును. గురువు కోపించిన శివుడు కూడా రక్షించలేడు.
కనుక
అన్నిప్రయత్నముల ద్వారా గురుదేవుని ఆజ్ఞను దాటకూడదు.
భీమాజీ పాటిలును మృత్యు
ముఖమునుండి సాయి (గురువు) రక్షించి హరికనాడే సాయి మాటను లెక్కచేయక తిరిగి
వ్యభిచారము చేసెను. మరణించెను.
గురుగీత 351 వ.శ్లోకం:
అజ్ఞానమనే చీకటిచే
గ్రుడ్డివాడనే విషయములయందు ఆసక్తి గల చిత్తము గల నాకు జ్ఞాన ప్రకాశమును
ప్రసాదించి తరింపచేయుము గురుదేవా (నా సాయి దేవా!)
సమాప్తము
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment