Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Monday, September 24, 2012

శ్రీశివ స్వరూపము - సాయి (7వ. భాగము

Posted by tyagaraju on 7:01 AM

                                                

                              


24.09.2012  సోమవారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు


శ్రీశివ స్వరూపము - సాయి (7వ. భాగము)

గురుగీత 145 వ. శ్లోకం :

ఎవరైన గురువును నిందించినను  అతని మాటను ఖండించవలెను.  

అలాచేయుటకు అసమర్ధుడైనచో వానిని దూరముగా పంపవలెను.  


అదియు వీలుగానిచో అట్టి దుష్టునినుండి తానే దూరముగా వెళ్ళవలెను.

శిష్యులు తమ గురుభక్తిని ప్రదర్శించటానికి యిది చక్కని మార్గము.  బాబా 

ఏనాడు తన భక్తులను/సేవకులను  వివాదములలో దిగనీయలెదు. 

ఒకసారి (2వ.అధ్యాయము) బాలా సాహెబు భాటే (డిప్యూటీ కలెక్టర్  కోపర్ గావ్) కు, అన్నసాహెబ్ ధబోల్కర్ హేమాద్రిపంతుకు గురువు యొక్క ఆవశ్యకత పై వివాదము శిరిడీ సాఠేవాడాలో జరిగెను.  ద్వారకామాయిలో బాబా దానిని గ్రహించి   కాకా సాహెబ్ దీక్షిత్ ని పిలిచి "సాఠేవాడాలొ ఏమి జరిగినది?" ఏమిటావివాదము?  అది దేనిని గురింఛి ? ఈహేమాద్రిపంత్ ఏమి పలికెను?"  అని పలికి హేమాద్రిపంతు మనసులోని చికాకును తొలగించెను.

గురుగీత 149 వ. శ్లోకం:

మునుల చేత, నాగులచేత, దేవతల చేత శంపించబడినను తుదకు మృత్యు భయమునుండి కూడా గురుదేవుడు శిష్యుని రక్షించుచున్నాడు. 

శ్రీ సాయి సత్  చరిత్ర  ::  భీమాజీ పాటిల్ క్షయ రోగము, తాత్యాకోతే పాటిల్ - అనారోగ్యము, గోపాల్ ముకుంద్ బూటీ, మిరికర్ ల సర్పగండము.

గురుగీత 172 వ.శ్లోకం:


పార్వతీ ! జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము, కీర్తి, శ్రీ ,  మరియు  

పూర్ణత్వము ఈ ఆరు ఐశ్వర్యములతో కూడిన భగవానుడు గురుదేవుడు.


      శ్రీ సాయి ఈ ఆరు లక్షణాలు కలిగిన భగవానుడు.

గురుగీత 174 వ. శ్లోకం:

ఏపరమ పురుషుడు ఏకాకియై, స్పృహలేనివాడై, శాంతరూపుడై, దఃఖము, అసూయ లేక బాలుని వలె ప్రకాశించునో , బ్రహ్మజ్ఞాని అని అందరిచేత పిలువబడును. 

శ్రీసాయి సత్ చరిత్ర 4 వ.అధ్యాయము : 1854 వ. సంవత్సరములో బాబా మొట్టమొదటిసారిగా వేప చెట్టుకింద 16 సంవత్సరాల బాలునిగా కనిపిం చారు. 

బాహ్యంగా బ్రహ్మజ్ఞానివలె ప్రకాశించారు. కలలోనైనా ఆయన ప్రాపంచిక కోరికలకు ఆశ పడలేదు. 

గురుగీత 179వ. శ్లోకం:

గురుమార్గమును అనుసరించువారికి ఉత్తమమగు మోక్షము లభించుచున్నది.  అందువలన మోక్షము కోరువాడు గురుభక్తి కలిగి యుండవలెను.

శ్రీసాయి సత్ చరిత్ర 31వ. అధ్యాయము: శ్రీసాయిని గురువుగా పూజించి మోక్షమును పొందినవారు. 1) తాత్యాసాహెబ్ నూల్కర్ 2)బాలారాం మాన్ కర్  3) విజయానందుడు 4) మేఘశ్యాముడు. మనము కూడా ఆ సద్గురుని అడుగుజాడలలో నడిచి మోక్షసాధనకు ప్రయత్నించాలి. 

గురుగీత 288 వ. శ్లోకం:

పార్వతీ, జలములన్నిటికీ సముద్రము ఏలాగున రాజో, అలాగే ఈ గురువులందరికీ పరమ గురువు రాజుగా చెప్పబడును. 

శ్రీ సాయిని యోగిరాజు, రాజాధిరాజుగాను, యోగులకు సామ్రాట్ గాను శ్రీ మెహర్ బాబాగారు చెప్పిరి. 
 వాసుదేవానందస్వామి, టెంబేస్వామి, శ్రీసాయికి తమ ప్రణామాలు చెప్పి శ్రీసాయిని తమ గురువుగా పేర్కొనిరి.  


(యింకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు    

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List