20.09.2012 గురువారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీశివస్వరూపము - సాయి (6వ.భాగము)
గురుగీత 84 వ.శ్లోకం:
అజ్ఞానమనే కాల సర్పముచే
కాటు వేయబడిన జీవులకు గురువు చికిత్స చేయు వైద్యుడై యున్నాడు. కనుక అతడు జ్ఞాస్వరూపుడగు భగవంతుడు. అట్టి గురుదేవునికి వందనము.
మాధవరావు దేశ్ పాండే
(((శ్యామా) కు పాము కాటు వేసినపుడు అతడు అజ్ఞానముతో శ్రీసాయి ద్వారకామాయి మశీదులో
యున్నాడు అనే భావనతో తనను రక్షించమని పరిగెత్తుకొని వచ్చినపుడు శ్రీసాయి అతని
అజ్ఞానము తొలగించటానికి కోపగించి అతనిలోని విషాన్ని దిగు దిగు అని శాసించి
శ్యామాను రక్షించెను
గురుగీత 98 వ.శ్లోకం:
గురువుకు సాష్ఠాంగ
నమస్కారము చేయవలెను. అంటే చేతులచే, పాదాలచే, మోకాళ్ళచే, వక్షస్థలముచే,
శిరస్సుచే, నేత్రములచే, మనసుచే, వాక్కుచే చేయునట్టి నమస్కారము.
హాజిసిధ్ధికి ఫాల్కే
విషయములో శ్రీసాయి అతనినుండి తన్, మన్, ధన్, కోరినారు. శరీరము
విషయము
వచ్చేసరికి శరీరానికి శక్తినిచ్చే మాంసము కావాలా, శరీర కోరికలు తీర్చే వృషణాలు కావాలా, లేక
భగవంతుని సాష్ఠాంగ నమస్కారము చేయటానికి శరీర ఎముకలలో
శక్తిని కలిగించే మేక ఎముకలు
కావాలా అని అడగటములో అర్ధమును మనము గ్రహించాలి. శరీరములో ఎముకల శక్తి లేకపోతే సాష్ఠాంగ
నమస్కారము చేయలేము.
గురుగీత 113 వ. శ్లోకం:
మనము సంపూర్ణ గురువుకు
నమస్కరించవలెను. తెల్లని వస్త్రములు
ధరించినవాడు, శ్వేత పుష్పములను,
గంధమును, ధరించినవాడు, ముత్యాలహారము గలవాడు, సంతోషము కలవాడు
దయ జ్ఞానము అనెడి రెండు నేత్రాలు కలవాడు, ఎడమతొడ పీఠమున కూర్చుని యున్న
దివ్యశక్తి కలిగిన ఈశ్వరస్వరూపుడు, చిరునవ్వుకలవాడు,
పూర్ణదయాళువు, సంపూర్ణగురువనబడును.
శ్రీసాయి సత్ చరిత్ర 22వ. అధ్యాయము : శ్రీసాయి బండరాయి మీద కూర్చున్న పధ్ధతి
చూడండి. ఎటువంటి మనోహరమైన దృశ్యం. కుడి కాలు ఎడమకాలు మోకాలిమీద వేసి కూర్చుని వుంటారు.
జీవితాంతము ఆయన తెల్లని కఫనీ ధరించారు. మహల్సాపతి ఆయన కంఠానికి గంధాన్ని పూశారు.
చావడిలో శేజ్- ఆరతి సమయములో భక్తులు ఆయన మెడలో ముత్యాల దండను అలంకరించేవారు.
మనమందరమూ కూడా ఆ మనోహరమైన దృశ్యాలను మరొక్కసారి జ్ఞప్తికి తెచ్చుకుని గురువుయొక్క
దివ్యస్వరూపాన్ని మనసులో నింపుకొని సంతోషాన్ననుభవిద్దాము.
గురుగీత 139 వ. శ్లోకం:
గురుదేవుని ఆశ్రమములో
చెడుపానములు చేయకూడదు. వ్యర్ధముగా
తిరుగకూడదు. దీక్షలు యివ్వకూడదు. స్వేచ్చగా వ్యాఖ్యలు చేయకూడదు. అధికారము చెలాయించకూడదు. గురువు పేరుతో తాను ఆజ్ఞలు జారీ చేయకూడదు.
ద్వారకామాయిలో బాగా
చదువుకొన్న ఖపర్దే - తాత్యాసాహె నూల్కర్ - బూటీ, శ్రీసాయి ముందు ఏనాడు నోరువిప్పి మాట్లాడలేదు. శ్రీసాయి చెప్పినవి వినేవారు. శ్యామా - మహల్సాలు - ఎవరికీ దీక్షలు యివ్వలేదు.
శ్రీసాయి మహాసమాధి అనంతరము ముక్తారాం అధికారము చెలాయించ చూసెను. ద్వారకామాయిలో శ్రీసాయి పీఠముపై కూర్చుoడబోవ
పిఱ్ఱలనుండి రక్తము కారెను.
గురుగీత 142 వ. శ్లోకం:
గురువు ప్రసాదించని
ధనమును అనుభవించరాదు. గురువు అనుగ్రహించిన
ధనమును దాసునివలె గ్రహించవలెను. అలాగ
గ్రహించుటవలన ఆత్మ రక్షణ కలుగును.
ద్వారకామాయిలో హన్సరాజు,
మహల్సాపతికి వెయ్యి వెండినాణాలు బహూకరింపబోయిన
శ్రీసాయి అంగీకరించలేదు. మహల్సాపతి
స్వీకరించలేదు. శ్రీసాయి రోజూ సాయంత్రము
తాను భక్తులనుండి దక్షిణగా స్వీకరించిన ధనాన్ని పేదలకు పంచిపెట్టేవారు అనే
విషయాన్ని మర్చిపోరాదు.
(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment