Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Wednesday, September 19, 2012

శ్రీశివ స్వరూపము - సాయి (5వ.భాగము)

Posted by tyagaraju on 7:50 AM

                                                             
                                                 
19.09.2012  బుధవారము
 ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు

ఈ రోజు వినాయయక చవితి.  పొద్దుటినించి పూజలు చేయించుకుని మన గణపతి విశ్రాంతి తీసుకుంటున్నాడు. 


శ్రీశివ స్వరూపము - సాయి (5వ.భాగము)

గురుగీత 50 - 51 - 52 శ్లోకములు:

శిష్యుడు గురువుని సంతోషపరుచుటకు, ఆసనము - శయ్యను, వస్త్రమును - ఆభరణములను ఈయవలెను. 


కర్మ చేతను, మనసుచేతను, వాక్కు చేతను నిత్యము గురువుని ఆరాధించవలెను.  
దేహమును, యింద్రియములను, ప్రాణమును, ధనమునుసేవకులను, భార్యాపుత్రులను, తనవారినందరిని గురు సేవలో వినియోగించవలెను.   

శ్రీసాయి సత్చరిత్ర 6 - 10 వ. అధ్యాయములు: సాయి భక్తులు ద్వారకామాయిని బాగుచేసి  శ్రీ సాయి కూర్చుండుటకు ఆసనము - పరుండుటకు పనస చెక్క బల్ల - 
ధరించటానికి కఫనీలు - 

శేజ్ ఆరతి సమయములో ఆయన చేత ఆభరణాలు  ధరింపచేయుట చేసేవారు.  మేఘశ్యాముడువంటి భక్తుడు ఒంటికాలిపై నిలబడి శ్రీసాయికి ఆరతి ఇచ్చేవాడు.  బాలాజి    పాటిల్ నెవాస్కర్ శ్రీసాయి సేవలో తన శరీరాన్నే కాకుండ తన పొలమునుండి వచ్చిన పంటను శ్రీసాయికి అర్పించేవాడు.  తన భార్యపుత్రుల చేత కూడ గురుసేవ చేయించేవాడు.  శ్రీసాయి ఈతని భక్తికి మెచ్చి కుటుంబ సభ్యులు అందరికి  బట్టలు, ధనము ఇచ్చేవారు. 

అవిద్య అనెడి చీకటిచే దృష్టి లోపించినవానిని జ్ఞానము అనెడి కాటుక పుల్లచే ఏగురువు నేత్రములను తెరిపించి దృష్టిని ప్రసాదించునో అట్టి గురుదేవునికి వందనము.   

శ్రీసాయి సత్ చరిత్ర 18,19 అధ్యాయములు -  సాయి సద్విచారములను ప్రోత్సహించి సాక్షత్కారమునకు ఎట్లు దారి  చూపుచుండెడివారో మనకు తెలుసు.  ఒక బుధవారము రాత్రి హేమాద్రిపంతు రాత్రి పరుండేముందు యిట్లు తలచెను.  రేపు  గురువారము శుభదినము.  శిరిడీ పవిత్రమైన స్థలము కావున రేపటిరోజు అంతా రామనామ స్మరణతోనే కాలము గడపవలెను అని నిశ్చయించుకొనెను.  శ్రీసాయి దయామయుడు.  గురువారము తెల్లవారుజామున ద్వారకామాయిలోనుండి ఒక చక్కని పాట వినవచ్చెను.  అది "గురుకృపాంజనపాయో మేరీ భాయి" అంటే గురువు కృప అనే అంజనము లభించినది.  దాని వలన తన కండ్లు  తెరవబడినను, దాని చేత తాను శ్రీరాముని లోపల, బయట, నిద్రావస్థలోను, జాగ్రదావస్తలోను, స్వప్నావస్థలోను, చూడగలుగుతున్నాను.  శ్రీసాయి ఈవిధముగా హేమాద్రిపంతు యొక్క మనోనేత్రాలు తెరిపించి దృష్ఠిని ప్రసాదించును.  అట్టి సాయినాధునికి సాయి భక్తులందరము  వందనము చేద్దాము.  

గురుగీత 80 - 81 శ్లోకములు:

కష్ఠ పరిస్థితి వచ్చుచుండగా మనలను రక్షించు ఏకైక బంధువు గురువే.  గురువే అన్ని ధర్మముల స్వరూపుడు.  అట్టి గురుదేవునికి వందనము.  ఈప్రపంచము గురుదేవునియందే ఉన్నది.  ప్రపంచమునందు ఉన్నది గురువే.  కనుక ప్రపంచ రూపము అంతయు గురు స్వరూపమే.

శ్రీ సాయి సత్చరిత్ర 33 వ.అధ్యాయము: నానా చందోర్కర్ కుమార్తె మైనతాయి పురిటినొప్పులతో బాధపడుచుండెను. టాంగా తోలేవానిగా బాబా, బాపుగిర్ బువాను జామ్నేరుకు తీసుకొని వెళ్ళెను. బాబా  ద్వారకామాయినుంచి ఊదీని బాపుగిర్ బువా ద్వారా  నానా సాహెబ్ చందోర్కర్ కు పంపి ఆమెను రక్షించిరి.
 
శ్రీ సాయి సత్చరిత్ర 7 వ.అధ్యాయము.  ఒక దీపావళి రోజున బాబా మండుచున్న ధునిలో తనచేతిని పెట్టి
చాలా దూరములో నున్న ఒక కమ్మరి స్త్రీ ఒడిలోనించి ప్రమాదవశాత్తు  మంటలలోకి పడబోతున్న  బిడ్డను రక్షించారు. దీనిని బట్టి గురువు సర్వత్రా వ్యాపించిఉన్నాడనే విషయం మనకు అవగతమౌతుంది.  

(యింకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు



Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List