Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, October 25, 2012

శ్రీకృష్ణ పరమాత్మునిగా శ్రీసాయి

Posted by tyagaraju on 7:05 AM

25.10.2012 గురువారము
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజునుండి సాయి.బా.ని.స. గారు చెప్పే శ్రీకృష్ణునిగా సాయి వినండి.




శ్రీకృష్ణ పరమాత్మునిగా శ్రీసాయి



ఓం శ్రీగణేశాయనమహ, ఓం శ్రీసరస్వ్వత్యైనమహ, ఓం శ్రీసమర్ధ సద్గురు సాయినాధాయనమహ. 

శ్రీసాయి సత్చరిత్ర 10, 15వ. అధ్యాయాలలో బాబా తాను తన భక్తులకు బానిసననిఅందరి హృదయాలలోను నివసిస్తున్నానని  చెప్పారు. నాయజమానియైన సాయి మీ బానిస అయినపుడు నేను కూడా మీబానిసనే.


ఆరవ అధ్యాయములో, హేమాద్రిపంత్ మధురంగా చెప్పినమాటలు, "నేను భాగవతం చదివినపుడెల్లా ప్రతీచోటా, సాయియే శ్రీకృష్ణుడనే భావన కలిగింది" సనాతన ధర్మములో "శేషసాయి, వటపత్ర సాయి" ల గురించి మీకందరకూ తెలుసు.



శ్రీమహావిష్ణువు యొక్క చరిత్రే భాగవతం. మన షిరిడీ సాయి లాగే, వటపత్రసాయి లో సాయి, శేషసాయిలో సాయి ఇద్దరూ ఒకరే.  నేను భాగవతం చదివినప్పుడు, సాయి సత్ చరిత్రలోను, భాగవతం లోను ఉన్న కొన్ని పాత్రల మధ్య పోలికలను గమనించాను.

నేను ఉపన్యాసం ఇచ్చేముందు నారదులవారి గురించి కొంత చెపుతాను.  నారదులవారు శ్రీమహావిష్ణువు కు అత్యంత ప్రియమైన భక్తుడు. ఆయన గత జన్మలో "ఉపభర్వ" అనే గంధర్వుడు.
 
అతను గానకళా గంధర్వుడు.  పాటలు చాలా మధురంగా పాడుతూ ఉండేవాడు.  కాని అతనికి గంధర్వ కన్యలమీద మోజు.  ఒకసారి బ్రహ్మగారు ఆహ్వానించినమీదట బ్రహ్మగారు తలపెట్టిన 'బ్రహ్మసత్రయాగానికీ వెళ్ళాడు. అక్కడ యాగము జరుగుతూ ఉండగా ఉపభర్వుడు శ్రీమహావిష్ణువుని కీర్తిస్తూ మధురంగా పాడసాగాడు.

 ఆసమయములో అక్కడ గంధర్వ కన్యలు కనిపించేటప్పటికి తాను పాడుతున్న గానాన్ని మధ్యలోనే హటాత్తుగా ఆపివేసి వారి వెంట వెళ్ళి, బ్రహ్మ ఆగ్రహానికి గురయ్యాడు. 

బ్రహ్మ అతనిని భూలోకంలో 'దాసిపుత్రుడుగా జన్మించమని శాపమిచ్చారు. దాసీపుత్రుడిగా అతను ఎంతోమంది సాధువులకు సేవ చేశాడు. దాని ఫలితంగా వారు అతనికి 'నారాయణ మంత్రాన్ని  ఉపదేశించారు. దానివల్ల అతను పరిశుధ్ధుడై శరీరాన్ని త్యజించి విష్ణులోకానికేగాడు.  అప్పటినుంచి అతను నిరంతరం శ్రీమహావిష్ణువు నామాన్నే జపిస్తూ ఉండేవాడు. బ్రహ్మ అతనిని శ్లాఘించారు. బ్రహ్మ శ్వాస ద్వారా బ్రహ్మలోకి ప్రవేశించి బ్రహ్మ మానసపుత్రుడిగా జన్మించడం జరిగింది. తరువాత జీవితమంతా విష్ణులోకంలో హరినామ స్మరణలోనే గడుపుతు నారదమహామునిగా ప్రసిధ్ధి చెందాడు.
 

 సాయి సత్ చరిత్రలో ఏపాత్ర నారదుని పోలిఉన్నది అని ఇప్పుడు మీకొక అనుమానం రావచ్చు. శ్రీసాయి సత్ చరిత్ర 15 వ. అధ్యాయాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి.   ఆ అధ్యాయములో బాబా దాసగణు మహారాజ్ హరికధ చెప్పుటకు తయారవుతుండగా బాబా అతనితో  "ఏమోయ్ పెండ్లికొడుకా! యింత చక్కగ ముస్తాబై ఎక్కడకు పోవుచున్నావు?" అనెను.  
హరికధ చెప్పుటకు పోవుచున్నానని దాసగణు జవాబివ్వగా బాబా ఇట్లనెను, "దానికి ఈ దుస్తులన్నీ ఎందుకు? కోటు, కండువా, టోపీ మొదలగునవి ముందర వెంటనే తీసి పారవేయుము. శరీరముపై ఈ అలంకారాలన్నీ ఎందుకు?" అని నారద మహర్షి ఎట్లా కీర్తనలు చేసేవారో వివరించి చెప్పారు బాబా. నీవు కూడా ఆవిధంగానే పైన ఎటువంటి ఆచ్చాదన లేకుండా హరికధలు చెప్పుము అని ఆజ్ఞాపించారు.

దాసగణుయొక్క గత చరిత్రను గుర్తుకు తెచ్చుకొందాము. ఆయన అసలుపేరు గణేష్ సహస్రబుధ్ధే. ఆయన పోలీసు శాఖలో కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. జమాబందీ నిమిత్తం  ఆయన 1894 లో నానాసాహెబ్ చందో ర్కర్ తో   కలిసి షిరిడీకి వచ్చారు. బాబా దర్శనం చేసుకొని ఆయన ఆశీశ్శులు పొందారు. దాసగణు బాగా పాటలు పాడేవారు, మంచి కవి కూడా. ఆయన ఉధ్యోగ విధులు ముగియగానే వీధినాటకాలలో ఆడవారు "లావణి" అనే డాన్సులు చేసేటప్పుడు పాటలు 
పాడుతూ సమయాన్ని  గడిపేవారు. 
బాబా ఆయనలో ఉన్న కళను, కవిత్వాలు రాయడంలోని ఆయన ప్రతిభను గుర్తించి, ఉద్యోగ విరమణ చేసి భగవంతుని మీద కీర్తనలు హరికధలు చెప్పుకొంటూ  భగవత్సేవ చేసుకోమని సలహా ఇచ్చారు.  కాని ఉద్యోగానికి సంబంధించిన పదవీ వ్యామోహం వల్ల తాను సబ్ యిన్స్పెక్టర్ అయిన తరువాతనే చేస్తానని చెప్పారు. ఒకరోజు ఆయన 36 రూపాయలు లంచం తీసుకుంటూఉండగా బ్రిటీష్ అధికారులు రెడ్ హాండెడ్ గా పట్టుకొన్నారు.

 ఆ కష్టాన్నించి  తప్పింపమని ఆయన బాబాని వేడుకొన్నారు. బాబా ఆయనను ఆ కష్టాన్నుండి కాపాడి శేష జీవితాన్ని భగవంతుని సేవలో గడపమని చెప్పారు.  కాని దాసగణు దానిని తిరస్కరించారు.  

తరువాత 1903 వ.సంవత్సరములో ఆయన సబ్ యిన్ స్పెక్టర్ అయి బందిపోటు దొంగలతో పోరాడుతున్నపుడు బాబా ఆయనను కాపాడారు.  అపుడు దాసగణు స్వచ్చంద పదవీ విరమణ చేసి, ఇక జీవితమంతా సాయిని కీర్తిస్తూ హరికధలు చెప్పడానికి నిశ్చయించుకొన్నారు. ఆవిధంగా నేను భాగవతంలోని నారదులవారికి, సాయి సత్ చరిత్రలోని దాసగణుకు గల పోలికలను గమనించాను. 

తరువాయి భాగంలో శ్రీకృష్ణ - సాయి (సాయికృష్ణ) .....

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 




Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List