06.01.2012 ఆదివారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
06.01.2011 తేదీన బాబావారి అనుగ్రహం బలంతో ప్రారంభమయి మన బ్లాగు ప్రారంభిచి రెండు సంవత్సరాలు పూర్తి అయి మూడవసంవత్సరంలోనికి అడుగు పెట్టింది. సాయి బంధువులందరి ఆదరాభిమానంతో ముందుకు సాగుతూ ఉంది.
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
06.01.2011 తేదీన బాబావారి అనుగ్రహం బలంతో ప్రారంభమయి మన బ్లాగు ప్రారంభిచి రెండు సంవత్సరాలు పూర్తి అయి మూడవసంవత్సరంలోనికి అడుగు పెట్టింది. సాయి బంధువులందరి ఆదరాభిమానంతో ముందుకు సాగుతూ ఉంది.
మన బ్లాగు ఇంకా ఇంకా ముదుకు సాగిపోయేందుకుబాబావారి సహాయ సహకారాలను ఆకాంక్షిస్తూ, సాయి బంధువులందరికీ నిరంతరం ఆయన అనుగ్రహాన్ని కురిపిస్తూ ఉండమని బాబావారిని కోరుకుంటున్నాను.
శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహరాజ్ కీ జై
ఈ రోజు విజయవాడ లో ఉండటం వల్ల శ్రీవిష్ణు సహస్రనామం శ్లోకం ఇవ్వడానికి వీలుపడలేదు.
శ్రీ సాయితో మధుర క్షణాలు - 14
శ్రీమతి సాయి లీలమ్మగారు ఆరబెట్టిన పిండి తడవకుండా బాబా రక్షించుట
సాయి లీలమ్మ గారు శ్రీ గోవిందరాజు నాయుడు, శ్రీమతి రుక్మిణీ బాయి దంపతులకు 17.08.1923న విజయవాడలో జన్మించారు. (నాయుడుగారు మున్సిపల్ చైర్మన్ గా 3 సార్లు పనిచేశారు) పిన్నవయసు లోనే తండ్రి అమెకు భగవద్గీత సారాంశాన్ని బోధించారు. ఆమె మొదట్లో శ్రీకృష్ణుని పూజించడం ప్రారంభించింది. 1938 వ. సంవత్సరంలో ఆమె తన మేనమామ శ్రీ వేణుగోపాలరావుగారి యింటికి వెళ్ళింది. మొట్టమొదటిసారిగా అక్కడ ఆమెకు బాబావారి అందమయిన పటాన్ని చూసే భాగ్యం కలిగింది. ఆఫొటో చూసి ఆమె బాబా గారి నోరు హనుమంతుడి మూతిలాగ ఉందని హాస్యంగా చమత్కరించింది. యిక్కడినుంచే ఆమెకు బాబా లీలలు అనుభవమవడం ప్రారంభమయింది. యిన్కా ఆమె బాబా తన భక్తులను కష్టనష్టాలనుండి ఎలా తప్పిస్తూ ఉంటారో వివరించింది.
బాబాతో ఆమెకు మొదటి అనుభవం మరుసటి రోజునే కలిగింది. ఆరోజు ఆమె స్కూలుకు వెళ్ళే తొందరలో ఉంది. కాని, ఒక ముఖ్యమయిన పుస్తకం కనపడలేదు. శ్రీసాయినాధుని స్మరించుకొని ఆపుస్తకం వెంటనే తన కళ్ళపడాలని మనస్ఫూర్తిగా ప్రార్ధించింది. బాబాతో ఆమెకు సాన్నిహిత్యం ఏర్పడటం అదే మొదలు. ఆమె జీవితంలో సాయినాధులవారు ఎటువంటి కష్టాలు కలుగకుండా కాపాడుతూ వచ్చారు.
బాబాతో ఆమెకు మొదటి అనుభవం మరుసటి రోజునే కలిగింది. ఆరోజు ఆమె స్కూలుకు వెళ్ళే తొందరలో ఉంది. కాని, ఒక ముఖ్యమయిన పుస్తకం కనపడలేదు. శ్రీసాయినాధుని స్మరించుకొని ఆపుస్తకం వెంటనే తన కళ్ళపడాలని మనస్ఫూర్తిగా ప్రార్ధించింది. బాబాతో ఆమెకు సాన్నిహిత్యం ఏర్పడటం అదే మొదలు. ఆమె జీవితంలో సాయినాధులవారు ఎటువంటి కష్టాలు కలుగకుండా కాపాడుతూ వచ్చారు.
1947 లో శ్రీమతి సాయి లీలమ్మగారు కలకత్తాలో ఉండేవారు. ఆమె తన కుమార్తె కోసం స్వెట్టర్ అల్లడం ఎలాగో నేర్చుకోవాలనుకుంది. దాని గురించి తెలుసుకోవడానికి తన పొరుగునే ఉన్న ఒకామె ఇంటికి వెళ్ళింది . కొంతసేపయిన తరువాత బాగా పెద్ద వర్షం ప్రారంభమయింది. అప్పుడే ఆమెకు తన యింటి డాబా మీద మైదా పిండి ఎండబెట్టానన్న విషయం అకస్మాత్తుగా గుర్తుకు వచ్చింది. కొత్తగా పెళ్ళయింది. వయసు చిన్నది కావడంతో భర్త తనను బాగా మందలిస్తాడని చాలా భయపడిపోయింది. ఆమె బాబాను ఇలా ప్రార్ధించింది "బాబా నువ్వే నన్నిప్పుడు రక్షించాలి" - బాబా ఆమెను ఆమె కోరుకున్నట్లే రక్షించారు. వర్షం ఆగిపోగానే ఆమె యింటికి వెళ్ళింది. డాబా మీదకు వెళ్ళి చూడగానే ఆమె ఆశ్చర్యానికి అంతులేదు. తాను ఎండబెట్టిన మైదా పిండి ఏవిధంగా ఆరబెట్టి వెళ్ళిందో అదే విధంగా అసలు తడవకుండా ఎవరో గొడుగు పెట్టి తడవకుండా చేసినట్లుగా అలాగే ఉంది. ఆమె పిండిని ఆరబెట్టిన ప్రదేశం తప్ప మిగతా డాబా అంతా తడిసిపోయి ఉంది. ఆవిధంగా చేసి రక్షించింది ఎవరు!!! మధ్యాహ్న్నం వర్షం వస్త్తున్నపుడు స్వయంగా బాబాయే ఆమె ఆరబెట్టిన పిండి తడవకుండా చూశారు. కొత్తగా కాపురానికి వచ్చి ఒక బిడ్డకు తల్లి అయిన ఈమెకు, ప్రతీరోజు జరిగే అన్ని విషయాలు అవి ప్రాపంచికవిషయాలే కావచ్చు అన్నీ ముఖ్యమయినవే. ఇటువంటి చిన్న విషయానికి కూడా స్పందించి, బాబా కల్పించుకొని ఒక నిగూఢమయిన లీలను ప్రదర్శించారు.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
పై లీల చదువారుకదా. పిండి ఆరబెట్టడమేమిటి? వర్షంలో తడవకుండా రక్షించమని బాబాను వేడుకోవడమేమిటి? బాబా తత్వం తెలియని వారికి ఇది హాస్యాస్పదంగా కనిపించవచ్చు. కాని ఇక్కడ శ్రీమతి సాయిలీలమ్మగారి వయసు చిన్నది అంటే అప్పటికామె వయసు 24 సంవత్సరాలు. ఆనాటి కాలంలో భర్త అంటే ఎంతో గౌరవం, భయం భక్తి ఉన్న రోజులు. పిండి తడిసి పాడయిపోతే భర్త చేత చీవాట్లు తినవలసి వస్తుందని విపరీతమయిన భయం కలిగింది. అందుచేతనే ఆమె బాబావారిని మనస్పూర్తిగా ప్రార్ధించింది. బాబాని అలా అడగవచ్చా లేదా అన్న విషయం ఆమె ఆలోచించలేదు. ఆమె భయమల్లా ఒక్కటే . భర్త చేత చీవాట్లు తప్పించుకోవాలి. 15 సంవత్సరాల వయసులోనే ఆమెకు బాబాతో పరిచయం అంటే బాబా లీలలు అనుభవంలోనికి రావడం ప్రారంభమయింది. బాబా ఆమె మొఱనాలకించారు. పిండి తడవకుండా చూడటం బాబా చేసిన అద్భుతమయిన లీల కాదూ? సందేహానికి తావు లేని భక్తి కావాలి మన అందరికీ. అప్పుడే పిలిస్తే పలుకుతానంటారు బాబావారు.
ఓం సాయిరాం
0 comments:
Post a Comment