28.01.2013 సోమవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి బంధువులారా. మీరు నిన్నటివరకు కాకాసాహెబ్ గారిని గురించి పరిచయం ఆయన గురించి కొంత సమాచారం చదివారు. ఈ రోజునుండి కాకాసాహెబ్ దీక్షిత్ గారి డైరీలలోని అధ్యాయాలను ప్రారంభిస్తున్నాను.
ముందుగా శ్రీవిష్ణుసహస్రనామ స్తోత్రం 29వ. శ్లోకం, తాత్పర్యం
శ్లోకం: సుభుజో దుర్ధరోవగ్మీ మహేంద్రో వసుదోవసుః
నైక రూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః ||
తాత్పర్యం: పరమాత్మను అపారమైన భుజబలము గలవానిగా, జయించుటకు వీలుకానివానిగా, గొప్ప వాక్ శక్తి గలవానిగా, ఇంద్రులకు ఇంద్రునిగా, సంపదలిచ్చువానిగా, సంపదలన్నియూ తానే యైనవానిగా, అనేక రూపములు గలవానిగా, అన్నిటికన్న గొప్పదైన రూపము గలవానిగా, అన్ని లోకములయందు లేక కిరణములయందు యుండువానిగా, సమస్తమును వెలిగించువానిగా, ధ్యానము చేయుము.
కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ
- 1వ. అధ్యాయం
ఒకసారి కొంతమంది యువకులు
శ్రీసాయిబాబా దర్శనార్ధం షిరిడీకి వచ్చారు.
వారికి శ్రీసాయిబాబాని ఫొటో తీద్దామని ఎంతో కోరికగా వుంది. రెండు రోజులుగా
ప్రయత్నించినా కూడా వారు శ్రీసాయిబాబాను ఫొటో తీయలేకపోయారు.
ఫొటో తీయాలనే తమ కోరికను మాధవరావు దేశ్ పాండే
(శ్యామాకు) విన్నవించుకుని, తమ తరఫున బాబాకి
తమ కోరికను విన్నవించమని వేడుకొన్నారు. సాఠేవాడా
దగ్గ్రనున్న లెండీ నుంచి బాబా తిరిగి వచ్చేటప్పుడు బాబాను కలుసుకోవచ్చని
శ్యామా చెప్పారు. వారందరూ వాడావైపు వెళ్ళి బాబా రాకకోసం ఎదురు చూస్తూ నుంచున్నారు. శ్రీసాయిబాబా లెండీనుంచి తిరిగి సాఠేవాడా
వద్దకు చేరుకొన్నారు. ఆయన శ్యామాని, శ్యామా ఏమిటిదంతా అని అడిగారు.
అందుకు
శ్యామా "బాబా ఈ యువకులంతా మిమ్మలిని ఫొటో తీసుకోవాలని కోరుతున్నారు. అందుకే
అందరూ యిక్కడ నిలబడి ఉన్నారు. మీరొక్కసారి
యిక్కడ నిలబడండి, వారు ఫొటో
తీసుకుంటారు" అన్నాడు శ్యామా. అపుడు
శ్రీసాయి యిలా అన్నారు. నాఫొటో తీయాల్సిన
అవసరం లేదు. నానిజస్వరూపం
తెలుసుకోవాలనుకుంటే మన మధ్యనున్న అడ్డ్లుగోడను పడగొడితే చాలు" అని ఒక్కక్షణం
కూడా అక్కడ నిలబడకుండా మసీదుకు తరలిపోయారు బాబా.
అయువకులంతా బాబావారి మూడున్నర మూర్ల (5అ.8 అం.) శరీరాన్ని
ఫొటో తీద్దామనుకున్నారు కాని, అది ఆయన అసలయిన
స్వరూపం కాదు. ఈప్రపంచం, శ్రీసాయిబాబా
వేరు కాదనే భావాన్ని వారు గ్రహించుకోలేకపోయారు.
ఆయువకుల హృదయాలలో ద్వైత భావం ఉన్నందువలననే బాబాను మానవుడిగా చూశారు. బాబా వారిలో ఉన్న ఈ అజ్ఞానాన్ని గుర్తించి,
ఈ అజ్ఞానమనే అడ్డుగోడ నిర్మూలింపబడాలని
చెప్పారు.
ఆ ఆదేశంలోని
అంతరార్ధాన్ని గ్రహించి భక్తులు అజ్ఞానమనే అడ్దుగోడను పడగొట్టి బాబాయొక్క సత్యమైన
స్వరూపాన్ని దర్శించగలగాలి.
ఒకసారి ప్రభు సమాజ్ కి
చెందిన ఒక వ్యక్తి శ్రీసాయిబాబా దర్శనానికి వచ్చాడు. ఆయన అంతకు మునుపు బొంబాయిలోని ఒక ఫొటో
స్టుడియోలో కొంతకాలం పని చేశారు. ఆయన కూడా
బాబా ఫొటో తీయాలని తనతో కెమెరా పట్టుకుని వచ్చాడు. బాబా అనుమతి లేకుండా ఫొటో
తీయాలని అతని ఉద్దేశ్యం. అలాగే ఫొటో
తీశాడు కూడా. తరువాత స్టూడియోకి తిరిగి వచ్చి నెగెటివ్ కడిగి చూస్తే అందులో బాబా
ఫొటోకి బదులు తన గురువు ఫొటో కనబటేటప్పటికి ఆశ్చర్యపోయాడు. ఆ అసాధారణ చమత్కారానికి ఆవ్యక్తి
ముగ్ధుడయాడు. ఎవరి గురువుపట్ల వారు నిశ్చల
భక్తి కలిగి ఉండాలని బాబా తమ లీల ద్వారా తెలియచెప్పారని గ్రహించాడు.
పీతాంబరం:
శ్రీసాయిబాబా మహాసమాధి
అయిన 2, 3 సంవత్సరాల తరువాత మాహిం
వెస్ట్ ప్రాంతంలో బాగా వరదలు వచ్చాయి. ప్రధాన్ గారికి ఒకరోజు బాబా స్వప్నంలో
దర్శనమిచ్చి ఒక పెట్టెను చూపుతూ "అందులో ఆకు పచ్చని పట్టుగుడ్డ ఉంది కదా.
దానిని నా సమాధిపై కప్పడానికి షిరిడీ పంపు" అని చెప్పారు. ఆపెట్టెలో ఆవస్త్రం ఉందన్న విషయమే మర్చిపోయారు
ప్రధాన్ గారు.
తరువాత ఆయన ఆపెట్టిని
గుర్తుకు తెచ్చుకుని అందులో చూసి వెతకగా ఆయన ఆశ్చర్యపోయేలా పీతాంబరం కనిపించింది.
అదే ప్రకారంగా ఆయన షిరిడీ సంస్థాన్ వారికి తనకు వచ్చిన స్వప్నం గురించి చెప్పి ఆ
పీతాంబరాన్ని షిరిడీకి పంపించారు. తరువాత 1923 దాకా శ్రీసాయిబాబావారి మహా సమాధిపై కప్పడానికి
ఈవస్త్రాన్ని తరచూ ఉపయోగించేవారు.
తండ్రి కొడుకులు:
ముంబాయిలోని ధానే
ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి కుమారుడు కొన్నేళ్ళ క్రితం తప్పిపోయాడు. తండ్రి, కుమారుని వెతకడానికి ఎన్నో ప్రయత్నాలు
చేశాడు. కాని, ఏమీ ఫలితం కనపడలేదు. ఆఖరికి అతను షిరిడీ వెళ్ళి శ్రీసాయి మహరాజ్ కు
తన పరిస్థితిని గురించి విన్నవించి, తన కుమారుడిని తనకు దొరికేటట్లు చేయమని బాబాను ప్రార్ధించాడు. బాబా అతనితో త్వరలోనే నీవు నీకుమారుడిని
కలుసుకుంటావు అని చెప్పారు. షిరిడీలో
రెండు రోజులున్న తరువాత బాబా అనుమతి తీసుకుని మన్మాడ్ నుంచి బొంబాయి వెళ్ళే రైలు
ఎక్కి ధానేలో దిగాడు. అదే సమయంలో బొంబాయినుండి వచ్చే రైలు కూడా ధానే ప్లాట్ ఫారం
మీద ఆగింది. తప్పిపోయిన ఆవ్యక్తి కుమారుడు రైలులోనుండి దిగాడు. బాబా చెప్పినట్లే తండ్రీ కొడుకులు కలుసుకున్నారు. శ్రీసాయిబాబా చెప్పిన మాటలు నిజమయ్యాయి.
(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment