Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, May 10, 2014

శ్రీసాయితో మధురక్షణాలు - 40 పవిత్రమైన ఊదీ చేసిన అద్భుతం

Posted by tyagaraju on 7:07 AM

                       
               
10.05.2014 శనివారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారై శుభాశీస్సులు

ఈ రోజు సాయితోమధుర క్షణాలలోని మరొక మధుర క్షణం గురించి తెలుసుకొందాము. 


శ్రీసాయితో మధురక్షణాలు - 40

పవిత్రమైన ఊదీ చేసిన అద్భుతం

పిల్లలు కష్టాలలో ఉన్నపుడు గాని, యిబ్బందులలో ఉన్నప్పుడు గాని తల్లితండ్రులను పిలిచిన వెంటనే వారు వెంటనె తమ పిల్లలవద్దకు ఏవిధంగానయితే పరిగెత్తుకుని వస్తారో అదే విధంగా శ్రీ సాయినాధుల వారు కూడా తన భక్తులు కష్టాలలో ఉన్నప్పుదు ఆర్తితో పిలచినప్పుడు ఆయన కూడా అదే విధయిన ప్రేమతో వారి రక్షణకోసం పరిగెత్తుకొని వస్తారు.  ఈ లీల ఒక తాతగారు, ప్రమాదకర పరిస్థితిలో ఉన్న తన మనమరాలు ఏవిధంగా రక్షింపబడిందో వివరిస్తున్నారు. 


"నేను 13సంవత్సరాలనుండి సాయిబాబాను పూజిస్తూ ఉన్నాను.  ఈ కాలంలో నాకు ఎన్నో అధ్బుతమైన అనుభవాలు కలిగాయి.   వాటిలో కొన్ని శ్రీసాయి లీల  మరాఠీ మాసపత్రికలో గతంలో ప్రచురింపబడ్డాయి.  కాని 1972 ఏప్రిల్ నెలలో షిరిడీనిండి తెచ్చిన పవిత్రమైన బాబా ఊదీ చేసిన అద్భుతం ఆశ్చర్యాన్ని కలుగచేస్తుంది.  

నా మనుమరాలు, మా పెద్ద అబాయి కూతురు, పేరు భావన.  ఆమెని మేము ముద్దుగా సంజీవని అని పిలుస్తాము.  1972 ఏప్రిల్ నెలలో మా మనమరాలికి హటాత్తుగా అనారోగ్యం చేసింది.  అప్పుడు వేసవికాలం కావడం వల్ల విపరీతమైన వేడివల్ల గాని, కాస్త వడదెబ్బ తగలడం వల్లగాని అయి ఉండవచ్చని మా కుటుంబ వైద్యుడు అభిప్రాయ పడ్డారు.  జ్వరం హెచ్చు తగ్గులు లేకుండా ఒకే విధంగా ఉండి అన్నం కూడా తినలేకపోయేది.  పొట్ట ఉబ్బిపోయింది.  కాని దురదృష్టవశాత్తు మా కుటుంబ వైద్యుడు అది ఎంత ప్రమాదకరమయిన జబ్బో కనిపెట్టలేకపోయాడు.  ఆయన ముందుగా అనుకున్ననట్లుగా వడదెబ్బ వల్లనే అనుకొని వైద్యం చేస్తూ వచ్చారు.  పాప రోజురోజుకీ క్షీణించిపోతోంది.  కళ్ళు లోతుకు వెళ్ళిపోయాయి. పొట్ట ఉబ్బిపోవడం వల్ల   పొట్టమీద ముట్టుకుంటే వీరీతమయిన నొప్పిగా ఉండేది.  ఆఖరికి పాపని యిండోర్ లో ఉన్న పెద్ద ఆస్పత్రిలో చూపిద్దామనే నిర్ణయానికి వచ్చాము.  ఆదివారం రాత్రి పాపని ఆస్పత్రిలో చేర్పించాము. ఆరోజు ప్రధాన వైద్యుడు సెలవులో ఉన్నారు.  పాపని ఆస్పత్రికి తీసుకెళ్ళేముందు పాప నుదిటిమీద, షిరిడీనుండి తెచ్చిన ఊదీని చిటికెడు పెట్టాము.  మరుసటిరోజు ప్రధాన వైద్యుడు వచ్చి పరీక్షించి, అది పొట్టలోని ప్రేవులకు రంధ్రం పడతంతోపాటు టైఫాయిడ్ జ్వరమని నిర్ధారించారు.  లోపలి ప్రేవుల గోడలకు రంధ్రం పడటంవల్ల పొట్ట ఉబ్బరింపు వచ్చిందని చెప్పారు. ఇటువంటి జబ్బులు చాలా ప్రమాదకరమయినవనీ ఆపరేషన్ చేయవలసి ఉంటుందని చెప్పారు.  కాని పాప బాగా బలహీనంగా ఉండటంవల్ల ఆపరేష్ కి తట్టుకోలేదని చెప్పారు.  శరీరంలోకి గ్లూకోజ్ సెలైన్ ఎక్కించాలని చెప్పారు.  ఏమి చేయాలో తోచని పరిస్థితిలో మాకు చాలా ఆందోళనగా ఉంది. ఆస్పత్రిలో వైధ్యం ప్రారంభించారు.  ఇదంతా జరగడానికి ముందునుండే నేను ప్రతీరోజు మరాఠీ భాషలో ఉన్న శ్రీసాయి సత్ చరిత్ర పారాయణ చేస్తున్నాను.  ఆ సమయానికి నేను 8వ.అధ్యాయం పూర్తి చేసి 9వ.అధ్యాయం ప్రారంభించాను.  నేను బాబాతో యిలా మొఱ పెట్టుకొన్నాను, "ఓహ్! బాబా, ఏమిటీ విపత్కర పరిస్థితి మామీద యిలా దాపురించింది.  ఈ పరిస్థితినుండి మమ్మల్ని గట్టెక్కించగలవాడివి నువ్వే".

మార్చ్ నెలలో నెన్ను షిరిడీ వెళ్ళినప్పుడు సంస్థాన్ ఆఫీసునుండి  కొన్ని శ్రీ సాయిబాబా ఫొటోలు తీసుకొని వచ్చాను.  ఫొటోలో బాబా ఆశీర్వదిస్తూ ఉన్న భంగిమ, మా వైపు చూస్తూ 'నేనుండ నీకు భయమేల, అన్ని సవ్యంగా జరుగుతాయి' అని దీవిస్తూ ఉన్న  భావన కలుగుతూ ఉంటుంది మాకు.  
                    

ఆఫొటొని ఆస్పత్రికి తీసుకొని వెళ్ళాలనిపించింది నాకు.  ఆ ఫొటోని, కాస్త ఊదీని తీసుకొని ఆస్పత్రికి వెళ్ళాను.  పాప తలగడ క్రింద బాబా ఫొటొని పెట్టి భావన శరీరమంతా ఊదీని రాశాను.  ఆసమయంలో నాలో విపరీతమయిన ఉద్వేగం.  నాకు ఏదుపు తప్ప మరేమీ లేదు. అక్కడ కుటుంబ సభ్యులందరూ ఉన్న సమయంలో నేను, ఉద్వేగాన్ని అణచుకోలేక, ఓహ్! బాబా నామనమరాలు భావనకే కనక నయం కాకపోతే నేనిక నీచరిత్రను చదవను" అన్నాను.  

ఈ లోగా సాయి సత్చరిత్ర పారాయణ కొనసాగిస్తూ వచ్చాను.  ప్రతీ గురువారం పూజ చేసి ఆరతి యిస్తున్నాను.  నా మనమరాలు భావన కి ఎటువంటి సర్జరీ అవసరం లేకుండానే కోలుకోవడం ప్రారంభమయింది.  వైద్యులు కూదా చాలా ఆశ్చర్యపోయారు.  రోగి పరంగా చూస్తే అది అసాధారణం.   కాని యిదంతా శ్రీసాయిబాబా, ఆయన పవిత్రమైన ఊదీ శక్తి వల్ల జరిగినదేనని  నాకు తెలుసు.  క్రమంగా జ్వరం తగ్గుతూ వచ్చి, పొట్ట ఉబ్బరింపు కూడా తగ్గిపోయింది.  2, 3 వారాలలోనె పాప కోలుకొని యింటికి తిరిగి వచ్చింది. 

శ్రీ సాయిలీల 
మరాఠి సంచిక, జూలై, 1973 
నుండి సాయిలీల ఏప్రిల్ 1974 లో ప్రచురితం
అనిల్ పండిట్  

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)   


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment