Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, July 11, 2014

వ్యాధిని మాయం చేసిన బాబా

Posted by tyagaraju on 9:28 AM
                           
                               


11.07.2014 శుక్రవారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు 

గురుపౌర్ణమి శుభాకాంక్షలు
చాలా రోజుల తరువాత మరలా బ్లాగులో ప్రచురణకు అవకాశమేర్పడింది.  ప్రచురణకు ఆటంకాలు ఏమీ లేకపోయినా పరిస్థితులు నాకు కొన్ని అనుకూలంగా లేకపోవడంచేత అనువాద ప్రక్రియ సజావుగా సాగడంలేదు.  బాబావారిని మన్నించమని వేడుకొంటూ ఈ రోజు సాయిసోదరి రేఖగారి అనుభవాన్ని మీకందిస్తున్నాను.

త్వరలోనే సాయికి అంకిత భక్తుడయిన శ్యామా గురించి విపులంగా అందిస్తాను. 

వ్యాధిని మాయం చేసిన బాబా

సాయి సోదరి రేఖ అనుభవం 

చిన్నతనం నుంచీ నాకు బాబా గురించి తెలుసు.  అందరినీ పూజించినట్లుగానే బాబాను కూడా పూజిస్తూ ఉండేదానిని.  బాబా వారి వివిధరకాల ఫోటోలను సేకరించి వాటినన్నిటినీ ఒక ఫైల్ లో పెట్టుకొంటూ ఉండేదానిని.  అది నా అలవాటు.  నా స్నేహితులలో ఒకరు నాకు సాయి సత్ చరిత్రను, మరొకరు బాబా విగ్రహాన్ని బహూకరించారు.  బాబాకు సంబంధించిన ప్రతి విషయం ఎంతో గొప్పదయినప్పటికీ ఒకరోజు మాత్రం ఆయన నన్ను తనకు సన్నిహితంగా చేసుకొన్నారు.  

ఆరోజు మా అమ్మగారు ఇంగ్లాండులో ఉన్న నాసోదరి దగ్గరకు వెళ్ళారు.  నాకు మా అమ్మ అంటే ఎంతో ప్రాణం. నేను ఎప్పుడూ మా అమ్మను విడిచి ఉండలేదు. మా అమ్మగారు ఇంగ్లాండు వెళ్ళిన రోజునుండీ నాకు చాలా బెంగ పట్టుకొంది.  నా స్నేహితురాలు బహుమతిగా యిచ్చిన బాబా విగ్రహాన్ని నాగదిలో పెట్టుకొన్నాను.  ఆక్షణం నుంచీ నేను మా అమ్మగారు నాదగ్గర లేరనే భావన లేకుండా బాబాతో మాట్లాడుతూ ఉండేదానిని.  నాకెంతో తృప్తిగా అనిపించేది.  ఆవిధంగా బాబా నాజీవితంలోకి వచ్చారు. నేనెక్కడికి వెళ్ళినా నాకూడా బాబా విగ్రహాన్ని కూడా తీసుకొని వెడుతూ ఉండేదానిని.  బాబావారు నాకెన్నో అనుభవాలనిచ్చారు.  వాటిని ముందు ముందు వివరిస్తాను.

ఇప్పుడూ ఈమధ్యనే జరిగిన ఒక అనుభవాన్ని వివరిస్తాను.  ఫిబ్రవరి మొదటి వారం నుండీ నాభర్త జ్వరం, పొడిదగ్గుతో బాధ పడుతున్నారు.  వెంటనే డాక్టర్లకు చూపించాము.  వారు అన్ని పరీక్షలూ చేసి టైఫాయిడ్ అని తేల్చారు. జ్వరం నిలకడగా ఉండి దగ్గు బాగా వస్తూ ఉండేది.  రెండు వారాల తరువాత జ్వరం తీవ్రత పెరిగింది.  డాక్టర్స్ అది వైరల్ ఫీవర్ అని చెప్పారు.  జ్వరం, దగ్గు రెండు తగ్గలేదు.  మేము మరో యిద్దరు డాక్టర్స్ కి చూపించాము.  వారు అది యూరినరీ యిన్ ఫెక్షన్ అని నిర్ధారణ చేశారు. ఎన్నో టాబ్లెట్ లు వాడినా గుణం కనపడలేదు.  11.03.2014 సాయంత్రం ఆఫీసు పని అయిన తరువాత నాభర్తను మరొక ఆస్పత్రికి తీసుకొని వెళ్ళాను.  అక్కడ నా బంధువు ఒకరు అనస్థసిష్టుగా పనిచేసున్నాడు. అతను జనరల్ ఫిజీషియన్ దగ్గరకు వెళ్లమన్నాడు.  డాక్టర్ వెంటనే చాతీకి ఎక్స్ రే తీయించమని చెప్పారు.  పొట్టకి కూడా పూర్తిగా స్కాన్ చేయించి లివర్ టెస్ట్ కూడా చేయించమని చెప్పారు.  L F T కి నాభర్త రక్తం యిస్తున్నపుడు నాకు కన్నీళ్ళు ఆగలేదు.  జరిగిన విషయాలన్నిటినీ తలచుకొంటూ బాబానే ధ్యానిస్తూ ఉన్నాను.  ఎక్స్ రే అయిన తరువాత ఒకామె వచ్చి జలుబు ఎంతకాలం నుంచీ ఉందని అడిగింది.  నెలరోజులుగా ఉందని చెప్పిన తరువాత ఆమె డాక్టర్ ని కలవమని చెప్పింది.  నాకు కంగారు ఎక్కువయింది.  పొట్టకు స్కానింగ్ పూర్తయిన తరువాత రిపోర్టులు అన్నిటినీ తీసుకొని డాక్టర్ వద్దకు వెళ్ళాము.  డాక్టర్ రిపోర్టులన్నీ చూసి ఊపిరి తిత్తుల చుట్టూ నీరు 695 ఎం.ఎల్ . ఉందని వెంటనే ఆస్పత్రిలో చేరమని చెప్పారు. బహుశ టీ.బీ. కావచ్చని చెప్పారు.  నా భర్తకు సిగరెట్లు, ఆల్క హాల్ తీసుకోవడం, మాసం తినడంవంటి అలవాట్లు ఏమీ లేవు.  మరి ఈవిధంగా ఎందుకు వచ్చిందో ఆయనకీ అర్ధం కాలేదు.  టీ.బీ. మందులతో నయమవుతుంది కాని మాకు భయంగానే ఉంది.  కారణం మాకు 6 నెలల పాప ఉంది.  పాపకు కూడా తనవ్యాధి సోకుంతుందేమోనని నాభర్తకు చాలా భయం కలిగింది.  

ఈలోగా నేను, ఆస్పత్రిలో ఎక్కడయినా బాబా కనపడతారేమోనని చూశాను.  మందుల కోసం ఫార్మసీకి వెళ్ళినపుడు అక్కడ ఆరంజ్ రంగు పంచె కట్టుకొని కూర్చున్న భంగిమలో ఉన్న బాబాని చూసి ఆశ్చర్యం కలిగింది.  నాకోసం బాబా అక్కడ ఉన్నందుకు నాకెంతో సంతోషం కలిగింది.  ఆస్పత్రిలో చేరిన వెంటనే డాక్టర్ 300 ఎం.ఎల్. ఫ్లూయిడ్ తీసి 60 ఎం.ఎల్. ఫ్లూయిడ్ పరీక్ష కోసం లాబ్ కి పంపించారు.  రెండు రోజులలో రిపోర్ట్స్ వస్తాయని చెప్పి డాక్ట్రర్ టీ.బీ కి వైద్యం మొదలు పెట్టారు.  13.03.2014 సాయంత్రం కొన్ని రిపోర్ట్సు వచ్చాయి.  అదే రోజు సాయంత్రం డాక్టర్ వచ్చి టీ.బీ. కాస్త నయమవుతోదని చెప్పారు.  నాభర్తకు వచ్చినది టీ.బీ.యేనా అని డాక్ట్రర్ ని అడిగాను.  అవునని సమాధానం చెప్పారు.  నాబంధువయిన అనస్తిషిస్టుని టీ.బీ కాకుండా లంగ్ యిన్ ఫెక్షన్ మాత్రమే అవడానికి చాన్సెస్ ఉన్నాయా అని అడిగాను.  ఫ్లూయిడ్ చాలా ఎక్కువగా ఉన్నందు వల్ల యిన్స్ఫెక్షన్ కాకపోవచ్చని చెప్పాడు.  నేను చాలా హతాశురాలనయ్యాను.  ఏదిఏమయినా ఎదుర్కోవడానికి సిధ్ధపడి, టీ.బీ. తప్ప మరింత ప్రమాదకరమయినదేమీ కానందువల్ల సంతోషంగా నాభర్తకు ధైర్యం చెప్పాను.  బాబామీద నాకు పూర్తి నమ్మకం ఉంది.  అంతా ఆయనకే వదలివేశాను.  నువ్వే వైద్యుడివి, నాభర్త రక్షణ భారం నీదేనని బాబాకు చెప్పుకొన్నాను.  మన కర్మ ప్రకారం ఏది జరగాలో అది జరుగుతుంది ధైర్యంగా ఉండమని నాభర్తకు చెప్పాను.   

14.03.2014 సీ.టీ. స్కాన్స్ చేశారు.  అద్భుతం మీద అధ్బుతం రిపోర్టులో టీ.బీ. లేదని వచ్చింది.  మళ్ళీ మళ్ళీ అడిగిన మీదట మధ్యాహ్నం మళ్ళీ సీ.టీ;  స్కాన్ చేశారు.  అందులో కూడా టీ.బీ.లేదని వచ్చింది.  మాసంతోషానికి అవధులు లేవు.  ఈ అధ్బుతం  చేసింది నువ్వే బాబా నువ్వే అని బాబాకు కృతజ్ఞతలు తెలుపుకొన్నాను.  ఒకటి గుర్తుంచుకోండి.  అందరికీ కష్టాలు, సమస్యలు లుంటాయి.  కాని వాటినన్నింటినీ పరిష్కరించడానికి సాయి ఉన్నారు.  బాబా పై నమ్మకం ఉంచండి.  అద్భుతాలమీద అద్భుతాలు జరుగుతాయి.

జై సాయిరాం, ఓం సాయిరాం, శ్రీసాయిరాం.  నువ్వేమా గురువు, దైవం.  నువ్వు లేక మేము లేము బాబా.    
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment