03.09.2015 గురువారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయి రామచరిత్ర - మధుర ఘట్టములు - 4
ఆంగ్లమూలం: ఆర్థర్ ఆస్ బోర్న్
తెలుగు అనువాదం : సాయిబానిస శ్రీరావాడ గోపాలరావు
సంకలనం : ఆత్రేయపురపు త్యాగరాజు
ఆధ్యాత్మిక రంగములో వింతలు, అద్భుతాలు ప్రదర్శించటము అవసరం లేదని భావించవచ్చును. ఈ విషయములో గురువు వింతలు, అధ్బుతాలు చేయలేదు, చేసినారు అని చర్చించటం మన గర్వానికి నిదర్శనము. ఈవిషయములో ఎక్కువ చర్చించకుండ గురువు చేసి చూపిన వింతలు అధ్బుతాలతో తృప్తి చెందాలి. గురువు చుట్టూ యున్న పరిస్థితులను బట్టి భగవంతుని కరుణాకటాక్షణాలు ఆగురువుపై ప్రసరించబడి ఉంటాయి. అది వేరే విషయం. ఇది కావలసి చేసే పనులకు వర్తించదు.
భగవాన్ శ్రీరమణమహర్షి భక్తులయొక్క అనుభవాలు పరిశీలించుదాము. శ్రీరమణమహర్షి ఈనూతన శకములో ఆవతరించిన యోగీశ్వరులు. వారు ఏవిధమైన వింతలు, అధ్బుతాలు చేయకుండానే తనను నమ్ముకొన్న భక్తుల కష్ఠాలను, అనారోగ్యాలను తొలగించినారే మరి ఈవిషయముపై శ్రీరమణమహర్షిని ప్రశ్నించితే ఆయన అంటారు, జ్ఞాని అనేవాడు తన ఆలోచనలను నాలుగువైపుల ప్రసరించగలిగిననాడు భగవంతుని శక్తి తనంతటతానే పనిచేయటము ప్రారంభించుతుంది. ఈవిధమైన ప్రక్రియ న్యాయవివేకమైనది, కాని స్పష్ఠముగా కనిపించనిది.
శ్రీసాయిబాబా విషయములో ఈవిధమైన ప్రక్రియ కనిపించదు. ఆయన చేసిన వింతలు, అధ్బుతాలు స్పష్ఠముగా అందిరికీ కనిపించేవి. ఈవిధమైన ప్రక్రియలలోని తేడాను తెలుసుకొనేందుకు మనము ఒక రెండు ఉదాహరణలను ఇక్కడ చర్చించుకొందాము.
తిరువన్నామలైలో ఒక స్త్రీ చనిపోయింది. ఆమె భర్త ఆమె శరీరానికి దహన సంస్కారాలు చేయబోయే సమయములో కుంభవృష్టిగా వాన పడుతోంది. హిందూ సాంప్రదాయము ప్రకారము చనిపోయిన వ్యక్తి యొక్క శరీరము 24గంటలకన్న ఎక్కువ సేపు దహనసంస్కరాలకు ముందు ఉంచరాదు. అవ్యక్తి శ్రీరమణమహర్షి వద్దకు వెళ్ళి తన బాధను వెలిబుచ్చాడు. మహర్షి ఆకాశమువైపు చూసి ఫరవాలేదు త్వరగానే వర్షము కురవడము ఆగిపోతుంది. నీవు దహనసంస్కారాలకు ఏర్పాట్లు చేసుకో" అన్నారు. ఆవ్యక్తి మహర్షి మాటపై నమ్మకంతో వెంటనె రెండెడ్లబండిలో తన భార్య శరీరాన్ని వేసుకొని ఆపట్టణములోకి తీసుకొనివెళ్ళి అక్కడ శ్మశానములో దహనసంస్కారాలు పూర్తి చేశాడు. ఆదహనసంస్కార కార్యక్రమము పూర్తవనంతవరకు వానపడటము ఆగిపోవటము శ్రీరమణమహర్షి చేసి చూపిన అధ్బుతము.
ఇపుడు యింకొక ఉదాహరణ చర్చించుకొందాము. షిరిడీ గ్రామానికి దగ్గరలో ఉన్న రైల్వేస్టేషన్ కోపర్ గావ్. రెండిటి మధ్యదూరము ఆరుమైళ్ళు. ప్రయాణసాధనము గుఱ్ఱపుబండ్లు మాత్రమే. కొంతమంది షిరిడీ సాయి సందర్శకులు ఆనాటి రాత్రి రైలుబండిలో బొంబాయి చేరవలసి ఉంది. కాని ఆరాత్రి ఉరుములు మెరుపులతో కుంభవృష్టిగా వాన పడుతోంది.
శ్రీసాయి పరిస్థితిని గమనించి ఆకాశమువైపు చూసి గట్టిగా ఈ విధముగా అన్నారు "హే! చాలు - వానకురింపించటము ఆపు. నాపిల్లలు తమ గ్రామానికి తిరిగి వెళ్ళాలి". వెంటనే ఉరుములు, మెరుపులతో కురుస్తున్న వాన ఆగిపోయింది.
శ్రీసాయి చేసిన ప్రతి అధ్బుతానికి ఒక ఉద్దేశముంది. శ్రీసాయి చేసిన పలువిధములైన అధ్బుతాలు వాటి వివరాలు ఈపుస్తకములో ముందు ముందు చర్చించుకుందాము. శ్రీసాయి ఒకసారి అన్నారు "నాభక్తులకు ఏదికావాలో తెలుసుకుని వాళ్ళకు నేను అది యిస్తాను. దానితో వాళ్ళు, నేను వాళ్ళకు ఏమి యివ్వదలచుకొన్నానో తెలుసుకొని అదే నానుండి కోరుతారు".
శ్రీసాయి భక్తులలో ఒకరయిన రావు బహుదూర్ ఎస్.బి.ధుమాల్ అడ్వొకేట్ గారి అభిప్రాయం గురించి తెలుసుకుందాము.
"నన్ను ఎవరయినా శ్రీసాయితో మీ అనుభవాలు ఎటువంటివి అని ప్రశ్నించితే సమాధానము చెప్పటము నాకు చాలా కష్ఠము. ప్రతి దినము 24 గంటలు ఆయనతో సంబంధము కలిగిఉన్నాను. నా జీవితములో ఏసంఘటన తీసుకొన్నా ఆయనతో సంబంధము లేకుండా లేదు. ఆ సంఘటన చిన్నది అవచ్చు లేదా పెద్దది అవవచ్చును. నా జీవితములో ప్రతి సంఘటన శ్రీసాయిబాబా ప్రేరణతోనే జరిగింది. మరి అటువంటప్పుడు శ్రీసాయితో నా అనుభవాలు అంటూ వేరుగా ఎలా చెప్పగలను? కాని, ఈవిషయాన్ని ఈ లోకం నమ్మదు. ఈలోకం నమ్మకపోయినా నాకు బాధ లేదు. నిజానికి ఈఅపనమ్మకానికి మూలకారణం ఒక్కటే. ప్రతి భక్తుడు తనకు కలిగిన అనుభూతి తనకు మాత్రమే పరిమితమయినది, దానినుండి తను మాత్రమే మేలు పొందాలి యితరులకు ఆ విషయాలు చెప్పరాదు అనే భావన కలిగి ఉండటమే. శ్రీసాయిని అర్ధము చేసుకోవటంలో ఉత్తమమైన మార్గము ఏమిటంటే ఆయనతో అనుభూతిని పెంపొందిచుకోవటమే. ఇపుడు శ్రీసాయిబాబా ఎక్కడ ఉన్నారు? ఆయన యింకా బ్రతికే ఉన్నారా? ఆయన అందరిమధ్య ఉన్నారా? మహా సమాధి చెందితే ఆయన శక్తి యింకా మన మధ్య ఉన్నదా? అనే ప్రశ్నలు వేయటంకంటే మంచి మార్గము ఒక్కటే ఉంది. అది ఆయనపై నమ్మకముతో ఆయనకు దగ్గరవటం.
ఆయన చూపే మహత్యాలు, వింతలు చూడాలనె కోరికతో మాత్రము ఆయన దగ్గరకు వెడితే లభించేది నిరాశ మాత్రమే.
(రేపు మరికొన్ని సంఘటనలు)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment