06.09.2015 ఆదివారం
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
బాబా ధైర్యాన్నిస్తారు
ఈరోజు శ్రీసాయిరామచరిత్రలోని నాకు నచ్చిన ఘట్టాలను ప్రచురిద్దామమనుకున్నాను. కాని మైల్ బాక్స్ ని చూసినప్పుడు విజయగారు పంపిన అనుభవం కనిపించింది. వెంటనే ఆమె అనుభవాన్ని ప్రచురిద్దామనిపించి ఈ రోజు ప్రచురిస్తున్నాను.
జీవితంలో మానవుడికి సహజంగా కష్టాలు, సమస్యలు సహజం. మన పూర్వజన్మలో మనం చేసుకున్న పాప పుణ్యాలను బట్టే ఈ జన్మలో మన జీవితం గడుస్తుంది. ఎవరి జీవితం వడ్డించిన విస్తరి కాదు. జీవితం వడ్డించిన విస్తరి కలిగిఉన్నవాడికయిన కొన్ని కొన్ని కష్టాలు, సమస్యలు తప్పవు. వీటినుండి బయటపడటానికి ఒక్కటే మార్గం. అదే నిరంతరం భగవన్నామ స్మరణ. భవబంధాలనుండి, భవసాగరాన్ని సులువుగా దాటించేది ఆ భగవన్నమస్మరణే.
ఈ రోజు ఒక సాయి భక్తురాలైన విజయ గారు తమ అనుభవాన్ని ఈ మైల్ ద్వారా పంపించారు. ఆమె పంపించిన ఈ మైల్ ని యధాతధంగా ప్రచురిస్తున్నాను. ఆమె సమస్యలకి బ్లాగులో సమాధానాలు దొరికి ఉపశమనం కలిగితే అంతకన్నా కావలసిన ఆనందం ఏముంటుంది. మనసమస్యలకి సమాధానాలు శ్రీసాయి సత్ చరిత్రలో లభిస్తాయి.
బాబా ఆమెకి ప్రతిక్షణం తోడూ నీడగా ఉండి శుభాశీస్సులు కలుగచేయాలని ప్రార్ధిస్తున్నాను.
ఓం సాయిరాం
విజయగారు పంపించిన అనుభవం
సర్వం సాయిమయం. బాబా సమాధి చెందకముందు తమ భక్తులను కంటికి రెప్పలాగ కాపాడినట్లే సమాధి చెందిన తరువాత కూడా అనుక్షణం తమ భక్తుల వెంట ఉండి అనేక ప్రమాదాల నుంచి కాపాడుతూ వస్తున్నారు. బాబాగారు చూపించే వాత్సల్యానికి,ప్రేమకి కొలమానం లేదు. ఎన్నొ జన్మల పుణ్యం ఉండటం వల్లనేవాటిని పొందగలుగుతున్నాము. బాబా గురించి నా జీవితములో చూపిన చిన్న లీల మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
బాబాగారికి తమ భక్తుల మనసులో మెదిలే ప్రతి ఆలోచన తెలుసు, వాటికి అనుగుణముగా వారు నిదర్శనాలు చూపిస్తూ ఉంటారు. దానిని బట్టి భక్తులకి బాబా తమతో పాటే ఉన్నారని ఎంతో ఆనందాన్ని అనుభవిస్తుంటారు. అలాంటి వారిలో నేను ఒక్కదాన్ని. నేను కష్టాలలో ఉండి నిరాశకు లొనయినప్పుడు బాబాగారు ఏదో ఒక రూపములో గాని లేదా సలహ ద్వారాన్నో లేదా తమ లీలలు చదివించడం ద్వారా ఇలా ఎన్నో రకాలుగా మార్గం చూపించి కావల్సినంత దైర్యాన్ని నింపేవారు. నేను త్యాగరాజు గారు బ్లాగ్ ఎప్పుడూ చదువుతూ ఉంటాను.ఎప్పుడన్నా నిరుత్సాహనికి లోనయినప్పుడు ఈ బ్లాగ్ చూస్తాను. నా మనసులో మెదిలే ఆలోచనకి బాబాగారి సమాధానం దొరికేది. ఆ సమాధానమే నాలో ఎంతో దైర్యాన్ని నింపేది.
డిసెంబర్ 2014 లో నేను చాలా సమస్యలలో ఉన్నాను. జీవించడం ఎందుకు? అని ఒక ప్రశ్నగా మారింది. కష్టాలు తట్టుకొలేక శిరిడి వెళ్ళడం జరిగింది. బాబా దారి చూపిస్తారేమో అని ఆశతో వెళ్ళాను. నాకు ఎలాంటి సమధానం దొరకలేదు. ఆ 4 రోజులు అన్ని మరిచిపొయి ఎంతో ఆనందాన్ని పొందాను. శిరిడి నుంచి తిరిగి వచ్చాక రాత్రి కలలో బాబా గారు కనిపించి దీక్ష తీసుకొని మాల వేసుకో ఇంకొన్ని సమస్యలు చుట్టుముట్టబోతున్నాయి, మాల వేసుకొవడం వలన చాలా సమస్యల నుంచి బయటపడగలవు అని సలహా ఇచ్చారు.
నేను మాల వేసుకోవడం మా ఇంట్లో ఒప్పుకోరు. ఆడపిల్ల అందులో పెళ్ళి కావల్సిన పిల్ల మాల వేసుకొవడం ఎమిటి అని మా అమ్మ తిట్టేది. దానికి భయపడి నేను ఇంట్లో చెప్పలేదు. మనసులో ఇదే ఆలోచన మెదులుతూ ఉండేది. బాబాగారు చెప్పినట్టే అనేక సమస్యలు మీద పడ్డాయి. నా పరిస్థితులో ఇంకెవరన్నా ఉంటే ఆత్మహత్య చేసుకునేవారు. నాకు అలానే అనిపించింది. బాబా కలలో కనిపించి జీవితములో కష్టాలు ఎన్నో వస్తాయి చనిపోవాలని ఆలొచించడం తప్పు, ఎప్పుడు పాజిటివ్ గా ఆలోచించాలని చెప్పారు. కొన్ని రోజుల తరువాత కొన్ని సమస్యల నుంచి బయటపడటం జరిగింది. మిగత వాటిని ఎదుర్కోవడానికి నాలో దైర్యాన్ని ప్రసాదించారు.
అప్పటి నుంచి బాబాగారు చెప్పిన సలహాలని అలక్ష్యం చెయ్యకూడదు చేస్తే ఎన్ని సమశ్యలలో పడబోతామో తెలుసుకున్నాను. బాబాగారు చూపించే మార్గములో పయనించే జ్ఞానాన్ని ప్రసాదించమని కోరుకుంటున్నాను. బాబా ఇచ్చే సలహా పాటించక ఎంతో మంది భక్తులు ప్రమాదాల బారినపడి తిరిగి బాబా అనుగ్రహము పొంది బయటపడటము జరిగిందని సచ్చరిత్రలో చదివాము. మనమందరము బాబా సలహాను పాటించి బాబాగారు చూపించే దారిలో నడుద్దాము.
----విజయ
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
1 comments:
om sai ram
Post a Comment