18.12.2015 శుక్రవారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు శ్రీ జీ.ఎస్. ఖపర్డే గారి డైరీలోని మరికొన్ని విశేషాలు చదవండి.
శ్రీ జీ.ఎస్.
ఖపర్డే డైరీ – 13
25.12.1911 సోమవారం
ఉదయం ప్రార్ధన
తరువాత సాయి మహరాజ్ బయటకు వెళ్ళటం చూశాను.
తరువాత మహాజని, ఇంకా ఇతరులతోను మాట్లాడుతూ కూర్చున్నాను. అతిధులు చాలా మంది వచ్చారు. ఇంకా ఇంకా ఎందరో వచ్చారు. అసలు తీరిక లేకుండా ఉంది. సాయిమహరాజ్ ను దర్శించుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని
ఆహ్వానించి గోవర్ధన దాస్ మధ్యాన్నం భోజనాలు పెట్టాడు.
మా అబ్బాయి బల్వంత్ కి క్రిందటి రాత్రి ఒక కల వచ్చింది. ఆ కలలో సాయి మహరాజ్, బాపూ సాహెబ్ జోగ్ ఇద్దరూ ఎలిచ్
పూర్ లోని మా ఇంటిలో ఉన్నట్లుగా కనిపించారు.
మా అబ్బాయి బాబాకు భోజనం పెట్టాడు.
వాడు నాకా కల గురించి చెప్పాడు. అదంతా
వాడి ఊహ అనుకున్నాను. కాని ఈ రోజు ఆయన బల్వంత్
ని పిలిచి “నిన్న నీ ఇంటికి వెళ్ళాను. నువ్వు
నాకు భోజనం పెట్టావు గాని దక్షిణ ఇవ్వలేదు.
ఇప్పుడు నువ్వు నాకు పాతిక రూపాయలు ఇవ్వు” అన్నారు. బల్వంత్ బసకు తిరిగి వచ్చి, మాధవరావు దేశ్ పాండెని
వెంట బెట్టుకుని వెళ్ళి దక్షిణ ఇచ్చాడు. మధాహ్న
ఆరతి సమయంలో సాయి మహరాజ్ నాకు కోవా, పళ్ళు ప్రసాదంగా ఇచ్చి వంగి నమస్కారం చేసుకోమని
సైగ చేశారు. వెంటనే నేను సాష్టాంగ నమస్కారం
చేసుకున్నాను. ఆయన మాధవరావు దేశ్ పాండేతో రహస్యంగా
ఏదో మాట్లాడారు. అతను నాకు తరువాత చెబుతానని
మాటిచ్చాడు. ఈ రోజు అల్పాహారం చాలా ఆలస్యమయింది. సాయంత్రం నాలుగు గంటల వరకు ముగియలేదు. మా బస దగ్గిర తన ఖర్చుతో ఏర్పాటు చేసిన మండపంలో
గోవర్ధన్ దాస్ తో కలిసి భోజనం చేశాను. ఆ తరువాత
బధ్ధకంగా ఉండి మాట్లాడుతూ కూర్చున్నాను. సాయి
మహరాజ్ సాయంత్రం వ్యాహ్యాళికి వెళ్ళడానికి బయలుదేరినపుడు మేమంతా ఆయన దర్శనం చేసుకున్నాము. మరలా చావడి ఉత్సవంలో ఆయనని చూశాము. ఈ రోజు రాత్రి కొండాజీ ఫకీరు కుమార్తె మరణించింది. ఆమెను మా బస దగ్గరే ఖననం చేశారు. భీష్మ భజన, దీక్షిత్ రామయణ పఠణం జరిగాయి.
26.12.1911 మంగళవారం
ఉదయం తొందరగా
నిద్ర లేచి కాకడ ఆరతికి వెళ్ళాను. సాయిమహరాజ్
ఒక అసాధారణమైన స్థితిలో ఉన్నారు. ఆయన కఱ్ఱ తీసుకుని నేలమీద చుట్టూతా కొట్టారు. ఆ సమయానికి
ఆయన చావడి మెట్లు దిగి, రెండు సార్లు వెనక్కి, ముందుకి నడిచి, భయంకరమయిన భాష మట్లాడారు. తిరిగి వచ్చాక నేను ప్రార్ధన ముగించుకుని స్నానం
చేసి నా గది ముందున్న వరండాలో కూర్చున్నాను.
సాయి మహరాజ్ బయటకు వెళ్ళడం చూశాను.
పూనా ప్లీడరు గోఖలే ఈ రోజు వచ్చారు.
గణపతి బాబా సజీవంగా ఉన్నపుడు ఆయన నా
భార్యని షేవ్ గావ్ లో చూశారు. ఆయనతో మన దేశంలో
తయారయిన బొమ్మలు అమ్మే వ్యక్తి ఒకతను వచ్చాడు. మధ్యాహ్న ఆరతి తరువాత వాళ్ళు నన్ను కలిసారు. ఆ తరువాత సాయంత్రం దాకా కాసేపు పడుకున్నాక మహాజనితో
మాట్లాడుతూ కూర్చున్నాను. మధ్యాహ్నం చావడిలో
సాయి మహరాజ్ ను దర్శించుకున్నాము. ఆ తరువాత
సాయంత్రం ఆయన వ్యాహ్యాళికి వెడుతున్నపుడు చూశాము. ఆయన ఎంతో దయాగుణంతో సుందరంగా ఉన్నారు.
ఈ రోజు ఆయన మా అబ్బాయి బల్వంత్ తో మాట్లాడారు. తన దగ్గిర కూర్చోబెట్టుకుని అందరూ వెళ్ళిపోయినా
తన వద్దే ఉంచేసారు.
ఆయన మా అబ్బాయితో “సాయంత్రం అతిధులనెవ్వరినీ రానివ్వద్దు. నా గురించి శ్రధ్ధ తీసుకో, బదులుగా నేను నీ పట్ల శ్రధ్ధ వహిస్తాను” అన్నారు. మాధవరావు దేశ్ పాండేకి సుస్తీ చేసింది. అతనికి జలుబుగా ఉండి పడుకున్నాడు, అలాగని మంచానికే అంటిపెట్టుకుని పడుకుండిపోలేదు. సాయంత్రం ఎప్పటిలాగానే భీష్మ భజన, తరువాత దీక్షిత్ రామాయణ పఠన కార్యక్రమాలు జరిగాయి. పురాణం వినడానికి భాటే వచ్చాడు. ఈ రోజు మేము సుందరకాండ ప్రారంభించాము.
ఆయన మా అబ్బాయితో “సాయంత్రం అతిధులనెవ్వరినీ రానివ్వద్దు. నా గురించి శ్రధ్ధ తీసుకో, బదులుగా నేను నీ పట్ల శ్రధ్ధ వహిస్తాను” అన్నారు. మాధవరావు దేశ్ పాండేకి సుస్తీ చేసింది. అతనికి జలుబుగా ఉండి పడుకున్నాడు, అలాగని మంచానికే అంటిపెట్టుకుని పడుకుండిపోలేదు. సాయంత్రం ఎప్పటిలాగానే భీష్మ భజన, తరువాత దీక్షిత్ రామాయణ పఠన కార్యక్రమాలు జరిగాయి. పురాణం వినడానికి భాటే వచ్చాడు. ఈ రోజు మేము సుందరకాండ ప్రారంభించాము.
(మరిలోన్ని విశేషాలు తరువాతి సంచికలో )
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment