24.12.2015 గురువారం
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
దత్త జయంతి శుభాకాంక్షలు
శ్రీ షిరిడిసాయి వైభవం - నాస్తికుడు - ఆస్తికుడు
నాస్తికులను కూడా ఆస్తికులుగా మార్చే శక్తి బాబా లో ఉంది. నిజం చెప్పాలంటే నాస్తికులను ఆస్తికులుగా మార్చడానికి ఆయన ఏవిధమైన మంత్ర తంత్రాలు ఉపయోగించలేదు. ఆయనలో ఉన్న దైవిక శక్తే మనలో మార్పు తీసుకొని వస్తుంది. ఆ శక్తి ఊహకందనిది, వర్ణింపరానిది. అనుభవించిన వారికే తెలుస్తుంది. బాబా దృష్టిలో అందరూ సమానులే. అయస్కాంతం ఆకర్షించినట్లుగా బాబా లో ఉన్న శక్తి మనలని ఆయనవైపు లాక్కుంటుంది. బాబా ఎటువంటి లౌకిక సుఖాలని ఆశించలేదు. తనను నమ్ముకొన్న భక్తులను సన్మార్గంలో పెట్టి మోక్షాన్ని ప్రసాదిస్తారు. ఈ రోజు శ్రీ షిరిడి సాయి వైభవంలో నాస్తికుడు ఆస్తికుడిగా మారిన వైభవం తిలకించండి.
నాస్తికులు ఆ
తరువాత బాబాకు అంకిత భక్తులుగా మారిన సంఘటనలెన్నో సత్చరిత్రలో మనకు కనిపిస్తాయి. మాలేగావ్ డాక్టర్ (సాయి సత్చరిత్ర 34వ.అధ్యాయం
) న్యాయవాది జెఠా భాయి క్కర్ (సాయి సత్చరిత్ర 35వ.అధ్యాయం) ఇంకా ఎంతో మంది ఉన్నారు. బాలా సాహెబ్ భాటే కధ మనసుకు ఎంతో హృద్యంగా ఉంటుంది.
అతను కోపర్ గావ్
మామలతాదార్, చందోర్కర్ కి ఎప్పటినుండో స్నేహితుడు.
కళాశాలలో చదువుకునేటప్పుడే ఇద్దరికీ
మంచి పరిచయం ఉంది. చందోర్కర్ ఆధ్యాత్మిక
గ్రంధాలలో మంచి ప్రావీణ్యుడయితే, బాలా సాహెబ్ పూర్తిగా వ్యతిరేకి. చందోర్కర్ బాబాకు అంకిత భక్తుడు. బాలా సాహెబ్ పూర్తి నాస్తికుడు. వారిద్దరూ ఎప్పుడు కలుసుకున్నా, ఉన్నత చదువులు చదువుకున్న
చందోర్కర్ ఒక మానవ మాత్రుడికి నమస్కరించడమా అని బాలా సాహెబ్ ఎగతాళి చేస్తూ ఉండేవాడు.
షిరిడీ యాత్రకి వెళ్ళేవాళ్ళని కూడా వెళ్ళకుండా తరచుగా ఆపే ప్రయత్నం కూడా చేసేవాడు. ఏ భక్తుడూ కూడా షిరిడి వెళ్ళి బాబాను దర్శించుకోకుండా
వాళ్ళని చెడగొట్టడమే తన జీవితాశయం అన్నట్లుగా ప్రవర్తించేవాడు.
1894 వ.సంవత్సరంలో బాలా సాహెబ్ కి సాకోరీకి బదిలీ అయింది. అక్కడ సంత్.బహు మహరాజ్ ద్వారా కబీర్ కీర్తనలు విన్నాడు. ఎందుచేతనో అవి అతన్ని ఆకర్షించాయి. చాలా శ్రధ్ధగా
వినసాగాడు. ఆ తరువాత అతను షిరిడీ వచ్చి బాబాను
దర్శించుకోవడం జరిగింది. బాబాను చూసిన మరుక్షణమే
అతనికి మనస్సు ఆనందంతో నిండిపోయి ఎంతో ప్రశాంతతను పొందింది. పరిసరాలను కూడా మర్చిపోయి బాబా వంకే చూస్తూ ఉండిపోయాడు.
కొంతసేపటి తరువాత అతని కూడా వచ్చినవాళ్ళు సాకోరికి
తిరిగి వెడదామని పిలిచారు. “ఆగండి, కొంతసేపు
ఆగండి” అన్నాడు కాని అక్కడినుండి కదలలేదు.
వారు ఎంతో సేపు వేచి చూశారు కాని, అతను మాత్రం అక్కడినుండి కదలలేదు. ఆవిధంగా గంటలు గంటలు గడిచిపోయాయి. ఇక ఆఖరికి అతనికూడా వచ్చినవాళ్ళు వెళ్ళిపోయారు. ఆవిధంగా బాలా సాహెబ్ లో మార్పువచ్చి షిరిడి నే తన
స్వస్థలంగా చేసుకొని అక్కడే స్థిరంగా ఉండిపోదామనే నిర్ణయానికొచ్చాడు. ఒకప్పుడు ఎంతో
బాధ్యత కలిగిన వ్యక్తి ఇప్పుడు తన ఉద్యోగం, కుటుంబం, ఇల్లు అన్నిటినీ మరచిపోయాడు. బాబా మహాసమాధి చెందేంతవరకు షిరిడిలోనే ఆయన సేవ చేసుకుంటూ
ఉండిపోయాడు.
ఈ ఆకస్మికమైన
మార్పు చూసిన మిగతా భక్తులు వ్యాకులత చెందారు. దీక్షిత్,
చందోర్కర్, శ్యామా అందరూ అతని విషయంలో కలగచేసుకోమని బాబాని అర్ధించారు. బాబా అతనితో ఆరునెలలపాటు సెలవు పెట్టమని చెప్పారు. బాబా చెప్పినట్లుగానే సెలవు చీటీ రాసి పంపించాడు,
కాని అతని మనసు మాత్రం స్థిరంగానే ఉంది. ఆఖరికి
అతని పై అధికారులు, సహోద్యోగులు, స్నేహితులు అందరూ వచ్చి తమతో వచ్చేయమని ఎంతగానో చెప్పి చూసారు. అప్పుడు, బాలా సాహెబ్ “ ఒక వ్యక్తి తన లక్ష్యం తెలుసుకున్న
తరువాత ఇంక దానిని విడిచిపెట్టకూడదు” అన్నాడు.
బాలా సాహెబ్ ఎంతో బాధ్యాయుతంగా పనిచేసే వ్యక్తి కాబట్టి, అతని మనసంతా షిరిడి
ఫకీరు కి అంకితమయిపోవడం చేత ఆయన యజమాని ‘కారుణ్య ప్రాతిపదికపై, (compassionate basis) అతనిని నెలకు పాతికరూపాయలు
పెన్షన్ వచ్చే ఏర్పాటు చేసాడు. ఆధ్యాత్మికంగా బాలా సాహెబ్ ఎంతో అభ్యున్నతిని సాధించి
తాను మరణించేవరకు షిరిడీలోనే ఉండిపోయాడు.
ఈయన గురించి
శ్రీ సాయి సత్ చరిత్ర 2వ. 33 వ. అధ్యాయాలలో ప్రస్తావించబడింది. బాబా మహాసమాధి చెందిన తరువాత బాబా వారికి i 13వ.రోజున
జరిపించే కార్యక్రమాలు తిలాంజలి, తిలతర్పణం, పిండప్రదానం, బాలాసాహెబ్ భాటే నిర్వహించాడు.
(ది గ్లోరి ఆఫ్ షిరిడీ సాయి 24 డిసెంబరు 2015 సంచికనుండి గ్రహింపబడింది.)
(మరికొన్ని వైభవాలు తరువాయి సంచికలో )
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment