31.12.2015 గురువారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం
ఈ కొత్త సంవత్సరంలో అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించమని బాబాని మనమందరం వేడుకుందాం.
ఈ రోజు శ్రీ జీ.ఎస్.ఖపర్డే గారి డైరీలోనుండి మరికొన్ని విశేషాలను తెలుసుకుందాం.
శ్రీ జీ.ఎస్. ఖపర్డే డైరీ - 14
27.12.1911
రాత్రి
సరిగా నిద్రపట్టలేదు. కాని,
ప్రొద్దున్న తొందరగానే లేచి స్నానం చేసి
ప్రార్ధన చేసుకొన్నాను. ప్రతిరోజు కంటే ముందరే తయారయ్యాను. ఇక్కడ
ఉన్న గూఢచారులు మునుపటికన్నా ఈ రోజు చాలా
చురుకుగా అన్నీ కనిపెడుతూ వ్యవహరిస్తున్నారు. ఒకతను
సాయిమహరాజ్ దగ్గరే ఉండిపోయాడు. మరొకతను
నా వెంటే తిరుగుతున్నాడు.
అతనిని పరీక్షిద్దామని నేను టిప్నిస్ ఇంటికి
అతని భార్యను పలకరిద్దామనే నెపంతో వెళ్ళాను. కళ్యణ్
నించి వచ్చిన గూఢచారి నన్ననుసరిస్తూ అక్కడికి
కూడా వచ్చాడు. తిరిగి
నేను బయలుదేరగానే తను కూడా నావెనకే
బయలుదేరాడు. కోపర్
గావ్ నుంచి చీఫ్ కానిస్టేబుల్,
హెడ్ కానిస్టేబుల్ తో వచ్చి నా గదిలో
కూర్చున్నాడు. అప్పటికె
మాఅబ్బాయి బల్వంత్ అక్కడే ఉన్నాగాని వారిద్దరిమధ్యా ఎటువంటి సంభాషణ జరగలేదు. ఆతరువాత
వీళ్ళు ఏమీ చేయకుండా వెళ్ళిపోయారు,
కాని దీక్షిత్ వాడా ముందు చాలాసేపు
సంప్రదింపులు జరుపుకొన్నారు. అసలు
ఇదంతా దేని గురించని నాకు
చాలా ఆశ్చర్యం కలిగింది. ముంగే
అధిక సమయం వారితోనే ఉన్నాడు. మధ్యాహ్న
ఆరతి తరువాత మూడు గంటలకి నేను
అల్పాహారం తీసుకున్నాను. తరువాత
పడుకుని నిద్రపోయాను. మధ్యాహ్నం
చాలా మంది బాబా దర్శనం
చేసుకుందామని ప్రయత్నించారు కాని బాబా వారితో
మాట్లాడటానికిష్టపడక, వెంటనే పంపించి వేశారు. అందుచేత
నేను వెళ్ళలేదు. చదువుకుంటూ
కూర్చున్నాను.
మేమంతా
బాబా సాయంత్రం వ్యాహ్యాళికి వెళ్ళేటప్పుడు మరలా శేజ్ ఆరతి
సమయంలోను దర్శించుకున్నాము. పాటలు
పాడేవాళ్ళు చాలా మంది ఉండటంతో
ఈ రోజు భీష్మ భజన చాలా
సేపు జరిగింది. ఒక
ముస్లిమ్ యువకుని పాట నన్ను ముగ్ధుణ్ణి చేసింది. ఆ తరువాత
దీక్షిత్ రామాయణమ్ చదివాడు.
28.12.1911
ఉదయం
నాప్రార్ధన అయిన తరువాత, డా.హాటే, ఆర్.డి.
మోర్గావ్ కర్ లకు ఇంటికి వెళ్ళడానికి అనుమతి లభించడంతో వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు
వెళ్ళిన వెంటనే నానాసాహెబ్ చందోర్కర్, సి.వి.వైద్య,
నటేకర్ (హంస) గార్లు వచ్చారు,
చివరాయనతో నేను చాలాసేపు మాట్లాడిన
తరువాత దగ్గరలో ఉన్న డేరాలో ఉంటున్న
మొదటి ఇద్దరినీ చూడటానికి వెళ్ళాను. హంస
హిమాలయాలలో చాలా దూరం ప్రయాణించాడు. అతను మంచి పండితుడు. అందుచేతనే
అతని సంభాషణ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. సి.వి. వైద్యకు ఒక
కంటిలో ఏదో పడి ఎఱ్ఱగా
అయింది. చందోర్కర్
ఎప్పటిలాగే చాలా ఉల్లాసంగా ఉన్నాడు. మేమంతా
మధ్యాహ్న ఆరతికి వెళ్ళాము. మారుతి
అని పిలవబడే త్రయంబకరావు చాలా కోపంగా ఉన్నాడు. అతను
ఈరోజు పూజకు రాలేదు. చిరచిరలాడుతూ ఉన్నాడు. ఈ
రోజు మాధవరావు దేశ్ పాండే మెరుగయ్యాడు. అతను
ఈ రోజంతా దాదాపు నిలబడే
ఉన్నాడు. అసంఖ్యాకంగా
వచ్చిన అతిధులందరికీ ఎంతో ఓపికతో అతిధి
మర్యాదలు చేసాడు. ఈ రోజు చందోర్కర్
కళ్యాణ్ కి వెళ్ళిపోయాడు.
మరుసటి ఆదివారం వస్తానని చెప్పాడు. మధ్యాహ్నం
హంసతో, దాదాపు సాయిమహరాజ్ సాయత్రం వ్యాహ్యాళికి వెళ్ళేటప్పుడు నేను దర్శించుకునే సమయం
వరకు మాట్లాడుతూ కూర్చున్నాను. ఆయన
ఈ రోజు ఎవ్వరినీ తన
దగ్గర కూర్చోనివ్వకుండా
అందరికీ ఊదీనిచ్చి పంపించేశారు. హంస
సాయంత్రం రాధాకృష్ణమాయి వద్దే గడిపాడు. ఆమె పాటలు చాలా
బాగా పాడుతూ భజన చాలా అద్భుతంగా
చేస్తుంది. భీష్మ భజనలో చాలా
మంది పాల్గొన్నారు. తరువాత దీక్షిత్ రామాయణం జరిగింది. కళ్యాణ్
సబ్ ఇన్స్పెక్టర్ ఈ రోజు వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు
ఎంతో గౌరవంగా నాకు నమస్కరించడం నాకెందుకో
కాస్త ఆశ్చర్యమనిపించింది. ముంగీ
ఇంకా ఇక్కడే జనాలమధ్య తిరుగుతూ ఉన్నాడు. మోర్వీ
నుంచి దాదా గోలే వచ్చాడు. నాకక్షిదారులలో
ఒకడయిన రామారావు ఇక్కడే ఉన్నాడు. అతను
నన్ను ఒక పిటీషన్ రాసివ్వమన్నాడు. దానికి
సమయం లేదు.
(మరికొన్ని విశేషాలు తరువాతి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment