01.01.2016 శుక్రవారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి బంధువులందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు
ఈ రోజు శ్రీ షిరిడీ సాయి వైభవంలోని రెండు వైభవాలు తెలుసుకుందాం.
శ్రీ సాయి సత్ చరిత్ర పారాయణ చేస్తున్నవారికి, చేసినవారికి, ప్రతిరోజు పారాయణ చేస్తున్నవారందరూ గ్రహించే ఉంటారు. సాయి చెప్పిన మాట ... తాను అందరి హృదయాలలోను ఉన్నానని, సకల జీవరాసులలోను ఉన్నానని. మానవులే గాక సకల జీవరాసులన్నిటిలోను ఆకలి ఒక్కటే. ఏ జీవి ఆకలి తీర్చినా నా ఆకలి తీర్చినట్లే అని చెప్పారు బాబా. ఈ విషయాన్ని తెలిపే ఈ రెండు వైభవాలనుండి మనం గ్రహించవచ్చు. ఇక చదవండి.
"ది గ్లోరీ ఆఫ్ షిరిడీ సాయి" ఏప్రిల్, 2015 సంచికనుండి అనువదింపబడింది.
శ్రీ షిరిడీ సాయి వైభవం - అందరి హృదయాలను పాలించువాడను నేనే
ఒకసారి నానా
మధ్యాహ్నం 12 గంటలకు షిరిడీ వచ్చి బాబా దర్శనం చేసుకొన్నాడు. తనకు బొబ్బట్లు తినాలనుందని, వాటిని తెచ్చిపెట్టమని
నానాను కోరారు బాబా.
నానా మొదట్లో సందేహించాడు,
కారణం అప్పటికే మధ్యాహ్నం 12 గంటలు దాటిపోయింది. అందుచేత మరుసటిరోజు తెచ్చిపెడతానని చెప్పాడు నానా. కాని బాబా నానా చెప్పినదానికి సమ్మతించక, “ఎంత ఆలస్యమయినా
సరే, నాకు ఈ రోజే బొబ్బట్లు కావాలి” అన్నారు.
సరే అని నానా, ఎవరయినా స్త్రీ ఒక్కొక్క బొబ్బట్టు ఒక రూపాయికి తయారు చేసి ఇస్తుందేమో
కనుక్కోవడానికి వెళ్ళాడు.
సాయంత్రానికి మంచి
రుచికరమయిన, అప్పుడే తయారయిన బొబ్బట్లు తీసుకుని వచ్చి బాబా ముందర పెట్టాడు. కాని బాబా వాటినలాగే ఉంచి ముట్టుకోకుండా చిన్న ముక్కను మాత్రం
తుంచి నోటిలో వేసుకొన్నారు.
కొంతసేపటి తరువాత, బాబా “నేను తినేసాను, వీటిని పట్టుకెళిపో
“ అన్నారు నానాతో.
తను ఇంత కష్టపడి
బొబ్బట్లు తయారుచేయించి తీసుకుని వస్తే బాబా అసలు తినకుండా చిన్న ముక్క మాత్రం తిని అన్నీ పట్టుకెళ్ళిపొమ్మని,
బాబా అన్న మాటకు నానాకు విసుగు వచ్చింది. నానా కోపంతో చావడికి వెళ్ళిపోయాడు. బాబా అతనిని పిలిచి, నాభాగాన్ని నేను తినేశాను,
నువ్వు తిను అన్నారు.ఈ విధంగా రెండు సార్లు జరిగింది. అప్పుడు బాబా “నువ్వు పద్దెనిమిది సంవత్సరాలకు పైగానే
నాతో ఉన్నావు. నానుంచి నువ్వు నేర్చుకున్నదేమిటి? నువ్వు తెచ్చిన బొబ్బట్టుని చీమల రూపంలో నేను తిన్నాను”
అన్నారు. నానా బాబా చెప్పినదానికి ఒప్పుకోలేదు.
నానా వివేకవంతుడే. బాబా సర్వాంతర్యామి అని , అందరిలోను
ఉన్నాడని తెలుసు. కాని బాబా చెప్పినదానికి
నమ్ముదామన్నా అది అతనికి కష్టసాధ్యమయిన విషయంగా అనిపించింది. బాబా అతనికి ఒక సంజ్ఞ చేశారు. అది చాలా రహశ్యంగా అతని హృదయాంతరంలోకి సూటిగా
తగిలింది. అది ఎవరికీ తెలియదు. అప్పుడు నానాకి అర్ధమయింది. వాస్తవంగా ఆయన తన హృదయంలోనె వున్నారనీ, చీమలలోను,
సకల జీవరాసుల ఆత్మలలోను ఉన్నారనే విషయాన్ని గ్రహించుకొన్నాడు.
***
ఒకరోజు సగుణమేరు
బాబా దర్శనానికి వెళ్ళినపుడు. అతని మీద బాబాకు చాలా కోపం వచ్చింది. నేను చెప్పినట్లుగా నువ్వు నడుచుకోవటల్లేదని బాగా
చివాట్లు పెట్టారు. తన వల్ల ఏవిధమయిన తప్పు
జరిగిందా అని సగుణ మేరు చాలా కలవర పడ్డాడు.
అప్పుడు అతనికనిపించింది, బహుశా ఎవరో బాగా ఆకలితో ఉండి ఉంటారని. అతను వెంటనే వాడాకు వెళ్ళి, మగవాళ్ళు, కాని, ఆడవాళ్ళు
కాని ఎవరన్నా భోజనం చేయకుండా ఆకలితో ఉండిపోయారా అని విచారించాడు.
ఇద్దరు భక్తులు భోజనం చేయకుండా ఉండిపోయారని తెలిసింది. అప్పుడు వారిద్దరినీ పిలిచి కడుపునిండా భోజనం పెట్టి
వాళ్ళని తృప్తి పరిచాడు. తరువాత ద్వారకామాయికి
తిరిగి వచ్చాడు. బాబా నవ్వుతూ “నా మాటలలోని
అర్ధం నీకు బోధ పడిందా? ఎల్లప్పుడూ అదే విధంగా
ఆచరిస్తూ ఉండు” అన్నారు. ఆహారం పరబ్రహ్మ స్వరూపమని,
సర్వ జీవరాసులలో ఆకలి ఒకే విధంగా ఉంటుందని, బాబా తన ప్రవర్తన, ఆచరణ ద్వారా తన భక్తులకు
బోధించారు. సాయి సత్చరిత్రలో బాబా, లక్ష్మీబాయి
తో “ఎవరయితే ఆకలితో ఉన్నవారికి భోజనము పెట్టెదరో వారు నాకు అన్నము పెట్టినట్లే “ అన్నారు బాబా
(మరికొన్ని వైభవాలు తరువాతి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment