13.12. 2015 ఆదివారం
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు
బాబా గారు జీవించి ఉన్న రోజులలో ఆయన మహిమలను, కనులారా తిలకించిన వారు, అనుభవించినవారు ఎంతో పుణ్యం చేసుకొన్నారు. ఆయన లీలలను అనుభవించాలంటే ముఖ్యంగా మనందరికి కావలసినది ఆయనమీద అచంచలమైన భక్తి. ఆ భక్తితో ప్రార్ధించి పిలిస్తే ఓయని పలకుతారు బాబా. మనసులో ఆర్తితో ప్రార్ధిస్తే చాలు. ఇప్పుడు షిరిడిసాయి వైభవంలోని ఈ రెండు లీలలను చదవండి.
శ్రీ షిరిడీ సాయి వైభవం - సాయి మహిమలు
బాబా ఒకసారి,
కాకా ఎడమకాలి నొప్పితో బాధ పడుతున్నాడని తెలిసినా, తనతో కూడా నీమ్ గావ్ కి రమ్మన్నారు. ఆ సమయంలో కాకా విపరీతమయిన నొప్పితో బాధ పడుతున్నాడు. కుంటుతూ ఒక ఫర్లాంగు కూడా నడవలేని పరిస్థితి. కాకాకి బాబా మీద పరిపూర్ణమయిన భక్తి కలవాడవటమంచేత
బాబా రమ్మన్న వెంటనే బయలుదేరాడు. తన కోసం బాబా
ఏదో ప్రణాళిక వేసుకున్నారని అర్ధమయింది.
ఇద్దరూ
కలిసి షిరిడీనుండి రాను పోను 6 కి.మీ.దూరంలో ఉన్న నీమ్ గావ్ కి బయలుదేరారు. ఎగుడు దిగుడుగా దుమ్ముతో నిండి ఉన్న రోడ్డు మీద
నడచుకుంటూ వెళ్ళారు. విచిత్రమేమంటే కాకా కాలిలో
వీసమెత్తు నొప్పి కలగ లేదు. కాకా తిరిగి షిరిడీ
వచ్చేటప్పటికి కాలి నొప్పి పూర్తిగా తగ్గిపోయింది.
1917 వ.సంవత్సరంలో
రత్నగిరి, వెంగుర్ల తాలూకా బబోల్ గ్రామంలో భరద్వాజ్ గోత్ర గౌరవార్ధం మహామండలిని నిర్వహించారు. దానికి అధ్యక్షత వహించి, అధ్యక్షునిగా ఉండమని ధబోల్కర్
గారిని అహ్వానించారు. ఎప్పటిలాగే ధబోల్కర్
బాబాని సంప్రదించారు. బాబా అనుమతివ్వలేదు. తరువాత సంవత్సరం కూడా అదే విధంగా జరిగింది. అందుచేత ఆయన ఆ ఆలోచనని విరమించుకున్నారు. బాబా ఆయనకు కలలో దర్శనమిచ్చి వచ్చే సంవత్సరం అధ్యక్షుడిగా ఉండమని
అనుమతిని ప్రసాదించారు. అందుచేత ఆయన బాబా చెప్పినట్లే
మహామండలికి అధ్యక్షుడిగా ఉండటానికి అంగీకారాన్ని తెలిపారు. ధబోల్కర్ కుమార్తెకు మానసిక దౌర్బల్యం వల్ల తండ్రినే
అంటిపెట్టుకుని ఉండేది. తండ్రి తప్ప ఎవరేమి
చెప్పినా వినేది కాదు. అధ్యక్షునిగా, ధబోల్కర్
బబోల్ గ్రామానికి వెళ్ళి నాలుగు రోజులలో తిరిగి వచ్చారు. ఆ నాలుగు రోజులు ఆయన కుమార్తె సాధారణ స్థితిలో మామూలు
మనిషి లాగే ఉంది. కాని ఆయన తిరిగి వచ్చిన తరువాత
ఆమెకు మరలా మానసిక రోగం తిరగబెట్టింది. దీనికి
తోడు మూర్చలు కూడా ప్రారంభమయ్యాయి. ఎవరూ కూడా
ఆపలేకపోయేవారు. తన కూతురు గర్భవతవడం చేత ధబోల్కర్
ఎంతో కలత చెందాడు. ఆ సమయంలో కడుపులో ఉన్న బిడ్డకు
ఏమవుతుందోనని ప్రతి ఒక్కరూ భయపడసాగారు.
దయార్ద్ర హృదయుడు, యోగక్షేమాలను చూసే ఒక తండ్రిగా కుమార్తెను
పరీక్షించడానికి, ముగ్గురు ప్రముఖ గైనకాలజిస్టులని రప్పించారు ధబోల్కర్ గారు. ప్రసవమయి క్షేమంగా బిడ్డ బయటకు రావాలంటే సిజేరియన్
చేయవలసిందేననీ, కానీ తల్లి ప్రాణానికి ప్రమాదమని చెప్పారు. ఆ మరుసటి రోజే ఒక వైద్యుడు ఎవరూ పిలవకుండానే తనంతట
తానే వచ్చి భగవంతుని ప్రార్ధించి ఆయన సహాయం కోరమని సలహా ఇచ్చాడు. ధబోల్కర్ కి ఇది చాలా సులభమైన విషయం. ఆయన వెంటనే తల్లికి, శిశువుకు సహాయం చేయమని బాబాని
వేడుకున్నారు.
వైద్యుల సహాయం, సర్జరీ అవసరం
లేకుండానే ఆమెకు సుఖప్రసవం అయింది. కొంత కాలం
తరువాత తల్లి బిడ్డను తీసుకొని షిరిడీ వచ్చింది.
దయాళువయిన బాబా అంతా శుభం జరుగుతుందని దీవించారు. ఆతరువాత ఆమె బాధలన్నీ తొలగిపోయాయి.
(సర్వమ్ శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment