Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, February 11, 2016

శ్రీ షిరిడీ సాయి వైభవమ్ – పునర్జన్మను ప్రసాదించిన బాబా ఊదీ -

Posted by tyagaraju on 8:23 AM
      Image result for 3d images of shirdi sai baba
        Image result for images of rose hd
11.02.2016 గురువారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు మరొక అద్భుతమైన శ్రీ షిరిడీసాయి వైభవంలోని  మరొక వైభవం.

శ్రీ షిరిడీ సాయి వైభవమ్పునర్జన్మను ప్రసాదించిన బాబా ఊదీ

పురందరేకు బాబాపై అంతులేని ధృఢమయిన విశ్వాసంఆయన తన కూతురుకు గాని భార్యకు గాని ఎప్పుడయినా అనారోగ్యం కలిగితే, చూసుకోవడానికి బాబా ఉన్నారనే ధీమాతో ఉండేవాడుఒకసారి ఆయన భార్య ఉదయం 3 గంటలనుంచి 8 గంటల వరకు ఆగకుండా వాంతులు డయేరియాతో బాధపడసాగిందిఆవిడకు వాంతులు, నీళ్ళవిరోచనాలు ఆగకుండా అవుతూ ఉండటంతో 8 గంటలకి ఒళ్ళంతా చల్లబడిపోయి నాడి కూడా బలహీనంగా కొట్టుకోసాగిందివెంటనే వైద్యుణ్ణి పిలిపించారు

ఆయన పరీక్షించి ఆవిడ ఒక గంటకన్నా ఎక్కువ బ్రతకదేమోననే సందేహాన్ని వ్యక్తం చేశారుపురందరే గారు తన మేనకోడలికి బంగారు నగ చేయించుదామని కంసాలి ఇంటిలో ఉండటం వల్ల విషయం ఆయనకు తెలియదుపరీక్ష చేసిన వైద్యుడు పురందరే భార్య బ్రతికే అవకాశం లేదని చెప్పడంతో ఒకతను విషయం చెప్పడానికి పురందరే వద్దకు ఏడుస్తూ వెళ్ళాడు.  
                   Image result for images of datta mandir
పురందరేగారు ఇంటికి వెళ్ళేదారిలో దత్త మందిరం ఉందిఆయన అక్కడ బాబా, ఒక ఫకీరుగా చేతిలో జోలితో కనిపించారు ఫకీరు ఆయనను ఓదారుస్తూ నీభార్య గురించి ఏమీ భయపడకుఆమె మరణించదునీటిలో ఊదీని కలిపి ఆమె చేత త్రాగించుఒక గంటలో ఆమెకు నయమవుతుందిమిమ్మలనందరినీ నేను కాపాడుతూ ఉంటాను.” అన్నాడుపురందరే ఇంటికి చేరుకునేటప్పటికి అందరూ ఏడుస్తూ ఉన్నారుఆయన ఇంటిలోకి వెళ్ళి బాబా ఊదీని నీటిలో కలిపి భార్య పడుకున్న మంచం వద్దకు వచ్చారుఆవిడ పళ్ళు బాగా గిట్టకరచుకుని ఉన్నాయిఅందువల్ల ఆయన బాబా తీర్ధాన్ని ఆవిడ నోటిలో పోయడానికి ఒక చెమ్చాను నోటిలో పెట్టి తెరవడానికి ప్రయత్నించారుఇది చూసి చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులంతా చాలా భయపడ్డారుబలవంతంగా తీర్ధాన్ని గొంతులో పోయవద్దని చెప్పారువారి మాటలేమీ పట్టించుకోకుండా ఆయన బాబా ఊదీ తీర్ధాన్ని ఆవిడ నోటిలో పోశారుకొంత ఊదీని ఆమె శరీరమంతా రాశారు.
ఆతరువాత ఆయన స్నానం చేసి బాబాకు పూజ చేసి నైవేద్యం సమర్పించారుఇక ఎవరి కోసం ఎదురు చూడకుండా ఏమీ పట్టనట్టుగా, భోజనం చేశాడుఒక గంట తరువాత వైద్యుడు వచ్చి ఆమెని పరీక్షించాడుఆశ్చర్యకరంగా ఆవిడ కోలుకోవడం గమనించాడుశరీర ఉష్ణోగ్రత మామూలు స్థాయికి వచ్చి నాడి కొట్టుకోవడం మొదలయిందిమందు ఏమిచ్చారని పురందరేని ఆశ్చర్యంగా అడిగాడుబాబా ఊదీ తీర్ధం తప్ప మరింకేమీ ఇవ్వలేదని పురందరే సమాధానమిచ్చాడుతరువాత వైద్యుడు కొన్ని మందులనిచ్చి వాడమని చెప్పివెళ్ళిపోయాడుఫకీరు చెప్పినట్లుగానే ఆమె మరణాన్ని జయించి కోలుకుని ఆరోగ్యవంతురాలయింది.
(మరికొన్ని వైభవాలు తరువాతి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

ఈ రోజునుండి ప్రాపంచిక రంగములో ధన సంపాదనపై సాయి బానిస శ్రీరావాడ గోపాలరావు గారి  ఆలోచనలు తేదీల వారీగా ప్రచురిస్తున్నాను.  ఇవి చదివి మీ అభిప్రాయాలను నా మెయిల్ కి తెలపవసిందిగా కోరుతున్నాను.
-----త్యాగరాజు - tyagaraju.a@gmail.com- 
                     9440375411
21.01.1999
1.  ఇతరుల సిరిసంపదలను చూసి నీవు నీజీవితాన్ని కష్టాలపాలు చేయకు.  నీకు ఉన్న సగము రొట్టి తిని జీవించు.

2. తల్లిదండ్రులు, పిల్లలు, వారిమధ్యన ధన సంపాదన వ్యవహారాలు గత జన్మలోని ఋణానుబంధం వలన కలుగుతూ ఉంటాయి.  నీవు నీ పిల్లలకు ఆస్తినిచ్చిన, లేదా నీ కుమారుడు నీకు పది రూపాయలు యిచ్చినా, అవి గత జన్మలోని ఋణానుబంధ మహత్మ్యమే.

3.  నేడు సాయిభక్తిని వ్యాపారసరళిలో అమ్ముతున్నారు.  అటువంటివారినుండి దూరంగా ఉండు.

25.02.1999
4. జీవితంలో బంగారాన్ని సంపాదించడం తప్పుకాదు.  ఆ సంపాదన పేరిట బంగారంలాంటి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు.

24.03.1999
5.  సాయిపేరిట నీవు ఎవరినుండీ ధనాన్ని యాచించకు.  ఎవరయినా సాయి తత్వప్రచారానికి ధనమిచ్చిన దానిని సాయితత్వ ప్రచారానికే వినియోగించు.

30.06.2000
6. మానవత్వాన్ని మంటకలిపి ధన సంపాదన చేసేవారికంటే మానవత్వాన్ని ప్రబోధించే భగవంతుని ప్రతినిధులు (భగవంతునిపై నమ్మకము కలవారు) నాకు ప్రీతిపాత్రులు.

30.07.2000
7. విద్యాదానం చేసే గురువు తన అర్హత ప్రకారము తన జీవితానికి కావలసిన ధనసంపాదన కావించుకోవాలి.  అంతేకాని, తన శిష్యులు తనకంటె ఉన్నత చదువులు చదివి, తనకంటె ఎక్కువ ధనసంపాదన కావిస్తున్నారే అనే భావన రానీయకూడదు.

30.01.2000
8.  గుళ్ళు,గోపురాలకు నీవు ఎంత చందా యిచ్చావు అన్నది ముఖ్యం కాదు.  భగవంతుని పేరిట ఎంతమంది అన్నార్తులకు భోజనం పెట్టావు మరియు భగవంతుని ఆశీర్వచనాలను పొందగలుగుతున్నావు అనేదే ముఖ్యము.





22.03.2002
9.   కొందరు మజ్జిగమెతుకులు తినడానికి కూడా నోచుకోలేదు.  అదే కొందరు పెరుగన్నం కావాలని కోరుతూ యితరుల గురించి ఆలోచించకుండా పెరుగంతా తామే తినాలని తలచేవారిని ఏమనాలో ఒక్కసారి ఆలోచించు. 



24.07.2002
10  నీకు ఉన్న కండబలంతో సమాజములో విఱ్ఱవీగేకన్నా నీకు ఉన్న అర్ధబలంతో సమాజంలోని అన్నార్తులకు అన్నదానం చేయటం మిన్న.
(మరికొన్ని ఆలోచనలు రేపటి సంచికలో)
 (సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)





Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List