Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Tuesday, February 9, 2016

శ్రీ షిరిడీ సాయి వైభవం : ఊదీని మించిన మందు లేదు

Posted by tyagaraju on 8:23 AM
      Image result for images of shirdi saibaba talking
   Image result for images of rose hd
09.02.2016 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు శ్రీ షిరిడీ సాయి వైభవంలోని ఒక అధ్బుతమైన వైభవం ఊదీ మహత్యమ్ ..  డాక్టరు బాబా భక్తుడు.  బాబా అంటే ఎంతో భక్తి. డాక్టరయి ఉండీ తను ఇచ్చే మందుల మీద కాక బాబా ఊదీ మాత్రమే అతి శక్తివంతమయిన మందు అని భావించి, ఆయన ఏవిధంగా రోగికి నయంచేశారో ఈ రోజు చదవండి. (వైద్యం చేసినది ఆయన కాదు.  ఆయన కేవలం నిమిత్తమాత్రుడు.  అసలు వైద్యుడు బాబా)

శ్రీ షిరిడీ సాయి వైభవం : ఊదీని మించిన మందు లేదు

డాక్టర్ తల్వైల్ కర్ గారు బాబా భక్తుడు.  ఆయన షిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకుంటూ ఉండేవారు.  ఒకసారి ఆయన షిరిడీ వెళ్ళినపుడు బాబా ఆయనకు ఊదీనిచ్చారు.  ఆయన ఆ ఊదీని ఎంతో జాగ్రత్తగా భద్రపరచుకున్నారు.  

ఆయన ఇండోర్ లో తన వైద్య వృత్తిని ప్రారంభించారు.  బాబా పూజ చేసిన తరువాతనే ఆయన తన వద్దకు వచ్చే రోగులను పరీక్షిస్తూ ఉండేవారు.  అతి ప్రమాదకర పరిస్థితులలో ఉన్న ఎంతో మంది రోగులను ఆయన నయం చేయడంతో మంచి పేరు వచ్చిందాయనకు.
                   

జబ్బు బాగా ముదిరిపోయిన ఒక రోగిని ఆఖరి ప్రయత్నంగా, బంధువులు ఆయన వద్దకు వైద్యానికి తీసుకుని వచ్చారు.  ఎంతోమంది వైద్యుల వద్ద వైద్యం చేయించుకున్నా ఫలితం లేకపోయింది.  ఆ రోగి ఇక జీవిత చరమాంకంలో ఉన్నాడు.  అతని బంధువులు డా.తల్ వైల్ కర్ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఆయన వద్దకు తీసుకుని వచ్చారు.  ఆయన, రోగి కూడా వచ్చిన బంధువులను భయపడవద్దని ఓదార్చి, ఆ రోగికి కొన్ని మందులిచ్చారు.  ఆ తరువాత బాబాని ఇలా ప్రార్ధించారు. “బాబా నీ దయ వల్లనే   ఈ రోగికి పూర్తిగా నయమయి  బ్రతుకుతాడు”  ఆ విధంగా ప్రార్ధించిన తరువాత ఆయన రోగి బంధువులకి మూడు పొట్లాలు బాబా ఊదీనిచ్చారు.  ఊదీని రోజుకొకటి చొప్పున నీటిలో కలిపి రోగి చేత త్రాగించమని చెప్పారు.  డాక్టరు చెప్పిన విధంగానే వారు అతనికి ఊదీని నీళ్ళలో కలిపి మూడురోజులపాటు ఇచ్చారు.  ఆ ఊదీ మహత్యంవల్ల రోగి కోలుకొన్నాడు.  మూడవరోజున డాక్టర్ గారు ఆ రోగి ఇంటికి వెళ్ళారు.  అతని జబ్బు చాలా మట్టుకు నయమయింది.  ఆయన మరికొన్ని మందులను వాడమని, మందులు రాసిచ్చారు.  ఆ మందులు వాడిన తరువాత రోగి క్రమక్రమంగా కోలుకొని పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడు.

పూర్తిగా కోలుకొన్నాక ఆ వ్యక్తి డాక్టర్ వద్దకు చివరిసారిగా పరీక్ష చేయింకునేందుకు వచ్చాడు. అపుడు డాక్టరుగారు నీకు జబ్బు నయంచేసి నిన్ను రక్షించినది నేను కాదని చెప్పి అతనిని షిరిడీకి తీసుకుని వెళ్ళారు.  
            Image result for images of dwarkamai

ద్వారకామాయిలోకి అడుగు పెట్టగానే ఆయన బాబా వైపు చూపిస్తూ “నిన్ను మరణాన్నించి తప్పించి రక్షించినది ఆయన” అన్నారు.  అపుడా వ్యక్తి పరుగెత్తుకుని వెళ్ళి బాబా పాదాలను చుట్టేసి కృతజ్ఞతలు చెబుతూ, ఆయన అనుగ్రహాన్ని పొందాడు.
           Image result for images of shirdi saibaba talking

ఈ వైభవం ద్వారా మనం తెలుసుకోవలసినది ఏమిటంటే అంతటి పేరుప్రఖ్యాతులు సంపాదించిన డాక్టరయి ఉండీ, ఎటువంటి అహంకారం లేకుండా, బాబా మీదనే నమ్మకం ఉంఛి ఆయన చేసే వైద్యం. ప్రతిరోజూ వైద్యం ప్రారంభించే ముందు  ఆయన బాబాకు పూజ చేసిన తరువాతనే రోగులను పరీక్ష చేయడం ఆయనకు బాబా మీద ఎంత భక్తి ఉన్నదో మనం గ్రహించుకోవచ్చు.  అందువల్లే ఆయన వద్దకు వచ్చే ప్రతీ రోగి సంపూర్ణ ఆరోగ్యవంతుడయేవాడు.  నిజానికి వైద్యం చేస్తున్నది ఆయన కాదు.  బాబాయే ఆయనద్వారా వైద్యం చేస్తున్నాడని మనం గ్రహించుకోవాలి. 
(మరికొన్ని వైభవాలు తరువాతి సంచికలో)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)




Kindly Bookmark and Share it:

2 comments:

SHIRIDI SAI RAJ KUMAR on June 6, 2022 at 9:03 AM said...

SAI RAM BABA THANKYOU

SHIRIDI SAI RAJ KUMAR on July 29, 2022 at 6:40 AM said...

sairam baba is great GOD

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List