Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Sunday, March 20, 2016

శ్రీసాయి పుష్పగిరి – ఆధ్యాత్మికం 8వ.భాగమ్

Posted by tyagaraju on 8:28 AM
      Image result for images of saibanisa
      Image result for images rose gardens
20.03.2016 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబాఅవారి శుభాశీస్సులు
ఈ రోజు సాయిబానిస గారికి బాబావారు ఇచ్చిన ఆధ్యాత్మిక సందేశాలను మరికొన్ని తెలుసుకుందాము
             Image result for images of saibanisa

శ్రీసాయి పుష్పగిరి – ఆధ్యాత్మికం 8వ.భాగమ్

03.04.2009

71.  పిల్లవాడు తన తల్లి పాలు త్రాగి ఆమెకు ఋణపడి ఉంటాడు ఋణము ఒకజన్మలో తీరదుబాబా ఆవుపాలు త్రాగి ఆవు ఋణమును లక్ష్మీఖాపర్డే రూపములో తన ద్వారకామాయికి రప్పించుకుని ఆమెను ఆశీర్వదించినారు.  (శ్రీ సాయి సత్ చరిత్ర 27.అధ్యాయము)
                                                                                                                                                                                             సాయిబానిస

11.04.2009

72.  గుఱ్ఱపు పందాలలో ఆఖరులో మెల్లిగా వచ్చిన గుఱ్ఱానికి, రౌతుకు బహుమానమిచ్చారుగుఱ్ఱపు పరుగు వేగాన్ని తగ్గించి రౌతు చాలా మెల్లిగా గుఱ్ఱాన్ని ముందుకు నడపడం కూడా ఒక సాధనె పందెములో బహుమానము పొందటం ఒక అదృష్టము.                             
 (ఇక్కడ గుఱ్ఱము అనగా భగవంతుని అనుగ్రహమని భావించవలెను) 


29.04.2009

73.  ఎవరినివారే ఉధ్ధరించుకోవాలిఇతరులను ఉధ్ధరించగలనని అనే ఆలోచన అవివేకముకనుక వివేకముతో జీవించి నీగమ్యము చేరుకో



20.05.2009
                  
       
74.  గురువు శిష్యుడు యిద్దరూ ఒకచోట కూర్చుండి శాస్త్ర అధ్యయనం చేయాలిఅంతేకాని, గురువు తన పని తాను చేసుకుంటూ శిష్యుడిని వదలివేసిన అది గురుశిష్య సాంప్రదాయానికి విరుధ్ధముగురుశిష్య  పరంపరలో అపార్ధాలకు చోటు ఉండరాదు.  

24.06.2009

Image result for images of big fish and small fish in sea

75.  సముద్రంలో పెద్ద చేపలు చిన్నచేపలను తినడం సృష్టి ధర్మాలలో ఒకటిఇది లేనిరోజున సముద్రమునిండా చిన్న చేపలతో నిండిపోయి సముద్రము నిరుపయోగమయిపోతుందిపెద్దచేప చిన్న చేపలను తినడం జీవహింస కాదు.
                            Image result for images of big fish eating small fish in sea



25.07.2009

76.  శ్రీసాయి పంచభూతాలలోను ఉన్నారుపంచభూతాల కలయికే ఈశరీరముఅందుచేత శ్రీసాయి ప్రతి జీవిలోను ఉన్నారు                                                                                                 సాయిబానిస

77.  సరస్వతీ కటాక్షము ఉన్నవారిలో చాలామందికి అహంకారం రావడం నాకు కొంత చికాకు కలిగించిందిమరికొంత మందికి లక్ష్మీకటాక్షం రావడంతో వారు అహంకారంతో జీవించడం ప్రారంభించారుఇది నాకు చాలా బాధకలిగించిందిభగవంతుని సేవలో అహంకారం విడనాడాలిఅప్పుడే జీవితానికి సార్ధకత అని  గ్రహించాను.    

19.08.2009

78.  దోమలలోను, చీమలలోను ఉన్నది నేనే అని నేను అందరికి చెబుతున్నానే మరి షిరిడిలోని నా విగ్రహానికి రాత్రి ఆరతి యిచ్చిన తరువాత దోమతెర కట్టడం నాకర్ధం కావటల్లేదు.
                     Image result for images of man in gods namasmaran


79. నీ శరీరం పంచభూతాలతో సృష్టించబడింది కదానీ శరీరంలోని పంచభూతాలను నీవు చూడలేవుకాని వాటి ఉనికిని నీవు అనుభూతిగా పొందుతూ ఉంటావుఅలాగే నీవు నీ కళ్ళతో భగవంతుని చూడలేవుకాని నీవు భగవంతుని అనుభూతిని మాత్రం పొందగలవుకారణం పంచభూతాలను సృష్టించింది భగవంతుడే కనక

80.  స్నేహాలు, బంధుత్వాలు, శరీరానికి ఎంత వరకు ఉపయోగపడతాయి అని ఆలోచించి అంత వరకే అవి నిజమని గుర్తించుఅవి మాత్రము శాశ్వతం కావుఅందుచేత శాశ్వతమయిన భగవంతుని సదా స్మరిస్తూ ఉండు.  
            Image result for images man chanting god



(మరికొన్ని సందేశాలు తరువాతి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment