Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Monday, March 21, 2016

శ్రీసాయి లీలామృత ధార - నీ వెనుక నేనున్నాను – బాబా చేసిన మాయ

Posted by tyagaraju on 8:49 AM
               Image result for images of shirdi sainath rare photo
      Image result for images of rose hd
21.03.2016 సోమవారం 
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి 
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు 

ఈ రోజు సాయిలీల మాసపత్రిక జూన్ 1975 వ.సంచికలో ప్రచురింపబడిన ఒక సాయి లీలను ప్రచురిస్తున్నాను. చదవండి.  బాబా లీలలు అనంతం, అనూహ్యం.  ఎప్పుడు ఎవరిని ఎలా కాపాడతారో మనం గ్రహించుకోలేము.  ఆయన తన భక్తులను అనుక్షణం కనిపెట్టుకుని వుంటూ ఉంటారని ఈ లీల చదివితే మనకి అర్ధమవుతుంది.  

శ్రీసాయి లీలామృత ధార
నీ వెనుక నేనున్నానుబాబా చేసిన మాయ 

మా  రైలు కోపర్గావ్ స్టేషన్ చేరుకునే సమయానికి అర్ధరాత్రి కావస్తూ ఉందిజనవరి నెల కావడం వల్ల చలిగాలులు శరీరానికి వణుకు పుట్టించేలా ఉన్నాయిరైలు నెమ్మదిగా స్టేషన్ లో ఆగుతూ ఉందిప్లాట్ ఫారం  అంతా నిర్మానుష్యంగా ఉందిప్లాట్ ఫారం  లో వెలిగించిన నూనె దీపాలు మాకు స్వాగతం చెబుతున్నట్లుగా మిణుకు మిణుకు మంటూ చిరు కాంతులను వెదజల్లుతూ ఉన్నాయి.  


రైలు ఆగగానే మా సామానుతో సహా అందరం ఫ్లాట్ ఫారం మీద దిగడానికి తొందరగా తలుపు వద్దకు వచ్చాముశ్రీసాయిబాబావారిని దర్శించుకోవడానికి ఇపుడు మేమంతా రెండవసారి షిరిడీకి వచ్చాముమనకు స్వాతంత్ర్యం రావడానికి కొద్ది రోజుల ముందుగా వచ్చాము. ఇపుడు శీనుకు 11 సంవత్సరాల వయసుశీను అతని తల్లిడండ్రులకు ఒక్కడే సంతానంశీను తల్లిదండ్రులకి రెండవసారి షిరిడికి రావడం చాలా చెప్పుకోదగ్గదిశీను తరువాత ఇంకొక సంతానం కలగాలనే కోరికతో ఉన్నారుగత పది సంవత్సరాలుగా కన్యాకుమరి ఉంచి కాశ్మీరు వరకు.బెంగాల్ నుండి బొంబాయి వరకు అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారుమధ్యవయసులో ఉన్న శీను తల్లిదండ్రులు అందరి దేవుళ్ళ ముందు సాగిలబడి తమకు మరొక సంతానాన్ని ప్రసాదించమని ప్రార్ధించుకున్నారుభగవంతుడు తమని ఎప్పుడు కరుణిస్తాడా అనే ఆశతో ఎక్కడ గుడి కనపడితే అక్కడికి వెళ్ళి దేవీ దేవతలను ప్రార్ధించుకుంటూ ఉండేవారుమొట్టమొదటిసారిగా వారు, రెండవ ప్రపంచయుధ్ధం పూర్తయిన సంవత్సరం తరువాత షిరిడీ వచ్చి బాబాను దర్శించుకున్నారు

Image result for images of shirdi old pictures

ఆ తరువాతనే వారి చిరకాల వాంచ నెరవేరిందికాని మొదటిసారి షిరిడీ వచ్చినపుడు శీను తల్లికి అది నిరాశను మిగిల్చింది సమయంలో ఆమె బహిష్టవడం వల్ల బాబాను దర్శించుకోలేకపోయిందిభర్తకు ఇక శెలవలు పొడిగించడానికి కూడా లేదుకొద్దిరోజులుండి బాబా దర్శనం చేసుకుందామన్న భార్య మాటని ఆమోదించలేదుశీను తల్లి బాబాను దర్శించుకోలేకపోయానే అని చాలా బాధపడి కన్నీళ్ళతో ఇంటికి తిరిగి వెళ్ళిపోయిందికాని ఎన్నళ్ళనుంచో వారు పడుతున్న వేదనకి ముగింపు వచ్చిందిబాబా అనుగ్రహంతో శీను తల్లి గర్భవతయిందిఆయన అనుగ్రహంతోనే  ఇపుడు తన రెండవ సంతానానికి బాబావారి మొదటి దర్శనం ఇప్పిద్దామని షిరిడీకి తీసుకునివచ్చింది.

సరిగా అప్పుడే ఒక విచిత్రం జరిగిందిఅందరూ తొందర తొందరగా రౖలునుండి ఫ్లాట్ ఫారం మీదకు దిగారురైలు నెమ్మదిగా బయలుదేరింది. శీను అమ్మమ్మ శీను చెల్లిలిని (శిశువుని) తన చేతులలో ఎత్తుకుని ఇంకా రైలులోనే ఉంది. ఆమె తొందరగా దిగలేకపోయింది.  శీను నాన్నగారు ఆమెతో చెయిన్ లాగు చెయిన్ లాగు అని అరుస్తూ ఉన్నారురైలు నెమ్మదిగా వేగాన్ని పుంజుకుందిశీను అమ్మమ్మ  చైన్ లాగకుండా గాబరాగా దూకేసిందిఎవరో ఆమె చేతుల్లోని  శిశువును అందుకున్నారుశీను నాన్నగారు ఆమెను పట్టుకుందామని ప్రయత్నించారు ప్రయత్నంలో ఇద్దరూ రైలు కిందకి జారిపోయారువెనకాల ఇంకా రైలు బోగీలు ఉన్నాయి. అందరూ చాలా భయంతో నిలబడి చూస్తూన్నారుక్షణాల వ్యవధిలో బలహీనంగా అనారోగ్యంగా ఉన్న శీను తల్లి రైలు వెంబడే పరుగెత్తి రైలు కిందకి  జారిపడిపోతున్న బలిష్టంగా ఉన్న తన భర్తని  పట్టుకుని పైకి లాగేసిందిశీను అమ్మమ్మకి ఏమయిందిఇంకా వెనకాల ఉన్న బోగీలు ముందుకి కదలుతూనే ఉన్నాయిముసలావిడ రైలు కింద పడి ముక్కలయిపోయి ఉంటుందనే అనుకున్నారు అందరూరైలు వెళ్ళిపోగానే అందరూ ప్లాట్ ఫారం దగ్గిరకి వెళ్ళి పట్టాలమీదకి తొంగి చూశారుఅందరూ ఏమయిందోననీ చాలా భయంగా ఉద్వేగంగా చూస్తూ ఉన్నారువిచిత్రం ఆమె బతికే ఉంది ముసలావిడ చక్కగా లేచి నుంచుంది.  శరీరం మీద ఒక్క గాయం కూడా కాలేదుఎంతటి అద్భుతంఒకేసారి రెండు అత్యద్భుతాలు.
240 పౌండ్ల బరువున్న తన భర్తని సెకన్ల వ్యవధిలో అనారోగ్యంతో బలహీనంగా ఉన్నప్పటికీ అంత సులువుగా ఎలా లాగగలిగావని శీను తల్లిని అడిగారుసాధారణంగా 10  పౌండ్లు కూడా బరువెత్తలేవని ఆమె 240 పౌండ్ల బరువున్న భర్తని సునాయాసంగా లాగిందంటే దానికి జవాబుఅది బాబా చేసిన మాయ.

                                                          అనంతుల పద్మజ
                                                             సికిందరాబాదు

                                              సాయిలీల మాసపత్రిక జూన్ 1975

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List