Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Tuesday, March 22, 2016

పుట్టినరోజున బాబా ఆశీర్వాదం

Posted by tyagaraju on 9:20 AM
     Image result for images of mylapore baba temple
   Image result for images of lotus flower

22.03.2016 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు చెన్నైనుండి శ్రీమతి కృష్ణవేణి గారు పంపించిన మరొక లీల ప్రచురిస్తున్నాను.  చదవండి.  బాబాకు పంచభూతాలపై ఆధిపత్యం ఉన్నదన్న విషయం మనకి అవగతమవుతుంది.  పాపకి పుట్టినరోజునాడు బాబా ఆశీర్వాదం లభించాలనుకున్న ఆమె కోరికను బాబా ఏవిధంగా తీర్చారో చూడండి.

పుట్టినరోజున బాబా ఆశీర్వాదం

అక్టోబరు 30.తారీకు మా పెద్దపాప పుట్టినరోజుఇపుడు మా పెద్దపాపకి 5 సంవత్సరాలుమా పెద్ద పాప ప్రతి పుట్టిన రోజు నాడు మైలాపూర్ లో ఉన్న బాబా గుడికి వెడుతూ ఉంటాముమా పెద్ద పాప మొదటి పుట్టినరోజు నాడు మైలాపూర్ బాబా గుడికి వెళ్ళి బాబా ఆశీర్వాదములు తీసుకోవాలనుకున్నాము


మొదటి పుట్టిన రోజు కాబట్టి బంధువులందరూ ఇంటిలో ఉంటారు, అందుచేత గుడికి వెళ్ళద్దు అన్నారు మా అత్తగారుకాని నాకు మాత్రం బాబాగారి ఆశీస్సులు తీసుకోకుండా ఏమి చేసినా వ్యర్ధం అనిపించిందిఅదుచేత నేను మొండిగా గుడికి బయలుదేరానుమా అత్తగారు నా నిర్ణయాన్ని కాదనలేకపోయారుఆవిడ మాటని పాటించకుండా వెడుతున్నందుకు నాకు కూడా బాధగానే ఉన్నా బయలుదేరాను గుడిలో ప్రత్యేకత ఏమిటంటే మనము తెచ్చిన పువ్వులు, శాలువా మన చేతులతో స్వయంగా బాబా మెడలో వేసి అలంకరించవచ్చు. ఇక పుట్టిన రోజంటే విడిగా బాబావారి ప్రక్కనే నిలబెట్టి అర్చన చేసి బాబా మెడలోని దండను తీసి మన మెడలో వేస్తారు విధంగా మా పాపను కూడా ఆశీర్వదిస్తారనుకున్నానుమేము అర్చన సామాగ్రి, ఒక తామర పువ్వు తీసుకుని అందరిలాగానే వరుసలో నుంచున్నాము
                   Image result for images of mylapore baba temple

మా వంతు వచ్చిన తరువాత, రోజు మా పాప పుట్టిన రోజని చెప్పాముపూజారి గారు పాప పేరు మీద అర్చన చేశారుపూజారిగారు పాప మెడలో దండ వేద్దామని చూస్తే బాబా మెడలో దండ లేదుకేవలం పెద్ద దండ మాత్రమే ఉందిఇక తామర పువ్వులు మాత్రమే ఉన్నాయిబాబా విగ్రహానికి  పీఠం వెనుక గోడ మీద బాబావారి చిత్రపటం ఉంది సమయంలో బాబా విగ్రహం మెడలో దండ లేకపోవడం చేత బాబా చిత్రపటానికి ఉన్న ఒకే ఒక దండను తీసి పూజారిగారు పాప మెడలో వేశారు.  
                          Image result for images of mylapore baba temple

నాకు చాలా సంతోషం కలిగిందిఎందుకంటే పూజారిగారు ఇవ్వదలచుకుంటే బాబా విగ్రహం పైన ఉన్న తామర పువ్వును ఇవ్వవచ్చు. కాని ఆయన బాబా చిత్రపటానికి దండ లేకపోయినా సరే అనుకుని ఉన్న ఒకే ఒక దండను పాప మెడలో వేశారు. ఇక్కడ బాబా గుడిలో ఆరతి కూడా ముందు బాబా చిత్రపటానికే చూపిస్తారు పటానికి ఉన్న దండనే పాప మెడలో వేశారునాకు తెలిసి ఎవరికీ ఈవిధంగా వేయలేదు. వేరే ఎవరికీ దొరకని అదృష్టం మా పెద్ద పాపకు దక్కినందుకు చాలా సంతోషమనిపించిందిఆయన అనుగ్రహమే లేకపోతె ఇదంతా జరిగేదామా అత్తగారు వద్దని చెప్పినా బాబా గుడికి వచ్చినందుకు బాబా మా పెద్ద పాపని విధంగా ఆశీర్వదించడం చాలు అనిపించింది నాకు సంఘటన అక్టోబరు 2011 .సంవత్సరంలో జరిగిందిమా పెద్దపాప పేరు ప్రసన్న లక్ష్మి.
                         

మాపాప 5.పుట్టినరోజు 30.10.2015.  ఆరోజు గుడికి ఎలాగయినా సరే వెళ్ళాలనిపించిందికాని బాగా వర్షం పడుతూ ఉందిచలిగాలి వల్ల ప్రొద్దుటే గుడికి వెళ్ళలేకపోయామువర్షం తగ్గితే సాయంత్రం వెడదామనుకున్నాముచిన్న పాపకి బాగా జలుబు, దగ్గుగా ఉందిపైగా వర్షం కురుస్తూ ఉండటంతో సాయంత్రం కూడా గుడికి వెళ్ళలేమనుకున్నాముకాని మావారు చిన్న పాపని ఇంటి దగ్గరలో ఉన్న ఆస్పత్రిలో చూపించి వెడదామన్నారుఅందుచేత ఆస్పత్రికి బయలుదేరాము. అప్పుడు చిన్న చిన్న చినుకులు మాత్రమే పడుతున్నాయి. ఆస్పత్రిలో టోకెన్  సిస్టమ్ ఉందిఅప్పటికే టోకెన్ లు అన్నీ ఇచ్చేశారుమాదే ఆఖరి టోకెన్ఇక ఆస్పత్రిలోనే ఆలశ్యమయేలా ఉంది గుడికి వెళ్ళలేము అనుకుంటున్నానుఆశ్చర్యంగా అక్కడ టొకెన్స్ ఇచ్చే అమ్మాయి నన్ను చూసి లోపల వేరేవాళ్ళు ఉన్నారు వారు వెళ్ళిన తరువాత మీరు వెళ్ళండని వెంటనే నన్ను పంపిందిఅప్పటికి సాయంత్రం నాలుగయిందిమా ఇంటినుండి మైలాపూర్ గుడికి వెళ్ళాలంటే ఎటువంటి ట్రాఫిక్ లేకుండా, సిగ్నల్స్ వద్ద ఆలశ్యం లేకపోతే బండి మీద వెడితే గంట పడుతుందిఆయితే రోజు మాకోసమే అన్నట్లుగా ఆస్పత్రినుండి బయటకు వచ్చేటప్పటికి వర్షం ఆగిపోయింది.చాలా సంతోషంగా గుడికి బయలుదేరాముఎక్కడా సిగ్నల్స్ దగ్గిర కూడా బండి ఆగలేదుమేము సిగ్నల్స్  దగ్గరకు వచ్చేటప్పటి గ్రీన్ సిగ్నలే ఉండి మేము సమయానికి గుడికి చేరుకున్నాము.  
                                     Image result for images of mylapore baba temple

చేరగానే మా మామయ్యగారు ఇంటినుండి ఫోన్ చేశారు. “వర్షంలో తడిశారాఅనిఎందుకంటే మేము ఇంటి వద్ద నుండి బయలుదేరిన పది నిమిషాలలోనే  పెద్ద వర్షం పడిందటబాబాగారు మా కోసమే ఆస్పత్రిలో ఆలశ్యమవకుండా చేసి తొందరగా పంపించారుమేము వర్షంలో తడవకుండా రక్షించారుఇంటికి తిరిగి వచ్చిన రెండు నిమిషాలకు మళ్ళీ పెద్ద వానమా పెద్ద పాప పుట్టినరోజునాడు బాబావారి ఆశీర్వాదం ఎటువంటి ఆటంకం లేకుండా పొందగలగటం మా అదృష్టందీని ద్వారా ఆయనకు పంచభూతాలపై ఆధికారం ఉందని మరొకసారి ఋజువయింది.

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)





Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List