Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Wednesday, April 13, 2016

శ్రీసాయి పుష్పగిరి – జీవితం – 2వ.భాగమ్

Posted by tyagaraju on 5:12 AM
Image result for images of saibanisa
       Image result for images of rose garden

13.04.2016  బుధవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావాఅరి శుభాశీస్సులు
ఈ రోజు సాయిబానిస గారికి బాబావారు ప్రసాదించిన జీవిత సందేశాలనుండి కొన్ని సందేశాలు తెలుసుకుందాము.
         Image result for images of saibanisa

శ్రీసాయి పుష్పగిరి – జీవితం – 2వ.భాగమ్


31.07.2001

11) మన ఇంటిలో ఈగల బాధ ఉన్నట్లే, అదే విధంగా  ప్రాపంచిక జీవితంలోను, ఆధ్యాత్మిక జీవితంలోను అసూయాపరుల నుండి బాధలు ఉంటాయిఅవి క్షణికమయినవిఆ బాధలను మనం ఓరిమితో భరిస్తూ జీవిత పాఠాలు నేర్చుకోవాలి.



31.08.2001
                         Image result for images of mother with child


12) తన పిల్లల పోషణ కొరకు కన్నతల్లి ఎన్ని కష్టాలు పడుతుంది అన్నది మీరు కళ్ళారా చూశారుమరి నేను నా పిల్లల పోషణ కొరకు ఎన్ని కష్టాలు పడుతున్నాను అన్నది భగవంతుడు మాత్రమే చూడగలడు.
               Image result for images of shirdi sai with child


12.10.2001
                          Image result for images of elephant killing lion

13) తన ప్రాణ రక్షణ అనేది ప్రతి జీవికి భగవంతుడిచ్చిన వరంతన ప్రాణ రక్షణ కోసం ఎదుటి జీవిని చంపడం పాపం కాదు.

16.10.2001

14).  లాటరీలో బహుమతి అందరికీ రాదుఏనాడో ఒకనాడు బహుమతి వస్తుంది అనే ఆశతో జీవించాలిఆశ మనిషి బ్రతకడానికి కావలసిన శక్తినిస్తుందిఆశక్తితోనే ఎన్ని చికాకులు వచ్చినా వాటిని జయించగలము.



15)  మధ్యతగతి కుటుంబంలో అసంతృప్తి కలగటం సహజము అసంతృప్తిని దూరం చేసుకోవటానికే సాయి కధలు చదవాలి, వినాలి.
                           Image result for images of shirdi sai with child


16)  ఈనాటి కష్టము రేపటి రోజున సుఖానికి మొదటి మెట్టు, అని గ్రహించి నిజ జీవితంలో పయనించు.

17)  జీవితంలో భగవంతునిపై శ్రధ్ధ మరియు వారి అనుగ్రహం కోసం సబూరి కలిగి ఉండమని నేను అనేకసార్లు చెప్పానుకాని నేటి మానవులు భగవంతునిపై శ్రధ్ధను చూపుతూ వాని అనుగ్రహం పొందటంలో సబూరీని (ఓరిమి) మరచి జీవితాన్ని నాశనము చేసుకుంటున్నారుమరి దీనికి బాధ్యులు ఎవరు అని ఆలోచించుకోవాలి.
                       Image result for images of shirdi sai with child


31.10.2001

18)  నీ గత జీవిత అనుభవాలు, జ్ఞాపకాలు, నేటి నీ జీవిత ప్రయాణానికి ఆఖరి మైలురాయి మరియు నీ నూతన జీవిత ప్రారంభానికి మొదటి మైలు రాయి అని గుర్తించి జీవించు.

19)  నీ తోటి మానవులలో కొందరిని నీవు అంటరానివాడని భావించి వారిని అన్ని రంగాలలోను దూరంగా ఉంచుతున్నావే, మరి నీప్రాణ రక్షణకోసము నీవు వారి రక్తాన్ని దానంగా స్వీకరించుతున్నపుడు వారిని నీవు అంటరానివారు అని అనడంలో అర్ధం లేదు.
          Image result for images of blood donating


22.10.2001

              Image result for images of plucking fruits from tree

20) ఒక చెట్టుకాయను పరిపక్వము కానీయకుండానే నీవు కోసుకొని తింటున్నావేఅపుడా చెట్టు నిన్ను దూషించలేదేభగవంతుడు అల్పాయుష్షుతో జన్మించిన నీబిడ్డను తీసుకుంటే నీవు ఆభగవంతుని దూషించవచ్చునా ఒక్కసారి ఆలోచించు

(మరికొన్ని సందేశాలు తరువాతి సంచికలో)

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List