22.05.2016 ఆదివారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబానిసగారికి
బాబా వారు ప్రసాదించిన ఆధ్యాత్మిక సందేశాలు మరికొన్ని ఈ రోజు మీకోసం.
శ్రీ
సాయి పుష్పగిరి – ఆధ్యాత్మిక జీవితం – 11వ.భాగమ్
సంకలనం : ఆత్రేయపురపు త్యాగరాజు
101. నీ
కుటుంబ సభ్యులతో కలిసి సంసార జీవితము
కొనసాగిస్తున్నపుడు అందరూ కలిసిమెలిసి నీతో
తిరుగుతారు. అదే
నీకు కష్టాలు ఎదురయినపుడు ఎవరిమానాన వారు వెళ్ళిపోతారు.
కాని నీ భార్య మాత్రము
నిన్ను కష్టాలనుండి దూరము చేయడానికి శాయశక్తులా
ప్రయత్నిస్తుంది.
అందుచేత
కష్టసుఖాలు భార్యాభర్తలు కలిసి పంచుకోవాలి.
12.09.2007
102. జీవితంలో
ఆఖరి దశలో ధనసంపాదన, కీర్తి సంపాదనల కోసము శ్రమించడం వ్యర్ధము. అంతిమ
కాలములో
ఉన్నదానితో ప్రశాంతముగా
జీవిస్తూ మన జీవిత గమ్యాన్ని
చేరడం ఉత్తమము.
103. ఇతరులతో
కలిసి మనకు తెలియని పనులలో
తల దూర్చిన చికాకులు వచ్చినపుడు అవతలివాడు సులువుగా బయటపడతాడు.
మనము ప్రమాదములో ఇరుక్కుని మనశ్శాంతిని పోగొట్టుకుంటాము. అందుచేత మనకు తెలియని విషయాలు సంబంధము లేని విషయాలలో తలదూర్చరాదు.
మనము ప్రమాదములో ఇరుక్కుని మనశ్శాంతిని పోగొట్టుకుంటాము. అందుచేత మనకు తెలియని విషయాలు సంబంధము లేని విషయాలలో తలదూర్చరాదు.
104. రఘురాముడంతటివానికే చేయని తప్పుకు పదునాలుగు సంవత్సరాల వనవాసము శిక్ష అనుభవించవలసివచ్చిందే, అందుకోసము విధి బలీయమైనది. దానిని ఎవ్వరూ తప్పించలేరు అని చెప్పక తప్పదు.
105. కాకులలో ఐకమత్యం చూడు. మానవులలో ఐకమత్యం లేదు. అందుచేత ఇతరులతో గొడవలు పడకుండా జీవించడం అలవాటు చేసుకో.
05.02.2008
106. దుర్వ్యసనాలు అనేవి ఇసుక గుట్టవంటిది. దాని మీదకి మానవుడు ఎక్కితే ఆ ఇసుకలో కూరుకుపోతాడు. అందుచేత మానవుడు దుర్వ్యసనాలకి దూరంగా ఉండాలి.
12.02.2008
107. జీవితంలో
వృధ్ధాప్యము ఒక వరము. వృధ్ధాప్యంలో,
నీ రక్త సంబంధీకులపై మమకారము
పెంచుకునేకన్నా ఆ భగవంతునిపై మనసు
లగ్నం చేయడం మిన్న.
22.03.2008
108. ఈ
రోజుల్లో స్నేహం తమ అవసరాలు తీర్చుకొనడానికి
మానవులు కల్పించుకున్న బంధం అదే స్నేహబంధం. నిజానికి
నీకు నీవే ఒక మంచి
స్నేహితుడివని గ్రహించిననాడు నీ జీవితం ప్రశాంతంగా
సాగిపోతుంది.
18.04.2008
109. నీ ప్రక్కింటివాడు కష్టంలో ఉన్నపుడు అతడు పిలవకపోయినా అతనికి సహాయం చేయటానికి వెళ్ళాలి. అదే అతను సంతోషంలో ఉన్నపుడు అతను పిలవకపోతే అతని ఇంటికి వెళ్ళరాదు.
03.05.2008
110. జీవితంలో
స్వశక్తిమీద నమ్మకము విశ్వాసము ఎదుటివాని నుండి ఏమీ ఆశించకుండా
ఉండే విధానాలతో జీవిత యాత్రను కొనసాగించిన
వాని జీవితము ధన్యము.
(మరికొన్ని సందేశాలు తరువాతి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment