Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Monday, May 23, 2016

శ్రీ సాయి పుష్పగిరి – ఆధ్యాత్మిక జీవితం – 12వ.భాగమ్

Posted by tyagaraju on 9:02 AM
Image result for images of shirdisaibaba shirdi temple.
      Image result for images of rose garden in ooty

23.05.2016 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయి పుష్పగిరి – ఆధ్యాత్మిక జీవితం – 12వ.భాగమ్
Image result for images of saibanisa

సాయిబానిసగారికి బాబా వారు ప్రసాదించిన ఆధ్యాత్మిక సందేశాలు మరికొన్ని…

08.05.2008
              Image result for images of old man in depression

111.  వృధ్ధాప్యంలో కూడా కొందరు కోరికలకు బానిసలుగా మారి, తమ కోర్కెలను తీర్చుకునే మార్గము లేక మానసికంగా బాధలు పడుతున్నారు కోరికలను జయించటానికి వారు ఏకాంత జీవితము గడుపుతూ భగవంతునికి చేరువ కావాలి.
                       Image result for images of old man doing puja room



08.05.2008

112.  ఇంటి అల్లునికి మర్యాదలు చేయటము రెండు కుటుబాల మధ్య తమలో తాము గౌరవించుకోవటము మర్యాదలు చిన్న చిన్న కోరికలు కావచ్చునుప్రేమాదరణములు వ్యక్త పరచడం కూడా కావచ్చును మర్యాదలు పాటించిన ఇరు కుటుంబాలు సంతోషంగా జీవించగలరు

14.05.2008

Image result for images of grass in water

113.  ఈ భూమిమీద పెరుగుతున్న రెల్లు గడ్డిని, నీటిలో పెరుగుతున్న తుంగ గడ్డిని సృష్టించింది భగవంతుడే గడ్డి నీకు జీవనోపాధిని కలిగించి నిన్ను ఆదుకుంటున్నది.  
             Image result for images of man selling grass
అందుచేత నీవు సదా భగవంతునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ జీవించు.

114.  నీకు అన్యాయము, అవమానము చేసిన వ్యక్తులు స్వార్ధంతో నీ దగ్గరకు వచ్చి, క్షమాపణ కోరినా, ఒక చిరునవ్వుతో వారి తప్పును వారు తెలుసుకునేలాగ చేసి వారిని గౌరవంతో పంపివేయిఅంతేగాని కౌగలించుకుని మళ్ళీ తల నెప్పులు తెచ్చుకోవద్దు.  

14.05.2008

115.  నీ జీవిత ప్రయాణంలో నీలో మంటలు రగిలించినవారి నుండి సహాయమును కోరవద్దు మంటలను నీవే ఆర్పుకుని జీవిత ప్రయాణాన్ని ముందుకు కొనసాగించు.
 Image result for images of brothers in love
116.  అన్నదమ్ములు చిన్నతనంలో ప్రేమను పంచుకుంటారుపెద్దయిన తరువాత ఆస్తులను పంచుకొని అసూయాద్వేషాలతో దూరమవుతారుఒకసారి దూరమయిన తరువాత తిరిగి దగ్గరవటం వారికి సాధ్యము కాదు.
                Image result for images of brothers quarreling

30.05.2008

117.  బంధుత్వాల పేరిట బలవంతంగా వివాహాలు చేయరాదువధూవరులిద్దరి అంగీకారంతోనే వివాహం జరిపించిన వారు సుఖశాంతులతో జీవిస్తారు

  
03.06.2008

118.  జీవితం అనే నదికి వరద వచ్చినపుడు అహంకారంతో ఉన్నవారు నదీ ప్రవాహంలో కొట్టుకొనిపోతారువారిని ఎవరూ రక్షించలేరుఅమాయకులను భగవంతుడు ఏదో ఒక రూపములో వచ్చి రక్షిస్తాడని నేను నమ్ముతున్నాను.

02.07.2008

119.  నీవు మంచివాడివేకాని ఎదుటివానిలో మంచితనము పరిపక్వత రానంత కాలము నీవు వానినుండి దూరంగా జీవించటమే మేలు.

15.07.2008

120.  గత జీవితము, అందలి స్నేహాలు జీవించిన పధ్ధతులు నేటి వర్తమానానికి పనికిరావుఅందుచేత గతములోనికి తొంగి చూడకుండా వర్తమానంపై నమ్మకంతో మంచి భవిష్యత్తుకోసం ఎదురు చూస్తూ ప్రశాంతంగా జీవించాలి
(మరికొన్ని సందేశాలు తరువాతి సంచికలో)

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List