Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Wednesday, May 4, 2016

శ్రీ కేశవ భగవాన్ గావన్ కర్ - 4వ.భాగమ్

Posted by tyagaraju on 7:03 AM
  Image result for images of shirdi sai baba appearing in dream
     Image result for images of white rose hd

04.05.2016 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు శ్రీ కేశవ్ భగవాన్ గావన్ కర్ గారి గురించి మరికొంత అద్భుతమైన సమాచారమ్ 

Image result for images of keshav bhagavan gawankar

శ్రీ కేశవ భగవాన్ గావన్ కర్ - 4వ.భాగమ్

కుర్లాలో ఉన్న వారి ఇంటిలో ఆయన ఆయన కుటుంబ సభ్యులందరూ రామనవమి, విజయదశమి ఉత్సవాలను జరుపుకోవడం ప్రారంభించారు.  ఈ రెండు ఉత్సవాలకి ఆయన అన్నదానం చేసేవారు.  1939 వ.సంవత్సరంలో ఆయనకి ఒక కల వచ్చింది.  ఆ కలలో బాబా దర్శనమిచ్చి, “భిక్షేచ భక్రి లేగోడె” (భిక్ష ద్వారా లభించిన భక్రి చాలా మధురంగా ఉంది) అన్నారు.  



గావన్ కర్ భిక్ష ద్వారా జొన్నలు సంపాదించదలచుకొన్నారు.   ఈ సంఘటన ఆయన బొంబాయిలో సునీల్ మాన్షన్ లో ఉన్నపుడు జరిగింది.  అతనికి  ఏడు రాశులు (50 కేజీలు ) జొన్నలు లభించాయి.  వాటినుండి ఝుంకా భకార్ తయారు చేశారు.  (భక్రి -- రొన్న రొట్టె    ఝుంకా – తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, శనగపిండితో చేయబడే చట్నీ)

(ఝుంకా భకార్ ఎట్లా తయారు చేయాలో లింక్ ఇస్తున్నాను చూడండి.)
https://www.youtube.com/watch?v=F0HZXpjeaN0
మరొక లింక్
https://www.youtube.com/watch?v=Pz8-DCxy4VI


సుమారు 200 – ౩౦౦ మంది దాకా కడుపునిండా భుజించారు.  అన్న దానం ప్రారంభించే ముందు బాబాకు నైవేద్యంగా 11 ఝుంకా భక్రీలు సమర్పించారు. నైవేద్యంగా పెట్టిన వాటిలో ఒక భక్రీని (రొట్టె) బాబా ఫొటో వద్దనే ఉంచేశారు.  మిగిలిన వాటిని చిన్న చిన్న ముక్కలు చేసి అందరికీ ప్రసాదంగా పంచిపెట్టారు.  విచిత్రాలలో కన్న విచిత్రం ఏమిటంటే బాబా ఫొటో ముందు ఉంచిన భక్రీ (రొట్టి) 35 సంవత్సరాలు గడిచినా కూడా పాడవలేదు. రుచి కోల్పోలేదు. ఫంగస్ కూడా పట్టలేదు.  ఆఖరికి చీమలు కూడా పట్టలేదు. ఆతరువాత కొంత కాలానికి భక్తులు దానిని ‘సాయి ప్రసాదం’ గా తమ ఇళ్ళకు తీసుకుని వెళ్ళారు.  అందు చేతనే డా.సాయినాధ్ గావన్ కర్ గారి ఇంటిలో ఇప్పుడది లేదు.

బాబా నూలు బట్టతో కుట్టించుకున్న కఫనీ వంద సంవత్సరాల పైగా అవడం వల్ల ఇప్పుడది రంగు వెలిసిపోయి లేత పసుపు రంగులోకి మారిపోయింది.  1993 వరకు దానిని జాగ్రత్తగా మడత పెట్టి ఒక చెక్క పెట్టెలో భద్రంగా ఉంచారు.  ఆ తరువాత డా.కేశవ్ భగవాన్ గావన్ కర్ గారి కుమారుడు డా.సాయినాధ్ గావన్ కర్ ఆ కఫనీని బయటకు తీసి ఒక అద్దాల బీరువాలో హాంగర్ కి తగిలించాడు.  
            Image result for images of keshav bhagavan gawankar
ఆ పవిత్రమయిన కఫనీని ప్రతిరోజు వచ్చే సాయి భక్తులు దర్శనం చేసుకోవడానికి వీలుగా ఉండటానికి ఆ విధంగా చేశాడు.  దసరా రోజున మాత్రం డా.సాయినాధ్ గావన్ కర్ గారు కఫనీని బయటకు తీసి రెండు గంటల పాటు దానిని మృదువుగా చాలా జాగ్రత్తగా శుభ్రం చేస్తూ ఉండేవారు.  సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ కఫనీ చీకి పోయినట్లుగా అయింది.  అందువల్ల కుటుంబంలోని వారంతా ఎవ్వరినీ కఫనీని ముట్టుకోవడానికి ఒప్పుకునేవారు కాదు.  తన తండ్రికి బాబాగారు బహూకరించి ఇచ్చారని తెలిసిన చాలా కొద్ది మంది సుమారు  రెండు వందల మంది భక్తులు మాత్రం ప్రతి సంవత్సరం ఈ కఫనీని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారని డా.సాయినాధ్ గావన్ కర్ గారు చెప్పారు.

డా.గావన్ కర్ గారి కుటుంబం వారంతా ఎంతో అదృష్టవంతులనే చెప్పాలి. బాబా 15.10.1918 లో మహాసమాధి చెందిన 36 సంవత్సరాల తరువాత 18.01.1954 లో వారి పూర్వీకుల గృహం ‘ఇందిరా నివాస్’ లో వారికి శ్రీసాయిబాబా దర్శనమిచ్చారు.

“నాకు అప్పుడు 5  సంవత్సరాలు.  షిరిడీ సాయిబాబా వారు ఇక్కడ కూర్చున్న దృశ్యం మా కుటుంబంలోని వారందరికి ఇంకా స్పష్టంగా గుర్తుంది.  ఆయన, మా నాన్నగారు ఇద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నారు.  మా ఇంటి వరండాలో రాత్రి 10.30 నుంచి మరునాడు ఉదయం 8.30 వరకూ వారిద్దరూ కూర్చుని ఉండగా చూశాను”. 59 సంవత్సరాల తరువాత వారు సరిగ్గా ఎక్కడయితే కూర్చున్నారో ఆ ప్రదేశాన్ని  చూపిస్తూ డా.సాయినాధ్ గావన్ కర్ గారు ఈ విషయం చెప్పారు.

(ఇంకా ఉంది)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు) 


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List