03.05.2016 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకి బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు కేశవ్ గావన్ కర్ గారి గురించి మరికొంత సమాచారం తెలుసుకుందాము.
కేశవ్ భగవాన్ గావన్ కర్ - 3 వ.భాగం
బాబా
కేశవ్ కళ్ళలోకి చూస్తూ రెండు పైసలు దక్షిణ అడిగారు. కేశవ్ ప్రక్కనే ఉన్న శ్యామా అతని చేతిని పట్టుకుని
బాబా వైపు చాపించారు. శ్యామా చేసిన చేష్ట కేశవ్,
బాబా కి దక్షిణ సమర్పిస్తున్నట్లుగా ఉంది.బాబా కూడా కేశవ్ ఇస్తున్న దక్షిణను స్వీకరిస్తున్నట్లుగా
తన కుడిచేతిని ముందుకు చాపారు. శ్యామా కేశవ్
తో ‘దియా ‘ (సమర్పించానని) అని చెప్పు అన్నాడు.
బాబా దక్షిణను స్వీకరించినట్లుగా నటించి ‘లియా’ (తీసుకున్నాను) అన్నారు. అలా అంటూ దక్షిణను తన కఫనీ జేబులో దాచుకున్నట్లుగా
నటిస్తూ చేతిని కఫనీ జేబులో ఉంచుకున్నారు.
వెంటనే ఎంతో వేగంగా తన కఫనీని తీసి కేశవ్ మీద కప్పారు. ఇది జరుగుతున్నంత సేపు కేశవ్ ఎంతో తన్మయత్వంలో ఉన్నాడు. అతని శరీరంలో ప్రకంపనలు ఇంకా కలుగుతూనే ఉన్నాయి.
వెంటనే ఎంతో వేగంగా తన కఫనీని తీసి కేశవ్ మీద కప్పారు. ఇది జరుగుతున్నంత సేపు కేశవ్ ఎంతో తన్మయత్వంలో ఉన్నాడు. అతని శరీరంలో ప్రకంపనలు ఇంకా కలుగుతూనే ఉన్నాయి.
అక్కడ
ఉన్న ప్రతివారు బాబా మహాప్రసాదంగా ఇచ్చిన కఫని ధరించడానికి కేశవ్ చాలా చిన్నవాడని భావించారు.
శ్యామా కేశవ్ తరఫున మధ్యలో కల్పించుకుని “దేవా, కేశవ్ కి ఇచ్చిన ఈ కఫనీని నా దగ్గిర
భద్రపరుస్తాను. అతను పెద్దవాడయిన తరువాత అతనికి
ఇస్తాను” అన్నాడు. ఆ తరువాత కేశవ్ కి బాబా
ఇచ్చిన కఫనీని తన వద్ద ఉంచుకుని అతను పెద్దవాడయిన తరువాత ఇచ్చాడు. ఆ తరువాత అతని వారసులు
ఆ కఫనీని జాగ్రత్తగా భద్రపరిచారు.
షిరిడీ
వెళ్ళిన మొట్టమొదటి రోజునే కేశవ్ బాబా దర్శనానికి వెళ్ళాడు. బాబా ఒక అరటి పండు తొక్క వలిచి, ఒక చిన్న పిల్లవానికి
తినిపించినట్లుగా కేశవ్ కి తినిపించారు.
అయిదవ
రోజు సూర్యోదయానికి ముందే కేశవ్ బాబా దర్శనానికి వెళ్ళాడు. అప్పుడు బాబా ధుని ముందు కూర్చుని ఉన్నారు. భాగోజీ షిండే బాబా చేతికి ఉన్న కట్లు విప్పుతున్నాడు. కేశవ్ అక్కడికి వచ్చి నుంచుని ఉండటం చూసి, వెంటనె
తన వద్దకు రమ్మని పిలిచి తన ముందు కూర్చోమన్నారు.
కేశవ్ కూర్చున్న వెంటనే అతని చెంప మీద లాగి కొట్టారు. ఆయన ఎంత గట్టిగా కొట్టారంటే ఆ వేగానికి కేశవ్ నెత్తి
మీద ఉన్న టోపీ ఎగిరి పడింది.
ఏడవ
రోజున కేశవ్ తో సహా కుటుంబమంతా తిరుగు ప్రయాణానికి అనుమతి కోసం బాబా దగ్గరకు వెళ్ళారు. అందరూ బాబాకి నమస్కారం చేసుకున్నారు. కేశవ్ కూడా బాబా కి నమస్కారం చేశాడు. బాబా అతని చేయి పట్టుకుని ముందుకు లాగి కూర్చోబెట్టారు. అప్పుడు బాబా అతని మొహం మీద చాలా గట్టిగా ఒక్క చరుపు
చరిచారు. చరిచిన తరువాత గుప్పిటనిండా ఊదీని
ఇచ్చి ‘ఇక వెళ్ళు, అల్లా భలా కరేగా (దేవుడు నీకు మేలు చేస్తాడు)” అన్నారు. ఆ విధంగా బాబావారి దీవెనలు అందుకుని అందరూ ఇంటికి
తిరిగి వచ్చారు.
1938
వ.సంవత్సరంలో గావన్ కర్ గారికి ఒక కల వచ్చింది.
ఆ కలలో బాబా దర్శనమిచ్చి బాలా (అబ్బాయీ) నానుంచి నీకేమి సహాయం కావాలి? ఇక నుంచి
రామనవమి ఉత్సవాలకి నాకు ఒక ఉయ్యాల కట్టు” అని అడిగారు. ఆ విధంగా హిందూ కాలండర్ ప్రకారం మొట్టమొదటి రామనవమి
ఉత్సవాలు చైత్ర శుధ్ధ పాడ్యమిలో ప్రారంభమయ్యాయి.
డాక్టర్
గారు చక్కటి అందమయిన ఉయ్యాలను తయారు చేయించారు.
అంత అందమయిన ఉయ్యాలకి సమానంగా సుందరమయిన రాములవారి విగ్రహం సంపాదించాలి. స్నేహితులు, బంధువులు అందరూ కలిసి రెండు నెలలపాటు
పెద్ద స్థాయినుంచి, చిన్న స్థాయి వరకు అన్ని విగ్రహాలకోసం ఎంతో వెతికారు. కాని ఆ ఉయ్యాలకి తగిన విగ్రహం మాత్రం దొరకలేదు. ఇంక ఆఖరికి చేసేదేమీ లేక రాములవారి చిత్ర పటాన్ని
ఉయ్యాలలో పెడదామని నిర్ణయించారు. చిత్ర పటాన్ని
తీసుకుని వచ్చారు. రామనవమి ఉత్సవాలు ప్రారంభమయాయి. కాని గావన్ కర్ గారికి మాత్రం తృప్తిగా లేదు.
ఆయన
బాబా ఫొటొ ముందు కూర్చుని “దేవా! నువ్వు కోరినట్లుగానే రామనవమి ఉత్సవాన్ని ప్రారంభించాను. కాని, ఉయ్యాలలో పెట్టడానికి తగిన రామ విగ్రహం మాత్రం
లభించలేదు. అందమయిన ఉయ్యాలలో పెట్టడానికి తగిన
అందమయిన రామ విగ్రహం దొరికేంత వరకు నేను ఎటువంటి ఆహారాన్ని తీసుకోను” అని కన్నీళ్ళతో
ప్రార్ధించాడు. అప్పటినుండి మంచినీరు మాత్రమే
తీసుకుంటూ, తన రోజువారీ కార్యక్రమాలను ఎప్పటిలాగానే నిర్వహించుకుంటూ ఉన్నాడు.
ఆ
సంవత్సరం రామనవమి శనివారం వచ్చింది. ఆ రోజు గురువారం. అప్పటికీ విగ్రహం లభ్యం కాలేదు. ఇక రెండు రోజులే ఉంది రామనవమికి. యధాప్రకారంగా ఆయన తన క్లినిక్ కి వెళ్ళారు. పేషెంట్లు చాలా మంది వచ్చారు. అందరూ తమ తమ వంతుల ప్రకారం ఒక వరుసలో కూర్చుని ఉన్నారు. వారిలో ఒక క్రొత్త పేషెంటు కనపడ్డాడు. అతనిని ఇంతకు ముందు ఎప్పుడూ ఆయన చూడలేదు. డా.గావన్
కర్ అతని దగ్గరకు వెళ్ళి అతని ఆరోగ్యం గురించి అడిగాడు. “నా వంతు వచ్చేవరకు నేను వేచి ఉంటాను. అప్పుడు మిమ్మల్ని కలుసుకుంటాను” అని సమాధానమిచ్చాడు.
అతని
వంతు రాగానే డాక్టర్ గారి ముందుకు వచ్చి నిలుచున్నాడు. అతను చొక్కా మీద కోటు ధరించి ఉన్నాడు. తలకు పాతకాలపు తలపాగా, కాళ్ళకు పాతకాలపు బూట్లు
ధరించాడు. అతను చూడటానికి యశ్వంతదేశ్ పాండేకి
సహాయం చేసిన మనిషిలాగ దుస్తులు ధరించి ఉన్నాడు.
అతను గావన్ కర్ దగ్గిరకి వచ్చి చేతిలో ఒక పాకెట్ పెట్టి “ఇక వెళ్ళి వస్తానని”
చెప్పి వెళ్ళిపోయాడు.
ఏం
జరుగుతోందో ఒక్క క్షణం గావన్ కర్ కి అర్ధం కాలేదు. తన చేతిలో ఉన్న పాకెట్ ని విప్పి చూశాడు. ఆశ్చర్యంతో అతని కళు పెద్దవయ్యాయి. అది అందమయిన రాములవారి విగ్రహం.
అంత సుందరమయిన విగ్రహాన్ని చూసి ఎంతో ఆనందపడ్డాడు. ఆ వెంటనే ‘దేవా, నువ్వు వచ్చినా నిన్ను గుర్తించలేకపోయానే’
అని పశ్చాత్తాపంతో ఎంతో బాధతో విలపించాడు.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment