02.05.2016 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
కేశవ్ భగవాన్ గావన్ కర్ - 2వ.భాగమ్
ఈ రోజు శ్రీ కేశవ భగవాన్ గావన్ కర్ గారి గురించి మరికొంత సమాచారం తెలుసుకుందాము.
నిన్నటిరోజున వర్షం వల్ల కరెంటు లేకపోవడం వల్ల ప్రచురింపలేకపోయాను. ఈ రోజు రెండవ భాగం చదవండి.
(మొన్నటి సంచిక తరువాయి భాగం)
విఠల్
కాకా, తమ్మాబాయి ఇద్దరూ కేశవ్ మంచం ప్రక్కన
కూర్చుంటూ ఉండేవారు. రోజూలాగే
ఆ రోజు కూడా అతని
ప్రక్కన కూర్చున్నారు. అప్పుడు
సమయం అర్ధరాత్రి దాటింది. తమ్మాబాయి
నిద్రవల్ల జోగుతూ ఉంది. ఆమెకు
చాలా స్పష్టంగా ఒక కల వచ్చింది. కలలో
బాబా ఆమె ఇంటికి వచ్చి
కొబ్బరికాయనిమ్మన్నారు.
తమ్మాబాయి బాబా ఫోటోముందు కొబ్బరికాయనుంచి కేశవరావు వ్యాధిని నివారణ చేయమని ప్రార్ధించింది.
అదే రోజు రాత్రి బాబా ఆమెకు కలలో దర్శనమిచ్చారు. ఆ తరువాత బాబా పిల్లవాని వద్దకు వెళ్ళి అతని మీద తన పవిత్రమయిన హస్తాన్ని ఉంచి తల దగ్గరనుండి పాదాల వరకు స్పృశించారు. “అల్లా భలా కరేగా” అని అతనిని దీవించారు. మరుక్షణంలో ఆయన అదృశ్యమయ్యారు. కల ముగిసింది.
తమ్మాబాయి బాబా ఫోటోముందు కొబ్బరికాయనుంచి కేశవరావు వ్యాధిని నివారణ చేయమని ప్రార్ధించింది.
అదే రోజు రాత్రి బాబా ఆమెకు కలలో దర్శనమిచ్చారు. ఆ తరువాత బాబా పిల్లవాని వద్దకు వెళ్ళి అతని మీద తన పవిత్రమయిన హస్తాన్ని ఉంచి తల దగ్గరనుండి పాదాల వరకు స్పృశించారు. “అల్లా భలా కరేగా” అని అతనిని దీవించారు. మరుక్షణంలో ఆయన అదృశ్యమయ్యారు. కల ముగిసింది.
కల
చెదిరిపోగానే తమ్మాబాయికి మెలకువ వచ్చింది. కేశవ్
మీద చెయ్యి వేసి పరీక్షించింది.
వళ్ళు చల్లగా తగిలింది. ఒక్కసారిగా
ఉలిక్కిపడి పెద్దగా రోదించసాగింది. కేశవ్
చనిపోయాడనుకుంది. ఇంట్లోనివారంతా
ఉలిక్కిపడి లేచి పరుగెత్తుకుని వచ్చారు. ఏంజరిగిందోనని
అందరూ చాలా ఆందోళన చెందుతూ
ఉన్నారు. మేడ మీద
నిద్రపోతున్న డా.గాల్వంకర్ గారు
కూడా క్రిందకి దిగి వచ్చారు. కేశవ్ నాడి పట్టుకుని
పరీక్షించారు. నాడి
బాగా కొట్టుకొంటోంది. జ్వరం
కూడా తగ్గిపోయింది. హాయిగా
ఊపిరి పీల్చుకుని శాంతం వహించారు.
ఏమీ ఫరవాలేదు అంతా బాగానే ఉంది
అని చెప్పడంతో అందరూ ఎవరి స్థానాల్లోకి
వారు వెళ్ళి నిద్రకుపక్రమించారు.ఉదయాన్నే డా.గాల్వంకర్ వచ్చి
కేశవ్ ని పరీక్షించారు.
కేశవ్ చొక్కా తడిసిపోయి చాతీకి గట్టిగా అంటుకునిపోయి ఉంది. చొక్కాని
నెమ్మదిగా కత్తిరించారు. కేశవ్
కుడి కుచాగ్రం క్రిందుగా చిన్న కన్నం కనిపించింది. దానిలో
నుండి రసి కారుతూ ఉంది. గాల్వంకర్
గారు దాని చుట్టూతా గట్టిగా నొక్కారు. రసితో
కూడిన రక్తం బయటకి బాగా
కారసాగింది. మొత్తమంతా
బయటకు వచ్చేశాక కేశవ్ మెల్ల మెల్లగా పూర్తిగా
కోలుకున్నాడు. త్వరలోనే
పాఠశాలకు తిరిగి వెళ్ళసాగాడు.
క్రమక్రమంగా
కేశవ్ పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యాడు. మిగతా
పిల్లలందరిలాగే పాఠశాలకు వెడుతూ తోటి పిల్లలతో కలిసి
ఆడుకుంటూ ఉండేవాడు. కష్టాలు
వచ్చినపుడు మానవులు మొక్కులు మొక్కుకోవడం సాధారణమైన విషయం. కాని
మొక్కుకున్న మొక్కులను వెంటనే తీర్చడం ఎప్పుడూ సాధ్యం కాదు. దానికి
కారణం మర్చిపోవడమయినా కావచ్చు లేక పరిస్థితుల ప్రాబల్యం
వల్ల ఒక్కసారిగా వెంటనే తీర్చడం సాధ్యపడకపోవచ్చు. విఠల్
కాకా విషయంలో కూడా సరిగ్గ ఇదే
జరిగింది.
అయిదు
సంవత్సరాల తరువాత 1918 జవరిలో ఎట్టకేలకు షిరిడి యాత్రకు బయలుదేరారు. కేశవ్
కూడా తన చిన్న మేనమామ
రామచంద్ర పంత్, మేనత్త తమ్మాబాయిలతో
మొక్కు తేర్చుకోవడానికి వెళ్ళాడు. కేశవ్
అప్పుడు ప్రాధమిక పాఠశాలలో 5వ.తరగతి చదువుతున్నాడు.
సాయిబాబాను
దర్శించుకోవడానికి అందరూ ద్వారకామాయికి వెళ్ళారు. భక్తులందరూ
బాబా ముందు నిలబడి ఉన్నారు. ఆ
కారణంగా కేశవ్, అతని కుటుంబ సభ్యులందరూ
తమ వంతు కోసం నిరీక్షిస్తూ
ఒక ప్రక్కగా నిలబడి ఉన్నారు. బాబా
కేశవ్ వైపు చూసి తన
వద్దకు రమ్మన్నట్లుగా సైగ చేశారు. అప్పుడు బాబా “అరే, నా
పాలకోవా ఏదీ?” అని ప్రశ్నించారు. రామచంద్ర
పంత్ ముందుకు వెళ్ళి పాలకోవాలు ఉన్న పాకెట్ కేశవ్
కి ఇచ్చాడు.
మొక్కుకున్న
ప్రకారం పాలకోవాలు 5 శేర్లు, ఇంకా కొన్ని ఎక్కువగానే
ఆ పాకెట్ లో కలిపి తీసుకుని
వచ్చారు. బాబా
కేశవ్ చేతిలోనుంచి పాకెట్ తీసుకుని 4 పాలకోవాలు అతనికిచ్చారు. మిగిలినవన్నీ
ఒక్కసారిగా నోటిలో వేసుకుని మ్రింగేశారు. ప్రక్కనే
ఉన్న శ్యామా “దేవా! ఏమి చేస్తున్నారు
మీరు?” అని బాబాని ప్రశ్నించాడు. బాబా
వెంటనే “ఈ పిల్లవాడు నన్ను
5 సంవత్సరాలనుంచి ఆకలితో ఉంచాడు. అందుకనే
నేనంత ఆత్రంగా తినేశాను” అని సమాధానమిచ్చారు.
అయిదు సంవత్సరాల క్రితం కేశవ్ చావుబ్రతుకులల్లో ఉన్నపుడు
బాబా స్వప్నంలో కేశవ్ వ్యాధిని నివారణ
గావించారు.
వారు
సరిగా షిరిడీ ప్రయాణానికి ముందే కేశవ్ కి
ఉపనయనం జరిగింది. వెనకాల
పిలక తప్ప మొత్తమంతా గుండుతో
ఉన్నాడు. అకస్మాత్తుగా
బాబా కేశవ్ పిలక పట్టుకుని
బలంగా అతని తలను ముందుకు
గుంజి తన పాదాల వద్ద
ఉంచుకున్నారు.
బాబా
చేసిన ఆ చర్య వల్ల
కేశవ్ కి ప్రకాశవంతమయిన వెలుతురు
కన్పించింది. వెన్ను
మొదలు నుంచి చివరి వరకు ప్రకంపనలు
కలిగాయి. అదే
సమయంలో అతని శరీరమంతా వణకసాగింది. ఆవిధంగా
బాబా ఆ బాలుడిని ఆశీర్వదించారు.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment