Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, May 6, 2016

డా.కేశవ్ భగవాన్ గావన్ కర్ - 6 వ.భాగమ్

Posted by tyagaraju on 6:58 AM
      Image result for images of shirdi saibaba asking dakshina
          Image result for images of rose hd white

06.05.2016 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు డా.కేశవ్ భగవాన్ గావన్ కర్ గారి గురించి ఆఖరి భాగమ్
Image result for images of bhakri at keshav bhagavan gavankar

డా.కేశవ్ భగవాన్ గావన్ కర్ -  6 వ.భాగమ్

డా.కేశవ్ భగవాన్ గావన్ కర్ గారు 79 సంవత్సరాల వయసులో, పవిత్రమయిన ఆషాఢ శుధ్ధ ఏకాదశి, జూన్ 29, 1985 . సం.శనివారమునాడు ప్రశాంతంగా మరణించారుసాయిబాబా గారు దర్శనమిచ్చిన పవిత్ర గృహంలో ఆయన తుది శ్వాస తీసుకున్నారుఅన్నా సాహెబ్ గారు తన ఆఖరి గంటలను లెక్కించుకుంటున్నారుడా.అర్గికర్ ఎమ్.డి. ఆయనను పరీక్షించడానికి వచ్చారుఅపుడాయన వైద్యునితో ఇలా అన్నారు ,



 “డాక్టర్ (అర్గికర్) నేను సప్త లోకాలను చూడగలుగుతున్నానునా బీజ మంత్రాన్ని జపించుకోమని, పురాణాలలోని కధలను జ్ణప్తికి తెచ్చుకోమని చెబుతున్నారుసాయిబాబా నాకోసం ఒక భవంతిని నిర్మిస్తున్నారుఅది నాకు కనపడుతోంది…”సాయంత్రం ఆయన ఇలా అన్నారుచూడండి, పండరీపూర్ యాత్రీకులందరూ అక్కడ నిరీక్షిస్తూ ఉన్నారువారికి భోజన ఏర్పాట్లు చేయండిమీ దగ్గర డబ్బు లేకపోతే నా వద్దనుంచి తీసుకోండివచ్చే గురు పౌర్ణమికి చాలినంత బియ్యాన్ని నిలవ చేసి ఉంచండినా భవంతి తయారుగా ఉంది---“ విధంగా మాట్లాడుతూ అన్నా సాహెబ్ సాయిబాబా పాదాల వద్ద ఆఖరి శ్వాస తీసుకున్నారువందలాది మంది భక్తులు ఆయనను కడసారి దర్శించుకుని తమ గురువుగారికి శ్రధ్ధాంజలి ఘటించారుఅన్నా సాహెబ్ తో బాబానేనెప్పుడూ నీవెంటే ఉంటానునువ్వు జీవితాంతం వరకు ఫకీరుగానే ఉన్నా, నీ కుమారులు తమ జీవితంలో అభివృధ్ధిలోకి వస్తారుఅన్నారు.
Image result for images of keshav bhagavan gawankar
  
    Image result for images of keshav bhagavan gawankar

(1939 వ్.ంవత్సరంలో శ్రీ కేశవ్ భగవాన్ గావన్ కర్ గారు బాబా కు సమర్పించిన భకార్)
Image result for images of bhakar offered to baba in 1939

తరువాతి సంవత్సరాలలో కీ.శే. గోవింద రఘునాధ్ ధబోల్కర్ అనబడే హేమాద్ పంత్ మనుమడయిన సాయి మహాభక్త్ దేవ్ బాబా అనబడే అనంత్ ప్రభు వలవల్ కర్, డా.సాయినాధ్ కేశవ్ గావన్ కర్ గారి కుటుంబానికి షిరిడీ సాయిబాబా యే వారి ఆధ్యాత్మిక గురువని చెప్పి , మార్గంలో వారు పయనించేలా వారికి మార్గదర్శకులయ్యారు.

డా.సాయినాధ్ కేశవ్ గావన్ కర్ గారు తన పెద్దన్నగారయిన ప్రమోద్ గావన్ కర్ (డా.కేశవ్ భగవాన్ గావన్ కర్ గారి పెద్ద కుమారుడు) ఇచ్చిన సలహా ప్రకారం తన కుటుంబ సభ్యులు ఇంకా మరికొంత మంది సేవాతత్పరులయిన సాయి భక్తులతో కలిసి 1991 లోడా.అన్నా సాహెబ్ గావన్ కర్ సాయి సేవా ట్రస్ట్, ముంబాయిఅనే పేరుతో ఒక పబ్లిక్ రిజిస్టర్డ్ ట్రస్టును ఏర్పాటు చేశారు ట్రస్టు భజన సంధ్య, అన్నదానాలు, ఇంకా ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను కోజగిరి పూర్ణిమ నాడు షిరిడీలో నిర్వహిస్తూ ఉందిములంది (ఈస్ట్) ముంబాయిలో ఉన్న ట్రస్టు వ్యవహారాలన్నిటినీ మరొక అన్నగారు శ్రీ మోరేశ్వర్ గావన్ కర్ గారు పర్యవేక్షిస్తూ ఉన్నారు.  1931 వరకు కోజగిరి పూర్ణిమను కాకా మహాజని , డా.యశ్వంత్ గావన్ కర్ గారు నిర్వహిస్తూ వచ్చారు.  1931 లో కోజగిరి పూర్ణిమను నిర్వహించే బాద్యతను వారు శాశ్వతంగా, డా.కేశవ్ భగవంత్ గావన్ కర్ గారికి అప్పగించారుఅప్పటినుండి శ్రీ సాయిబాబా సంస్థాన్ వారి సహాయ సహకారాలతో ఉత్సవాన్ని గావన్ కర్ గారి కుటుంబం వారు నిర్వహిస్తున్నారు.

వారి తాత ముత్తాతల రెండతస్తుల భవనంఇందిరా నివాస్దాదాపు వంద సంవత్సరాల పూర్వ కాలం నాటిదిఇపుడది బొంబాయికి ఈశాన్యంగా ఉన్న కుర్లా శివారులో ప్రధాన రోడ్డు ప్రక్కన ఉంది. భవనం లోనే సాయిబాబా వారు వారి కుటుంబ సభ్యులందరికీ తమ దర్శన భాగ్యాన్ని కలిగించారువారి వారసత్వ సంపదైన ఇందిరా నివాస్ ను మూడు సంవత్సరాలలో తిరిగి పునర్వికాసం కలిగించే ప్రణాళికను చేపట్టారు.
చిరునామాః
నెం. 158, ఇందిరా నివాస్,
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దగ్గిర,
లాల్ బహదూర్ శాస్త్రి మార్గ్,
కుర్లా వెస్ట్, ముంబాయి – 400 070
డా.సాయినాధ్ కె. గావన్ కర్ గారి సతీమణి శ్రీమతి అస్మితా సాయినాధ్ గావన్ కర్వారికి ఒకే ఒక కుమారుడు డా.ద్యానేష్ గావన్ కర్ఆయన ముంబాయిలో జనరల్ సర్జన్ గా పని చేస్తు ముంబాయి కుర్లాలో ఉన్న తమ ఇంటిలో ప్రశాంతంగా జీవిస్తున్నారు.
               Image result for images of keshav bhagavan gawankar

డా..కేశవ్ భగవాన్ గావన్ కర్ గారి కుమారుడు డా.సాయినాధ్ గావన్ కర్ గారి చిరునామ
డా.సాయినాధ్ కేశవ్ గావన్ కర్
402, సన్నీ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ,
ఎల్.బి.ఎస్.మార్గ్, కుర్లా

ముంబాయి – 400 070
2226508830, 9819817587
dnyaneshgawankar81@gmail.com

(04.03.2013 , 28.09.2014 లలో శ్రీమతి విన్నీ చిట్లూరి గారు డా.సాయినాధ్ గావన్ కర్ గారితో జరిపిన ఇంటర్వ్యూ)

(అయిపోయింది)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు) 



Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List