Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, May 7, 2016

శ్రీసాయి పుష్పగిరి - ఆధ్యాత్మిక జీవితం – 8 వ.భాగం

Posted by tyagaraju on 8:09 AM


Image result for images of shirdi sai baba appearing in dream
     Image result for images of rose garden hd

07.05.2016 శనివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
బాబా వారు సాయిబానిస గారికి ప్రసాదించిన ఆధ్యాత్మిక జీవితం పై మరికొన్ని సందేశాలు.

Image result for images of saibanisa

శ్రీసాయి పుష్పగిరి -  ఆధ్యాత్మిక జీవితం – 8 వ.భాగం


21.10.2006

         Image result for images of shirdi saibaba in mans heart

71.  ప్రేమ అనుబంధాలు లేకుండా ఏ మనిషి నీదగ్గిరకు రాడుఅదే ఋణానుబంధము వచ్చిన వ్యక్తిని ఆదరించి వాని ఋణము తీర్చుకోలేకపోతే మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తి వాని ఋణము తీర్చుకోవలసి ఉంటుందని గ్రహించు.     



10.11.2006
                  Image result for images of shasti purti

72.  అరవై సంవత్సరములు నిండిన సందర్భంలో షష్టి పూర్తి పేరిట తిరిగి పెళ్ళి కార్యక్రమాలు చేసుకున్న దంపతులలో నీకు తెలిసినవారిలో ఎంతమంది ఇంకా జీవించి ఉన్నారో ఆలోచించురోజూ నీతో కలిసి ఆఫీసుకు వెళ్ళి నేడు పదవీ విరమణ అయినవారిలో ఎంతమంది మరణించలేదుఆలోచించుజీవించడం శాశ్వతం కాదుమరణాన్ని తప్పించుకోలేముమరి తప్పించుకోలేని దాని గురించి ఆలోచించడం మాని భగవంతుడిని స్మరించుకో.  

26.12.2006

               Image result for images of shirdi saibaba in mans heart

73.  శ్రీసాయి నీలోను నాలోను మనందరిలోను ఉన్నారుఅంటే శరీరము మనది కాదు సాయిది అని భావించుమన గురువు శరీరము మన దగ్గిర ఉన్నపుడు శరీరాన్ని చక్కగా కాపాడుకోవాలి. ఆరోగ్యంగా ఉంచుకోవాలిశరీరం ఆరోగ్యంగా ఉన్నపుడే ప్రాపంచిక రంగములోను ఆధ్యాత్మిక రంగములోను మనము ముందుకు పయనించగలము
                                                                                                                                  ---  సాయిబానిస

31.12.2006

74.  నీకు అన్యాయం జరుగుతున్న సమయంలో నీ బంధువులు తమాషా చూస్తూ నీకు ఉపకారం చేయడంపోయి నీకు మరికొన్ని చికాకులు తెచ్చిపెడతారుఅందువలన అపాయాలు రాకుండా ఉపాయంగా జీవిస్తూ జీవితాన్ని ముందుకు నడిపించు

31.12.2066

75.  కొందరు మొండివాళ్ళు తమ బలముతో ఇతరుల ఇళ్ళలోకి వెళ్ళి  ఆయింటివాళ్ళను ఇబ్బంది పెడతారుతమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తారుఅటువంటివారిని మన ఇంటిలోనికి రాకుండా జాగ్రత్తపడవలసిన అవసరం మనకు ఉంది.

06.01.2007

      Image result for images of shirdi sai baba appearing in dream

76.  గతానికి నీవు సాక్షీ భూతుడిగా నిలిచిపోవర్తమానంలో ప్రశాంతంగా జీవించు.

11.01.2007

77.  ఈనాడు న్యాయస్థానాల్లో ఒకరికి న్యాయం వందల మందికి అన్యాయం జరుగుతున్నదని తెలిసినా ఎవరూ పట్టించుకోవటంలేదున్యాయదేవత న్యాయస్థానంలో బందీగా ఉన్నంతకాలము ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉండాలి.   



12.01.2007

78.  జీవిత ప్రయాణంలో మనం వద్దనుకున్నా ఇతరులతో స్నేహం చేయవలసివస్తుందివారితో మాట్లాడటం తప్పుకాదుఆ మాత్రం పరిచయానికే అది గొప్ప స్నేహ బంధంగా భావించి జీవించటం తలనొప్పికి మూలమవుతుంది.
                  Image result for images of shirdi saibaba in mans heart

79.  ఋణానుబంధము వలననే మన కుటుంబ సభ్యులందరూ ఒకరికొకరం కలుసుకుంటాముమరి అటువంటప్పుడు క్రిందటి జన్మ వివరాలు తెలుసుకోవడం అవసరం లేదు కదాఒకవేళ తెలుసుకుంటే అది జన్మలో మన ప్రశాంత జీవితాన్ని భంగపరుస్తుందిఅందువలన గత జన్మ విషయాలు తెలిసికోకుండానే జీవితాన్ని ముందుకు కొనసాగించు.    

               Image result for images of shirdi saibaba in mans heart

80.  మంచిమనసుతో తోటివారికి సుఖసంతోషాలు పంచేవారే మానవులమధ్య ఉన్న దేవతలుఅదే కష్టాలను ప్రసాదించేవారు మానవుల మధ్య ఉన్న రాక్షసులు అని గుర్తించు.  

(మరికొన్ని సందేశాలు తరువాతి సంచికలో)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)



Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List