Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Sunday, May 8, 2016

శ్రీసాయి పుష్పగిరి – ఆధ్యాత్మిక జీవితం – 9వ.భాగమ్

Posted by tyagaraju on 8:47 AM
Image result for images of saibanisa
Image result for images of rose garden chandigarh

08.05.2016 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి బానిస గారికి సాయిబాబా వారు ప్రసాదించిన మరికొన్ని ఆధ్యాత్మిక సందేశాలు
Image result for images of saibanisa

శ్రీసాయి పుష్పగిరి – ఆధ్యాత్మిక జీవితం – 9వ.భాగమ్

03.02.2007

81.  ఆకాశంలో ఎగిరే విమానమయినా ఆఖరికి నేలమీద దిగవలసిందేఅలాగే ఎగురుతూ పోతూ ఉంటే అది నేల మీదకి కూలిపోతుందిమానవుడు కీర్తి కోసము ఎంతపైకి ఎగిరినా కిందకు రావలసిందేఅందుచేత కీర్తి కోసం ప్రాకులాడకుండా భూమిపై ప్రశాంత జీవితం సాగించు.



06.03.2007

   82.  బలవంతముగా ఇష్టములేని పని చేయరాదుమరియు ఇతరుల చేత చేయించరాదు అనే జీవిత సత్యాన్ని గ్రహించాను.                                                                                         
                                                  ----- సాయిబానిస                                                                                                         
                                                                                                            
03.04.2007

Image result for images of guava tree with flowers
Image result for images of guava tree with flowers
Image result for images of guava tree
Image result for images of guava fruit falling on ground


83.   జామ చెట్టును చూడుదానికున్న అందమయిన పువ్వుని చూడు పువ్వునించి వచ్చిన పిందెను చూడు. పిందె కాయగా మారడం చూడుఆ కాయ సువాసన గల పండుగా మారడం చూడుఆఖరికి ఆ పండు నేలమీదకి రాలడం చూడుఅదేవిధంగా నీవు మానవజీవితాన్ని చూడటం అలవాటు చేసుకో
   Image result for images of birth cycle human from birth to old age

14.04.2007

           Image result for images of baba looking kindly

84.  జీవితంలో ఒక్కొక్కసారి మనం కోరుకున్నది మనం సాధించలేముకాని, భగవంతుడు దయామయుడుమనకేది మంచిదో దానినే మనకు ప్రసాదిస్తాడు.


11.05.2007

85.  జీవితంలో బీదవాడిని చూసి అసహ్యించుకోవద్దుధనవంతుడిని చూసి పొగడవద్దు.   అలాగే బంధువులు, స్నేహితులను పొగడవద్దు, అసహ్యించుకోవద్దునీ జీవితంలో ప్రతి సంఘటన ఒక అనుభవంగా భావించి జీవించడం అలవాటు చేసుకో.


22.05.2007

86.  జీవితంలో ఉండటానికి ఒక ఇల్లు ఉండాలిఅది మన తాహతుకు మించి ఉండరాదుప్రశాంత జీవితానికి తగిన చోట నీ దగ్గర ఉన్న ధనానికి సరిపడ స్థలము కొని నీ తాహతుకు తగినట్లుగా గృహం నిర్మించుకుని ప్రశాంతంగా జీవించుఅప్పులకు, గొప్పలకు పోవద్దు.
                 Image result for images of man relaxing in easy chair

09.06.2007

87.  గతము, గతములోని జ్ఞాపకాలు నేడు పనికిరాని చెల్లని చిల్లర నాణాలువాటిని పోగుచేసుకోవడంలో అర్ధమేముంది.

12.06.2000

88.  నిజమయిన స్నేహం నీనుండి బహుమానమును కోరదునీ నుండి ప్రేమనే కోరుతుందిశ్రీసాయి నీకు నిజమయిన స్నేహితుడునీ ప్రేమను ఆయనకు అర్పించు.
                                                                                                                                                                 ---  సాయిబానిస


29.07.2007

                      Image result for images of man happily talking to neighbours

89.  మీ పొరుగువారితో మంచిగా ఉంటూ వారికి మాట సహాయం చేస్తు నీవు సమాజంలో జీవించుఅందరూ విధానాన్ని పాటిస్తే సమాజంలో అసూయాద్వేషాలు తొలగిపోయి అందరూ సుఖశాంతులతో జీవించుతారు.

21.08.2007

90.  నీలోని గొప్పతనం నీ మనసులోనే ఉండాలిఅది మానవాళికి ఉపయోగపడాలినీ వేష భాషలు నీ ప్రక్కవాడి వరకె పరిమితమవాలినీలో దాగియున్న గొప్పతనం, మంచితనం నీ జన్మను సార్ధకం చేస్తుందని గ్రహించు.

(మరికొన్ని సందేశాలు తరువాతి సంచికలో)


(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List