03.06.2016 శుక్రవారం
ఓం సాయి శ్రీసాయి జయజయ
సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి
బానిస గారికి బాబావారు ప్రసాదించిన ఆధ్యాత్మిక సందేశాలు మరికొన్ని.
శ్రీ సాయి
పుష్పగిరి - ఆధ్యాత్మిక జీవితం - 16వ.భాగం
02.08.2015
151. మనము పదవిలో ఉండగానె ఇల్లు చక్కబెట్టుకోవాలని
అడ్డ దారులలో ధన సంపాదన, మనకింద
పని చేసేవారి చేత భజనలు చేయించుకోవడము చేస్తాము. ఒకసారి
పదవీవిరమణ జరిగినతరవాత మనకు భజనచేసినవారు మన నుండి సహాయం పొందినవారు దూరంగా వెళ్ళిపోతారు. కనీసము ఆఫీసు
దగ్గరున్నశునకము కూడా మన మొహము చూడదు.
అందుచేత నిజ జీవితాన్నిఅర్ధము
చేసుకుని ప్రయాణం కొనసాగించాలి.
152. జీవితంలో సమస్యలు వచ్చినపుడు పోరాడాలి. కాని
ఆ సమస్యలు నీకంటె బలమయినవి అయినప్పుడు
నీవు ఆ సమస్యలతో రాజీ పడి జీవించడం అలవాటు చేసుకోవాలి.
18.05.2010
153. కొడుకు చేసిన మంచి పనులకు తండ్రి గర్వపడాలి. తండ్రి
చేసిన మంచి పనులను కొడుకు కొనసాగించాలి.
29.05.2010
154. నీ యింటికి వచ్చిన అతిధులకు నీవు భోజనం పెట్టి
వారి ఆశీర్వచనాలు పొందాలి. అలాగే నీవు యోగుల దగ్గరకు వెళ్ళి వారినుండి
ఆధ్యాత్మిక సంపదను తీసుకుని వారి ఆశీర్వచనాలతో జీవితాన్ని కొనసాగించాలి.
26.08.2010
155. నీవు భోజనం చేసేముందు నీ తల్లిని,
తండ్రిని, గురువును తలచుకుని వారికి మనసులో ఆ భోజనాన్నిఅర్పించి,
ఆ తరువాత నీవు భోజనం చేయి.
05.09.2010
156. నీ శత్రువులనుండి దూరంగా జీవించడం అలవరచుకో. ఒకవేళ
ఎదురు పడితే తక్కువగా మాట్లాడు. ఒకవేళ మాటాడవలసివస్తే తెలివిగా మాట్లాడు.
ఒకవేళ నీలో బలం లేకపోతే కనీసము అతనిని
తాకవద్దు. యుక్తిగా అక్కడినుండి దూరంగా వెళ్ళిపో.
11.09.2010
157. మన మంచి తనాన్నిఇతరులు తమ స్వార్ధానికి
వాడుకుంటారు. అందుచేత వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి.
22.09.2010.
158. మనకి ఇష్టం లేనివారి నుండి మనము దూరంగా ఉన్నచో
అదే వారికి తగిన శిక్ష అని గ్రహించు.
24.09.2010.
159. నీ
జీవితంలో నీవు నీ పిల్లల పట్ల బరువు బాధ్యతలు పూర్తి చేసిననాడు నీవు నీ వృధ్ధాప్యంలో
నీ పిల్లలపై వ్యామోహాన్ని విడనాడవచ్చును.
01.10.2010
160. ఒక మనిషి చనిపోతే ముందుగా అతనికి దహనసంస్కారాలు
పూర్తిచేసి ఆ తరువాతనె అతని జీవితంలోని మంచిచెడ్డలను తీరుబడిగా మాట్లాడవచ్చును.
(మరికొన్ని సందేశాలు ముందు ముందు)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment