Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Wednesday, June 8, 2016

శ్రీ సాయి పుష్పగిరి - ఆధ్యాత్మిక జీవితం - 18వ.భాగం

Posted by tyagaraju on 8:02 AM
      Image result for images of shirdi sai baba

      Image result for images of rose garden in chandigarh

08.06.2016 బుధవారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయిబానిస గారికి బాబావారు ప్రసాదించిన ఆధ్యాత్మిక సందేశాలు 
మరికొన్ని

    Image result for images of saibanisa

శ్రీ సాయి పుష్పగిరి - ఆధ్యాత్మిక జీవితం - 18.భాగం


23.02.2011

               Image result for images of rose flowers on ground

171.  తోటలోని అన్ని పుష్పాలు భగవంతుని పాదాల వద్దకు చేరలేవు.   
అలాగే ప్రతీ మనిషి భగవంతుని పాదాలపై తన ఆఖరి శ్వాస  తీసుకోలేడు

26.03.2011

Image result for images of mother feeling hurt
(Being mother is a gift from God. A special gift that God puts into all moms, a gift to love their kids and protect them even if it meant putting their own life at risk to make sure that there is no danger against their kid's.  It is a trust from our Heavenly Father that he puts into every mother to look after his own   kids while they live on this earth...)

     Image result for images of sick mother for not giving milk


172. తల్లి అనారోగ్యంతో బాధపడుతూ తన పిల్లవానికి పాలు పట్టలేదే అని బాధ
పడుతుంటే నా మనసు కలిచి వేసింది.  అది నిజమయిన మాతృ ప్రేమగా 
భావించాను.


31.03.2011

173.  కాలు జారినా లేచి నడవగలం.  మన జీవితంలో కాలం జారిపోయిన 
అది తిరిగిరాదు.

21.05.2011

174.  నేటి సమాజంలో జనులు వేషధారణలకుఆడంబరాలకు విలువ 
ఎక్కువగా ఇస్తున్నారు.  అటువంటప్పుడు అవతలివారు మనలను సరిగా 
గుర్తించలేదని బాధ పడరాదు.

12.06.2011

                   Image result for images of healthy body

175.  శరీరం శాశ్వతం కాదు.  అలాగని శరీరాన్ని అశ్రధ్ధ చేయకూడదు.  
చర్మవ్యాధుల నుంచి దీర్ఘవ్యాధుల వరకు నిలయం  శరీరము.  వైద్యుడు 
 శరీరానికి మంచి మిత్రుడు.   మిత్రుని సలహాలను పాటిస్తూ ఆరోగ్యంతో 
జీవించు

14.06.2011

                 Image result for images of old friends meet in old age

176.  చిన్ననాటి స్నేహితులు వయసు మళ్ళిన తరువాత కలిసినా  
స్నేహం ఆ పూట కాలక్షేపానికి మాత్రమే పనికివస్తుంది.  అందుచేత 
చిన్ననాటి  స్నేహితులపై ఆశలు పెట్టుకుని జీవించవద్దు.   

13.07.2011

                      Image result for images of angry couples

                   Image result for images of angry couples

177.  భార్యాభర్తలు ఒకరిని ఇంకొకరు అర్ధంచేసుకొని జీవించాలి.   ఒక్కరు 
అహంకారంతో జీవించినా ఆ సంసారము రోడ్డున పడుతుంది జాగ్రత్త.
                 Image result for images of angry couples


15.07.2011

              Image result for images of angry couples

178.  మనము చేయని తప్పులకు  సమాజము శిక్షను విధించినా 
మనము అటువంటి సమాజమునుండి బయటకు వచ్చి ఏకాంతముగా 
జీవించడం ఉత్తమము.

11.09.2011

             Image result for images of angry couples

179.  మనము చేయని నేరాన్నిచేయని తప్పును 
ఎవరయినా మన మీద ఆరోపిస్తే వారిని ధైర్యంగా ఎదుర్కొని 
న్యాయపోరాటం చేయాలి.  భగవంతుని దయతో మనము 
గెలిచి తీరాలి  

20.09.2011

180.  మనము ఎంత మమంచిగా జీవిస్తున్నా లోకం మనలను ప్రశాంతంగా 
బ్రతకనీయదు మనము వారికి సమాధానము చెప్పకుండా దూరంగా 
వెళ్ళిపోయినా మనలను పిరికివాడు అంటారు.  
గొడవపడటం అనివార్యమయినపుడు ముక్త సరిగా రెండు మాటలు 
చెప్పిఅక్కడినుంచి వెళ్ళిపో.

(మరికొన్ని సందేశాలు ముందు ముందు)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)  



Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List