Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Sunday, June 12, 2016

శ్రీసాయి పుష్పగిరి - ఆధ్యాత్మికం - 19వ.భాగం

Posted by tyagaraju on 8:35 AM
      Image result for images of shirdisaibaba
             Image result for images of rose garden in chandigarh
12.06.2016 ఆదివారం

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయి బానిసగారికి బాబా వారు ప్రసాదించిన ఆధ్యాత్మిక సందేశాలు మరికొన్ని.

సంకలనం: ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట్, హైదరాబాద్ 

           Image result for images of saibanisa

శ్రీసాయి పుష్పగిరి -  ఆధ్యాత్మికం - 19వ.భాగం   




12.10.2011

                    Image result for images of old man with boy

181.  సమాజంలో మానవత్వం అనేది ఉన్నపుడు నీవు నీ ప్రక్కింటి పిల్లవానిని చేరదీయివాడు నీ వృధ్ధాప్యంలో నీకు తోడుగా నిలుస్తాడునీకు పిల్లలు లేరనే బాధ తొలగిస్తాడు.    
 
12.10.2011

                  Image result for images of devotees in temple worshiping

182.  నీ బంధుమిత్రులతో కలిసి గుళ్ళు గోపురాలలో పూజలు చేసేకన్నా, నీ ఇంట నీ వాళ్ళతో భగవంతుని ప్రశాంతంగ పూజించడం ఉత్తమము
                  


05.11.2011

                           Image result for images of happy person

183.  జీవితం ఆఖరిలో నీతో వచ్చేది ఏమీలేదుఆఖరికి ఐదు నయాపైసలు (పంచప్రాణాలు) కూడా వదలి బయట పడాలి.

11.11.2011

                        Image result for images of person without ego
184.  జీవితంలో సుఖశాంతులు కావాలంటే ముందుగా నీలోని అహంకారాన్ని తొలగించుకో.
                   Image result for images of person without ego               

17.11.2011

                    Image result for images of comfort bed

185.  సుఖనిద్రకు మంచిపరుపు అవసరంఅంతేగాని పదిరిపట్టె మంచం మాత్రం కాదుఅలాగె చదుకోవాలనే తపన ఉన్నవాడికి దీపం ముఖ్యం.  
                  Image result for images of man studying under street light
అంతేగాని, అది కిరసనాయిలు దీపమా, కరంటు దీపమా అని ఆలోచించకు.    

26.11.2011

186.  జీవితమనే రైలుప్రయాణంలో బాధ్యత అనే టిక్కెట్టు తీసుకుని రైలు ఎక్కునీవు నీ బాధ్యతలను సరిగా నిర్వహించకుండా ప్రయాణము కొనసాగించినా నీ ప్రయాణము ఒక నరకంలా మారుతుంది జీవిత ప్రయాణంలో మనము బాధ్యతా రహితంగా ఉన్నపుడు మనం చేసే తప్పులకు మన తోటి బంధువులు, స్నేహితులు కూడా శిక్షను అనుభవిస్తారుఅందుచేత నీవు నీ గమ్యస్థానం చేరేవరకు నీ బాధ్యత అనే టిక్కెట్టును జాగ్రత్తగా పదిలపరచుకో.     

04.12.2011

                    Image result for images of lottery games

187.  జూదము ద్వారా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని తహతహలాడేవారు ఉన్నారుకాని జూదానికి దూరంగా ఉంటూ ప్రశాంతంగా జీవిస్తున్నవారిని అదృష్టదేవత వరించడం చూశానుఅదృష్టం అనేది భగవంతుని అనుగ్రహం వల్ల సిధ్ధిస్తుందిఅంతేగాని జూదమువల్ల కాదని గ్రహించు
                  Image result for images of baba blessings



17.12.2011

188.  సమాజం నీకు పదిరూపాయలు ఇచ్చిందితిరిగి నీవు పదిరెట్లు సమాజానికి ఇవ్వవలసిన బాధ్యత నీకు ఉంది.

18.12.2011

189.  చెడు సహవాసాలతో మనిషి జీవనం భయంకరమయిన మరణంతో ముగుస్తుంది.   అదే మంచివారితో స్నేహం ప్రశాంత మరణంతో ముగుస్తుంది రెండింటిలో ఏది కావాలో నీవే ఆలోచించి నీ జీవిత ప్రయాణాన్ని కొనసాగించు

18.12.2011

190.  జీవితంలో ధన సంపాదన, ఆస్తి సంపాదన, ముఖ్యమని భావించే వారితో స్నేహము నీకు నీ యవ్వనంలో మంచిగానే అనిపిస్తుందివారి వల్ల కలిగే తలనొప్పులు నీకు నీ వృధ్ధాప్యంలో తెలుస్తుంది.    

(మరికొన్ని సందేశాలు ముందు ముందు)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 



Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List