27.06.2016 సోమవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ
రోజు శ్రీమతి హెతాల్ పటేల్ రావత్ గారి బ్లాగులో 25.06.2016 న ప్రచురింపబడిన సాయి బంధు
విశ్వనాధన్ గారి అనుభవానికి తెలుగు అనువాదం ప్రచురిస్తున్నాను.
నా
భక్తులు పిలిచిన వెంటనే పరుగున వస్తాను
శ్రీసాయినాధుని
యొక్క లీలలను, అనుభవాలను లెక్కకట్టడం ఎవరికీ సాధ్యం కాదు. నిజం చెప్పాలంటే సముద్రతీరంలోని ఇసుక రేణువులను లెక్కించడం వంటివి. మానవమాత్రునికి సాధ్యం కానిది.
క్రిందటి
సంవత్సరం నేను, మా అమ్మగారు ఇద్దరం సుబ్రహ్మణ్యేశ్వరుని
ఆరు పుణ్యక్షేత్రాలను దర్శించుకుందామని (అరుపమై వీడు) నిర్ణయించుకున్నాము. ప్రయాణ ప్రారంభంనుండీ కొన్ని చికాకులు ఏర్పడ్డాయి. మొట్టమొదటగా మమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చిన
కారు డ్రైవరు చాలా ఆలస్యంగా వచ్చాడు. అంతే
కాకుండా తాగి మరీ వచ్చాడు. అనుకున్న ముహూర్తం
దాటిపోయిన తరువాత బయలుదేరడం అంత శుభసూచకం కాదని మా అమ్మగారు చాలా స్పష్టంగా చెప్పారు. కాని, మా యాత్ర పాకేజీలో ప్రతిచోటా హోటల్ రూమ్స్
బుకింగ్స్ కలిసే ఉన్నాయి. ఈ విధంగా మనసులో
ఎన్నో సందేహాలు, భయాలు, పెట్టుకొని ప్రయాణం ప్రారంభించాము. మొట్టమొదటగా మేము తిరుత్తణి చేరుకొన్నాము. సుబ్రహ్మణ్యస్వామి దర్శనం చాలా బాగా జరిగింది.
దర్శనం చేసుకున్న 20 నిమిషాల తరువాత బయటకు వచ్చాము. బయటకు వచ్చి చూస్తే మా కారు లేదు, డ్రైవరూ, లేడు. మా సామానంతా కారులోనే ఉంది. దాంతో మేము చాలా గాభరా పడ్డాము. మా అమ్మగార్ని గుడి మండపంలో కూర్చోబెట్టి నేను, కారుని, డ్రైవరుని వెతకడానికి వెళ్ళాను. ఎంత వెదకినా మేము వచ్చిన కారు గాని, డ్రైవరు గాని కనపడలేదు. నాకు సహాయం చేయమని నా సద్గురువు సాయినామం జపిస్తూ పిచ్చివానిలా వెదకసాగాను.

అకస్మాత్తుగా
ఎక్కడినుండి వచ్చాడో ఒక ఆటో అతను వచ్చి, ఏంజరిగిందనీ, ఏమయినా సహాయం కావాలా అని పూర్తిగా
తమిళంలోనే అడిగాడు.
మొట్టమొదటగా నన్ను ఆశ్చర్య పరిచిన విషయం, అతను ఏమని అడిగాడో నాకర్ధమవడం, రెండవది అతను మాకు సహాయం చేయాలనే ఆతృత, మూడవది, మధ్యాహ్నపు ఎండలో కాళ్ళు కాలుతూ నేను పడే అవస్థ చూసి అతను తన చెప్పులను ఇచ్చి నన్ను వేసుకోమనడం. అతనికి నేను మేము వచ్చిన కారు నెంబరు ఇచ్చాను. ఆ నెంబరు పట్టుకుని అతను వెదకడానికి వెళ్ళి మూడు నిమిషాలలోనే తిరిగి వచ్చాడు. తను ఆ కారును చూశానని, డ్రైవరు పూర్తిగా తాగి కారులోనే మత్తుగా పడుకొని ఉన్నాడని చెప్పాడు.
నేనా కారు దగ్గరకు వెళ్ళి మా సామానంతా తెచ్చేసుకొన్నాను. మా ట్రిప్ మానేజర్ కి జరిగినదంతా ఫోన్ చేసి చెప్పాను. అతను క్షమాపణ చెప్పుకొని మరొక కొత్త కారుని 45 నిషాలలో ఏర్పాటు చేశాడు. కొత్త డ్రైవరు ఆ ప్రాంతంలోని వాడే. అతను మాతో ఎంతో మర్యాదగాను. భాద్యతాయుతంగాను వ్యవహరించాడు. ఇంకా ఆశ్చర్యకరమయిన సంగతి ఏమిటంటే మేము కారు తలుపు తెరవగానే ‘సాయిరామ్’ అన్నాడు. నమ్మశక్యంగాని సంఘటన. బాబా దయవల్ల నాకు సహాయం చేసిన ఆటో డ్రైవరుకు ధన్యవాదాలు తెలుపుకుందామని చూస్తే ఆ ఆటో డ్రైవరు ఎక్కడా మళ్ళీ కనపడలేదు.

మాకు సహాయం చేయడానికి ఖచ్చితంగా సద్గురు సాయి పంపించిన వ్యక్తి తప్ప మరెవరూ కాదనిపించింది. ఆపదలో మాకు సహాయం చేసి ఇంటికి క్షేమంగా చేర్చినందుకు కోటి కోటి ప్రణామాలు తెలుపుకొంటున్నాను బాబా. నీ భక్తులు ఆపదలో ఉన్నప్పుడు పరిగెత్తుకొని వచ్చి ఆదుకొంటానన్న నీ మాటను నిలుపుకొన్నావు. నీ ఉపదేశాల సారంనుండి మేము నేర్చుకోవలసినవి ఎన్నో ఉన్నాయి. నువ్వు చెప్పిన ఉపదేశాల సారాన్ని మేము అర్ధం చేసుకొని జీర్ణించుకోవడానికి మాకు అనుభూతులను ఎప్పుడూ ప్రసాదిస్తూనే ఉండమని కోరుకొంటున్నాము. ఈ ప్రాపంచిక విషయాలలో మేము చికుక్కోకుండా మమ్మల్ని ముందుకు నడిపించు.
మనకు ఏమి జరిగినా అవి మనకు కష్టాన్ని కలిగించినా, సంతోషాన్ని కలిగించినా నిమిత్త మాత్రులంగానే ఉండాలి. మనకేది జరిగినా అది మన పురోగతికి అవకాశాన్ని కలిగించేదయినా లేక మనకి అడ్డంకిగా ఉన్నా, మన సద్గురు సాయికి సర్వశ్య శరణాగతి చేయడమే మనం చేయవలసినది. మన సద్గురు సాయి తప్ప ఏదీ వాస్తవం కాదు. ఎవరూ మన స్వంతం కారు. నా జీవితం ఏవిధంగా ఉన్నా సరే నేను నిన్ను ఎల్లప్పుడూ మరింతగా ఆరాధిస్తూనే ఉంటాను. నువ్వే సర్వాధికారివి. షిర్డి సాయిబాబా నాకేది చేస్తున్నా దాని అర్ధం నా మది దోచిన ఆయనకు మాత్రమే తెలుసు. మీమీద మాత్రమే నేను నమ్మకాన్ని నిలుపుకొన్నందుకు నేనెంతో ఆనందాన్ని పొందుతున్నాను.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment