28.06.2016 మంగళవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
శ్రీ
షిరిడీ సాయి వైభవమ్
బాబా ఆదేశాలను పాటించు
కాకా
సాహెబ్ దీక్షిత్ కి బాబా మీద అపరిమితమైన విశ్వాసం, నమ్మకం. అతను బాబా ఆదేశాలను శిరసా వహించడమే కాదు, బాబా స్వభావాన్ని,
ఆయన జీవన విధానాన్ని కూడా అలవరచుకోవడానికి ప్రయత్నించేవాడు. ఆ విధంగా ఉండటానికి అతను చేసిన ప్రయత్నం తను కూడా
ఏదో ఒక రోజున తన సద్గురువులా ఉండటానికే. ఎంతో కఠోరమైన శ్రమతో నిజంగానె అతను అందులో
సఫలీకృతుడయ్యాడు.
ఒకరోజు
సాయంత్రం, కాకా తన ఆఫీసునుండి ఇంటికి తిరిగి వస్తున్నాడు. దారిలో ఒక ధృఢమయిన వ్యక్తి అతనికి ఎదురుగా వచ్చి
ధర్మం చేయమని అడిగాడు. కాకా అతని మొహంలోకి
పరీక్షగా చూసి ఆ వ్యక్తి తన సద్గురువు తప్ప మరెవరూ కాదనే విషయం అర్ధం చేసుకొన్నాడు. వెంటనే అతనికి కొన్ని నాణాలను ఇచ్చాడు. నాణాలను తీసుకున్న వెంటనే ఆవ్యక్తి ఒక చిన్న నవ్వు
నవ్వి మరెవరినీ ఏమీ అడగకుండా వెళ్ళిపోయాడు.
అతను వెళ్ళిపోయేంతవరకు దీక్షిత్ అతనినే చూస్తూ నిలబడ్డాడు. అదే రోజు దీక్షిత్ షిరిడీకి బయలుదేరాడు. బాబా దర్శనం చేసుకున్న తరువాత ఒక బలిష్టుడయిన వ్యక్తి
రూపంలొ వచ్చి నానుండి దక్షిణ స్వీకరించినది మీరేనా బాబా అని అడిగాడు. “ అవును. ఆ రూపంలో
నీఎదుటకి వచ్చినది నేనే” అని సమాధానమిచ్చారు బాబా. ఆ మాట వినగానే దీక్షిత్ కి ఎంతో సంతోషం కలిగింది.
(దీనిని బట్టి మనం గ్రహించుకోవలసినది ఈ పాటికి మీకు అర్ధమైందనుకుంటాను. కాకా దీక్షిత్ తన సద్గురువైన బాబా ఆదేశాలను శిరసా వహించడమే కాదు ఆయనలా ఉండటానికి ప్రయత్నిస్తూ అందులో విజయం సాధించాడు. అందువల్లనే అతను బాబా మరొక రూపంలో వచ్చినా గుర్తించగలిగే శక్తి వచ్చింది. అంతే కాదు తననుంచి నాణాలను తీసుకున్న వ్యక్తి చిన్న చిరునవ్వు నవ్వడం, మరింకెవరినీ అడగకపోవడం ఇవన్ని గమనించడంవల్లనే కాకా బాబాను గుర్తించగలిగాడు. మనం కూడా బాబా చెప్పిన సూత్రాలను పాటించి మనం కూడా విజయాన్ని సాధిద్దాము. విజయం సాధించాలంటే ప్రతిరోజు శ్రీ సాయి సత్ చరిత్ర పారాయణ చేయడమే కాదు, బాబా చెప్పిన సూత్రాలని ఆచరణలో పెట్టాలి.)
చంద్రాబాయి
“నేనెక్కడికి
వెళ్ళినా ఆమె నాకోసం వెతుక్కుంటూ వస్తుంది.
ఏడు జన్మలనుండి ఆమె నాసోదరి” అని కాకాతో చంద్రాబాయి గురించి చెప్పారు బాబా.
1918
జూలై నెలలో చంద్రాబాయి బాబా దర్శనం కోసం షిరిడీ వెళ్ళింది. అప్పుడు బాబా “చంద్రా, ఇకనుండి నువ్వు నన్ను చూడటానికి
కష్టపడి రానవసరం లేదు. నువ్వెక్కడున్నా నేను
నీవెంటే ఉంటాను” అన్నారు. తన మీద బాబా చూపించిన
ప్రేమాభిమానాలకి చంద్రాబాయికి ఆనంద భాష్పాలు కారాయి. బాబా నుండి ఊదీ ప్రసాదంగా తీసుకొని పంచగనీకి వెళ్ళింది.
పంచగని* ఎంతో సుందరమైన ప్రదేశమయినప్పటికీ ఆమె మనసులో
ఏదో అశాంతి, అలజడి. దాని వల్ల ఆ ప్రదేశంలో
ఉన్న అందాలని ఆస్వాదించలేకపోయింది. ఒకరోజు
ఆమెకు కాకా దీక్షిత్ నుండి, బాబా ఆరోగ్యం చాలా వేగంగా దిగజారిపోతూ ఉందని, బాబా పదే
పదే ఆమె గురించే ఆలోచిస్తూ ఉన్నారనే సందేశం వచ్చింది. వెనువెంటనే ఆమె షిరిడీకి బయలుదేరి బాబా మహాసమాధి
చెందేంత వరకూ అక్కడనే ఉంది.
బాబా ఆఖరి క్షణాలలో
బాబా కు కాస్త మంచినీళ్ళు ఇచ్చే భాగ్యం కలిగింది ఆమెకు. అక్కడే ఉన్న నిమోన్ కర్ కు కూడా ఆభాగ్యం లభించింది. ఆ తరువాత బాబా బయ్యాజీ భుజం మీద వాలిపోయి సమాధి
చెందారు.
**పంచగనీ: ఇది ఒక హిల్ స్టేషన్...ముంబాయినుండి పంచగని 159 కి.మీ.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment