Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Wednesday, July 20, 2016

శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము - వాక్కు - (2వ. భాగం)

Posted by tyagaraju on 5:10 AM
 Image result for images of shirdi sai baba grinding
   Image result for images of rose

20.07.2016 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము
(4) వాక్కు - (2వ. భాగం)
         Image result for images of m.b.nimbalkar

ఆంగ్ల మూలం: లెఫ్టినెన్ట్ కల్నల్ ఎమ్.బి. నింబాల్కర్
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
నిన్న గురుపూర్ణిమనాడు 'శ్రీసాయి పుష్పగిరి' పుస్తకావిష్కరణ జరిగింది. కావలసినవారు నాకు ఫోన్ చేసినట్లయితే పంపించడం జరుగుతుంది. విదేశాలలో ఉన్న సాయిబంధువులకు కూడా పంపిస్తాను. విదేశాలలో ఉన్న సాయిబంధువులు వివరాలకోసం నాకు మైల్ పంపించండి.
ఈ మైల్. ఇ.డి.  tyagaraju.a@gmail.com
phOne:          9440375411 & 8143626744
చిరునామా ః      కే.పి.ఆర్. దివ్యప్రభాస్ ఎన్ క్లేవ్, 
                    ఫ్లాట్ 102, లోటస్ బ్లాక్ 
                    భవ్యాస్ ఆనందం ప్రక్కన, నిజాంపేట్
                    హైదరాబాద్

ఎల్లపుడు సత్యమునే పలుకవలెను:
మన పురాణాలు, వేదాలే కాకుండా అన్ని గ్రంధాలలో కూడా ఎల్లప్పుడూ సత్యమునే పలుకవలెనని మరీ మరీ నొక్కి వక్కాణించబడింది.  మన జాతీయధర్మ సూత్రం కూడా ‘సత్యమేవ జయతే’ (ఎప్పటికీ సత్యమే జయిస్తుంది).  
                 Image result for images of dharmaraju pandava
మహాభారతంలో పాండవులలో అగ్రజుడయిన ధర్మరాజు గురించి మనకు తెలుసు.  ఆయన ఎల్లప్పుడు సత్యమునే పలికేవారు.  ఆయన జీవితంలో ఒక్కసారి మాత్రం అసత్యమాడినందువల్ల నరకంలో కొద్దిసేపు గడపవలసివచ్చింది.  సాయిబాబా చేసే ఉపదేశాలు  ఎప్పుడూ వాస్తవంగాను, ఆచరణాత్మకంగాను ఉంటాయి.  ఆయన ఎప్పుడూ తన భక్తులకు అసత్యమాడవద్దనీ, ఎప్పుడూ సత్యమునే పలుకమని మాటలద్వారా చెప్పలేదు.  కాని భక్తులందరికీ సాయిబాబా అంతర్ జ్ఞాని అని తెలుసు.  (ఆయన అందరి హృదయాలలోను నివస్తుండటం వల్ల అందరి విషయాలు ఆయనకు తెలుసు) అందుచేత ఎవరు అసత్యమాడినా ఆయనకు వెంటనే తెలిసిపోతుంది.  అందువల్లనే ఎవరూ కూడా ఆయన సమక్షంలో అసత్యమాడే ధైర్యం చేయరు. అప్పుడు ఆకాలంలో ఎవరూ అంత ధైర్యం చేయలేదు.  మరి ఈ రోజులలో కూడా మనం ఆవిధంగానే ఉండాలి.  బాబా మన హృదయంలోనే నివిసిస్తూ ఉన్నారని మనం ప్రగాఢంగా విశ్వసిస్తుంటె మనం ఆ విధంగా చేయగలమా?  అంతేకాదు , బాబా మన ఎదురుగా ఫోటోలో ఉన్నా ఆయన మన ఎదురుగానే  సజీవంగానే ఉన్నట్లే కదా?  అటువంటి పరిస్థితులలో కూడా మనం అసత్యమాడే ధైర్యం చేయగలమా? శ్రీసాయి సత్ చరిత్ర మూలగ్రంధం మరాఠీలో హేమాడ్ పంత్ తగిన విధంగా చెప్పారు.

    असत्य चालेना साईप्रति I अस्त्ये नाहीम साईची प्राप्ति
    असते जाणो अधौगति  I अंति दुर्गति असत्ये  II 138 II

అసత్య చాలేనా సాయీప్రతి I అసత్యే నాహీమ్ సాయీచీ ప్రాప్తి
అసత్యే జాణో అధౌగతి I అంతి దుర్గతి అసత్యే II  (138 II
(సాయి ముందు అబద్ధమెన్నటికీ పనిచేయదు.  అబధ్ధంతో సాయిని పొందలేవు.  అబద్ధమాడటమంటే అది పతనమే.  అబధ్ధం చివరికి నరకానికి తీసుకొని వెడుతుంది)

रवोटे सांगूनि भागेना काज I साई महराज सर्वसाक्षी  II 49 II
(రవోటే సంగూని భాగేనా కాజ్   సాయి మహరాజ్ సర్వసాక్షి)

అసత్యమాడి విజయాన్ని సాధించడం అసంభవం.  సాయిబాబా సర్వసాక్షి – సర్వజ్ఞుడు.

అయినప్పటికి సాయిబాబాగారు కూడా తన జీవితంలో అసత్యమాడిన సంఘటనలు ఉన్నాయి.  శ్యామాకు మేలు చేయడానికి అతని చేత విష్ణుసహస్రనామ పారాయణ ప్రారంభింపచేయడానికి రామదాసి వద్దనున్న పుస్తకాన్ని (భగవద్గీత తరువాత ముఖ్యమయినది) ఇవ్వదలచుకొన్నారు.  అందుచేత బాబా రామదాసిని పిలిచి తనకు కడుపులో నొప్పిగా ఉన్నదని అసత్యమాడి, బజారుకు వెళ్ళి సోనాముఖి తెమ్మని చెప్పారు.  రామదాసి బజారుకు వెళ్ళగానే బాబా తన ఆసనాన్నుండి లేచి, విష్ణుసహస్రనామ పుస్తకాన్ని తీసి శ్యామాకిచ్చారు. 
                    Image result for images of shirdi sai baba with vishnu sahasranama

కాని, శ్యామా దానిని తీసుకోవడానికిష్టపడలేదు. (అధ్యాయం -27)  అదే విధంగా జామ్నేర్ లో నానా చందోర్కర్ కుమార్తెకు సుఖప్రసవం కోసం వెంటనే ఆమెకు ఊదీ, ఆరతిపాట ఇవ్వదలచి బాబాయే స్వయంగా టాంగా తోలేవానిగా వెళ్ళారు.  తనను జామ్నేర్ నుండి బాపుగిర్ గారు టాంగాని, పలహారములని పంపించారని అసత్యమాడారు.                                                                                              (అధ్యాయం – ౩౩ )

ఆయన చేసిన ఈచర్యలలోని గూఢార్ధం ఏమిటి?  వాటిని మనమెలా అర్ధంచేసుకోగలం?  మొదటిది, సాధువులు, సత్పురుషులు తాముచేసిన ఈచర్యల పర్యవసానాలకు వారు బాధ్యత వహించాలని లేదు.  అవి మంచివయినా, చెడువయినా కారణం, ఈ పనులు తామే స్వయంగా చేశామని కూడా చెప్పరు.  ఇక రెండవది, వారు చేసిన పనులు పాపాత్మకమయినవైనప్పటికీ, వాటివల్ల కలిగే పర్యవసానాలను కూడా తమ భక్తుల క్షేమంకోసం భరించడానికి కూడా సిధ్ధపడతారు.  ఇక పైన చెప్పుకొన్నవాటిలో మొదటి విషయానికి వస్తే, తన భక్తుడయిన శ్యామాను ఆధ్యాత్మిక మార్గలోనికి తీసుకొని వచ్చి, అతని చేత సాధన చేయిద్దామనే ఉద్దేశ్యంతో ఈవిధంగా నాటకమాడారు. సామాన్యంగా మాటలతో ఇచ్చే సలహాలయొక్క ప్రభావం అంతగా పనిచేయదు. ఇక రెండవ సందర్భం – జామ్నేర్ లో మైనతాయి ప్రసవం కష్టమయి వేదనపడుతున్న సమయంలో, సుఖప్రసవం కలిగించి తన కుమార్తెను కాపాడమని నానాసాహెబ్ చందోర్కర్ మనఃస్పూర్తిగా ఎంతో ఆవేదనతో చేసిన ప్రార్ధనలకి సాయిబాబా స్పందించారు.  జామ్నేర్ 100 మైళ్ళ దూరంలో ఉంది.  అంతరాత్రివేళ ఊదీ, ఆరతిపాట అత్యవసరంగా ఆమెకు చేరవలసి ఉంది.  బాబా, బాపుగిర్ బువాను అంతవేళకాని వేళలో అతని స్వగ్రామానికి వెళ్ళమని ప్రేరేపించడమే కాకుండా, జలగావ్ రైల్వేస్టేషన్ నుండి జామ్ నేర్ వెళ్లడానికి టాంగావాలాగా వచ్చి సహాయం చేశారు.   తనను నానాసాహెబ్ చందోర్కర్ టాంగానిచ్చి పంపించాడని బాపుగిర్ బువాను నమ్మించడానికి బాబా అసత్యమాడారు. 
ఆవిధంగా సాదు సత్పురుషులయిన వారు తమ భక్తులకు ఆపత్కాల సమయంలో సహాయం చేయడానికి ఏమయినా చేయగలరు.

సాధువులయినవారు తమ భక్తులకు వచ్చిన ప్రమాదకరమయిన, బాధాకరమయిన రోగాలను తాము ఇష్టపూర్వకంగా తమ మీదకు తీసుకొని వారిని రక్షించిన సందర్భాలను గురించి మనం వినలేదా?  దాదాసాహెబ్ ఖాపర్దే చిన్న కొడుకుకు ప్లేగు వ్యాధి సోకినప్పుడు అతనికి వచ్చిన నాలుగు బొబ్బలను బాబా తనమీదకు తీసుకొని, ఇష్టపూర్వకంగా ఆయన ఆబాధననుభవించారు. (అధ్యాయం – 7).  అటువంటప్పుడు సాధుసత్పురుషులయినవారు తమ భక్తుల క్షేమంకోరి పాపపు పనులు చేసినా వాటివల్ల వచ్చే పరిణామాలను కూడా అనుభవించడానికి ఏవిధంగాను సంకోచించరు.

(ఇంకా ఉంది) 
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 





Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List