21.07.2016 గురువారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయ్
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయిబాబావారి
బోధనలు మరియు తత్వము
(3)
వాక్కు – 3వ.భాగమ్
21.07.2016
గురువారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయిబాబావారి
బోధనలు మరియు తత్వము
(3) వాక్కు (3వ.భాగం)
ఆంగ్లమూలం
: లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి. నింబాల్కర్
తెలుగు
అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు
నిజమే
చెప్పడం – నిజమే తప్ప మరేమీ చెప్పకపోవడం -: మన దైనందిన జీవితంలో ఈ విధంగా ప్రవర్తించడం
ఒక్కొక్కసారి సమస్య కూడా అవుతుంది. ఈ రోజుల్లో
చిల్లరనాణాల కొరత బాగా ఉందని మనకందరికీ తెలుసు.
మనం బస్సులో కాని, రిక్షాలో గాని, ఆటోలో గాని వెడుతున్నపుడు, కండక్టరుగాని,
రిక్షా తొక్కేవాడు గాని, ఆటోవాడు గాని, తమ దగ్గర చిల్లరలేదని దానికి సరిపడ డబ్బు ఇవ్వమంటారు. మన దగ్గర చిల్లర ఉన్నాగాని మరలా మనకి తిరుగు ప్రయాణానికి
కావలసి ఉంటుందని, మనం లేదని అబధ్ధం చెబుతాము.
అప్పుడు ఆ పరిస్థితి అటువంటిది. మాకు
తిరుగు ప్రయాణానికి చిల్లరకావాలి అందుచేత ఇవ్వడానికి కుదరదని నిజం చెప్పలేము. అబధ్ధమాడాల్సిన పరిస్థితి. ఒకవేళ నిజం చెబితే వచ్చేటప్పుడు
కష్టపడాలి. ఒక్కొక్కసారి మనం ఆటో అతనికి డబ్బు ఇచ్చేముందు చిల్లర ఉందా అని అడిగినప్పుడు
ఉన్నా లేదని చెపుతాడు.
ఆ విధంగా చెప్పి మనకి ఇవ్వవలసిన చిల్లర ఇవ్వకుండానే వెళ్ళిపోతాడు. చిల్లర ఉందా అని అడగకుండా డబ్బు ఇచ్చినపుడు మనకి
రావలసిన చిల్లర చేతిలో పెడతాడు. ఒక్కొక్కసారి
ఇటువంటి సందర్భాలు కూడా మనకి అనుభవమవుతూ ఉంటాయి. వాస్తవానికి కండక్టరుగాని, రిక్షాతోలేవాడు
గాని, ఆటోవాళ్ళు గాని తమవద్ద చిల్లర లేదని చాలా సార్లు మోసం చేస్తూనే ఉంటారు. అందుచేత మనం ఏమి చేయాలి? ‘సత్యంవద’ (ఎప్పుడూ సత్యమునే
పలుకుము).
మరొక
ఉదాహరణ: మన మనవడు లేక మనవరాలు (మన పిల్లలయినా) బొమ్మలు గీసుకుంటాను తెల్ల కాగితాలు
కావాలి అని అడిగారనుకోండి. మామూలుగా మనం ఏమి
చేస్తాము? ఒకటి రెండు సార్లు ఇస్తాము. ఇక కాగితాలు అయిపోయే పరిస్థితి వచ్చిందనుకోండి. అప్పుడు మనం ఏమని చెబుతాము? ఇంట్లో ఉన్న కాగితాలు అలా ఇచ్చివేస్తూ ఉంటే ఆఖరుకు
అవి అయిపోయి, ఈ ముసలితనంలో మనం బజారుకు వెళ్ళి మళ్ళీ మళ్ళీ కొనుక్కుని రావలసి వస్తుంది. అందుచేత ఇంటిలో కాగితాలు ఉన్నా గాని లేవని మనం అబధ్ధమాడినపుడు,
సత్యమునే పలుకుము అన్న సూత్రాన్ని మనం అతిక్రమించినట్లే కదా? మరొక ఉదాహరణనే తీసుకుందాము.
ఇంటిలో చాక్లెట్లు ఉన్నాయనుకోండి. పిల్లలకి
ఒకటి లేక రెండు ఇస్తాము. పిల్లలు మళ్ళీమళ్ళీ
అడిగారనుకోండి. వారి ఆరోగ్యాన్ని దృష్టిలో
పెట్టుకొని ఇంక లేవు అయిపోయాయి మళ్ళీ తేవాలి అని అబధ్ధం చెబుతాము. మరి మనం ఏమి చేయాలి? ఇక్కడ సత్యమునే పలకవలెను అనే
సూత్రాన్ని పట్టుకొని ఉన్న చాక్లేట్లన్ని ఎప్పుడు అడిగితే అప్పుడు ఇస్తూ ఉంటే వారి
ఆరోగ్యాన్ని మనమే చేజేతులా పాడుచేసినవారమవుతాము.
అలాంటి పరిస్థితులలో అసత్యమాడక తప్పదు.
పైన
చెప్పిన చర్చలనే గనక పరిగణలోకి తీసుకొంటే నా స్వంత అభిప్రాయాలను వివరిస్తున్నాను. ఎవరయినా సరే ఎప్పుడూ నిజమే చెప్పాలి. ఎప్పుడూ అబధ్ధం
చెప్పకూడదు. అది తమ స్వలాభం కోసమయినా సరే. కానీ, అది ఇతరులకు లాభం చేకూరుస్తుంది అనుకుంటే
చిన్న అబద్ధమాడినా తప్పు లేదు. ఉదాహరణకి ఎవరికయినా
మనం ఒక చెడు వార్తని చెప్పవలసివచ్చినపుడు, ఆవార్త వినడం వల్ల ఆవ్యక్తికి విఘాతం కలిగే
ప్రమాదం ఉండవచ్చు. (ఆవ్యక్తికి రక్తపోటు, గుండెజబ్బులలాంటివి
ఉండవచ్చు). అటువంటి సందర్భాలలో చెడువార్త గురించి పూర్వాపరాలు ఏమీ చెప్పకుండా, అటువంటిదేమీ
జరగలేదని, లేకపోతే ఆ విషయం గురించి మనకేమీ తెలియదనే చిన్న అబధ్ధం ఆడవచ్చు.
అదేవిధంగా
ఎవరయినా మనకి ప్రేమతో, అభిమానంతో తినడానికి ఏమయినా పెట్టరనుకోండి. దాని రుచి మనకి అంతగా నచ్చనప్పుడు ఏమి చేయాలి? ఆ పదార్ధం బాగులేదని వారి మొహం మీదనే చెబితే వారి
మనసుని బాధపెట్టినవాళ్ళమవుతాము. అలా కాక చిరునవ్వుతో
అది చాలా రుచిగా ఉందని పొగిడి చిన్న అబధ్ధం ఆడితే వారెంత సంతోషిస్తారు? అటువంటి చర్యలని మన శాస్త్రాలు కూడా సమర్ధించాయి.
सस्तस्य वचनं श्रेय: सत्यादपि हितं वदेत I
यम्दूत हितम त्यंनतमेतत्सत्यं मत मम !
महाभारत शांतिपर्व
(నిజం చెప్పడం మంచిది. కాని, ఏది చెబితే అది ఇతరులకు మేలు చేస్తుందో అది
ఇంకా మంచిది. నా అభిప్రాయం ప్రకారం సకల జీవులకు
అంతిమంగా సంక్షేమాన్ని కలిగించడానికి ఏదయితే చెబుతామో అదే నిజమైన నిజం.)
सत्यं
ब्रयात प्रियं ब्रयात् न बरत्रट्यात् सत्यमप्रियम् II 134II
मनुष्म्रुति अ. 34
(ఎవరయినా నిజమే మాట్లాడాలి. ఎదటివారికి అంగీకారయోగ్యమైనది, సంతోషాన్ని కలిగించేదే
మాట్లాడాలి. ఎప్పుడూ కూడా అవతలివారికి సమ్మతం
కాని, సంతోషాన్ని కలిగించని నిజాన్ని చెప్పకూడదు.)
ఎల్లప్పుడూ
నీవిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకో ---
ఇచ్చినమాటను
నిలబెట్టుకోమని, ఆడి తప్పవద్దని సాయిబాబా భోధించారు. అనగా నువ్వు ఎవరికయినా ఒక పని చేస్తానని చెప్పినపుడు
ఆపని చేసి తీరాలి. ఎప్పుడూ తప్పుడు వాగ్దానం
చేయవద్దు. సాధారణంగా
భక్తులు చేసేదేమిటంటే తమ కోరికలని తీర్చమని,
తాము పూజించే భగవంతుని గాని, గురువుని గాని
ప్రార్ధించి మొక్కుకుంటారు. కాని,
కోరికలు తీరిన తరువాత మొక్కులు
చెల్లించడం మరచిపోతారు. సాయిబాబా
తన భక్తులెవరయినా మొక్కుకొన్న మొక్కులు మరచిపోతే వారికవి గుర్తుచేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి 33వ.అధ్యాయంలో అప్పాసాహెబ్
కుల్ కర్ణి తాను ఇంటిలో
లేనపుడు వచ్చిన ఫకీరుకు, తానే కనక ఉంటే
రూ.10/- ఇచ్చి ఉండేవాడిని అనుకొన్నాడు. బాబా
మరల అతని వద్దకు వచ్చి
రూ.10/- పూర్తిగా దక్షిణ అడిగి తీసుకొని అతని
కోరిక తీర్చారు. శ్యామా
తల్లి తమ గృహదేవతయిన సప్తశృంగి
దేవతకి ఏనాడో మొక్కుకొంది.
కాని ఆమె తన మొక్కును
చెల్లించలేదు. ఆమె చనిపోయే సమయంలో
ఆవిషయం శ్యామాకు చెప్పి ఆ మొక్కులు తీర్చే
భారం అతనిపై వేసింది. కాని
శ్యామా కొన్నాళ్ళకు ఆమొక్కుల
సంగతి పూర్తిగా
మరచిపోయాడు. బాబా
శ్యామానే స్వయముగా వణికి వెళ్ళి అతని
తల్లి మొక్కులను తీర్చవలసినదని చెప్పి అతని చేత మొక్కులను
చెల్లించేలా చేశారు. ఆవిధంగా
బాబా శ్యామా తల్లి మొక్కులను నెరవేర్చారు.
(అధ్యాయం – 15)
మితముగా
మాట్లాడు:
సాయిబాబా
కూడా ఈసూత్రాన్నే అనుసరించి మితముగా మాట్లాడేవారు. అయన ఎప్పుడూ పెద్దపెద్ద ఉపన్యాసాలు ఇవ్వలేదు. తన భక్తులకు తగినట్లుగా కధలను చెప్పి, అనుభవాలను
కలుగచేస్తూ ఉండేవారు. ఆధ్యాత్మికంగా ఉన్నతిని
సాధించాలంటే ప్రతిరోజు కొంత సమయం మౌనంగా ఉండాలి.
సాయిబాబా తాను స్వయంగా క్రమం తప్పకుండా రోజుకు రెండుసార్లు లెండీబాగ్ లో తమ
జీవితాంతంవరకు ఆచరించారు. అధికంగా మాటలాడటం వల్ల శక్తి చాలా ఖర్చవుతుంది. అందుచేత మన రోజువారీ
కార్యక్రమాలలో అనవసరంగా మాట్లాడటం, అనవసర చర్చలు మానుకోవాలి.
భగవన్నామస్మరణ
:
సాయిబాబా
తన ప్రసంగాలలో ముఖ్యంగా చెప్పినది భగవంతుని సదా స్మరిస్తూ ఉండమని. ఆయన ఎప్పుడూ ‘అల్లామాలిక్’ (భగవంతుడే యజమాని) అంటూ
ఉండేవారు. ఒక వారమంతా పగలు రాత్రి, ఇతరుల చేత
భగవన్నామస్మరణ చేయించడం ఆయనకు ఎంతో ఇష్టం.
దీనినే నామ సప్తాహం అంటారు.
హేమాడ్
పంత్ అంటారు “భగవంతుని నామానికున్న శక్తి అందరికీ తెలుసు. అది మనలని అన్ని పాపాలనుండి, చెడు ప్రవృత్తులనుండి
రక్షిస్తుంది. జననమరణ చక్రాలనుండి తప్పిస్తుంది. దీనికన్నా సులభమయిన సాధన మరొకటి లేదు. అది మన మనసులని అమోఘంగా శుధ్ధి చేస్తుంది. మన ఆలోచనలు పవిత్రమవుతాయి. చెడు తలంపులు నశిస్తాయి. దీనికి ఎటువంటి సామాగ్రి, అవసరం లేదు. ఎటువంటి నిబంధనలు లేవు."
సారాంశం
:
సంక్షిప్తంగా
భాషణమ్ (వాక్కు) గురించి సాయిబాబా ఇచ్చిన సలహాలు 1. ఎవ్వరితోను వారి మనస్సు వెంటనే బాధపడేలాగ
పరుషంగా మాట్లాడవద్దు. దానికి భిన్నంగా ఎవరయినా
నీతో పరుషంగా మాట్లాడినా నీవు శాంతం వహించు.
2. వాదవివాదాలను మానుకోవాలి.
3. ఎప్పుడూ ఎవరిమీదా నిందలు వేయడంగాని, చాడీలు
చెప్పడంగాని, ఎగతాళి చేయడంగాని. వీటికి పాల్పడవద్దు.
4. ఎప్పుడూ సత్యమునే పలుకవలెను.
5. ఎప్పుడూ మృదువుగాను, మధురంగాను మాట్లాడాలి.
6. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి.
7. తక్కువగా మాట్లాడి తరచూ మవునం వహించాలి.
8. తరచూ ఎప్పుడు వీలయితె అప్పుడు భగవన్నామస్మరణ
చేస్తూ ఉండాలి.
(రేపు
భక్తి మార్గం)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment