09.09.2016 శుక్రవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయిబాబావారి
బోధనలు మరియు తత్వము
ఆంగ్ల
మూలం : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి.నింబాల్కర్
తెలుగు
అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు
12. సత్ప్రవర్తన
– 1వ.భాగమ్
మన
దర్మ శాస్త్రాలలో చెప్పిన విధంగానే కాకుండా సాధారణంగా సమాజం మెచ్చతగిన రీతిలో
నడచుకోవటం, ఆలోచనలతో ఉండటమే మంచి ప్రవర్తన అనిపించుకుంటుంది. సాయిబాబా
ఎప్పుడూ చెబుతూ ఉండే మాటలు –
“జైసే
జిస్ కీ నయత్, వైసీ
ఉస్ కీ బర్కత్”
నియత్
అనగా ఈ సమాజంలో ప్రవర్తించవలసిన విధానం, మంచి నడవడికతో ఉండాలనే
ఉద్దేశ్యంతో మసలుకోవడం. ఎవరయినా సరే నీతి నియమాలతో
ఇతరులను మోసం చేయకుండా ఉన్నప్పుడె
అతడు జీవితంలో విజయాన్ని సాధించి సుఖపడతాడు.
సాయిబాబా,
రావు సాహెబ్ గల్వంకర్ (అన్నా సాహెబ్ ధబోల్కర్
గారి అల్లుడు) ను రెండు రూపాయలు
దక్షిణ అడిగేటప్పుడు రెండు విషయాలమీద మాత్రం
ప్రాధాన్యతనిచ్చి అడగడం జరిగింది.
అవి 1) నిజాయితీగాను, చిత్త శుధ్ధితోను ప్రవర్తించమని,
2) లైంగిక జీవితంలో పవిత్రంగా ఉండమని.
మనువు
కూడా తాను రచించిన మనుధర్మ శాస్త్రంలో (మనుస్మృతి) మతానికి సంబంధించి అతిముఖ్యమయినది కావలసినది సత్ప్రవర్తనే అని చెప్పాడు. (ఆచారో
పరమోధర్మః)
మోక్షాన్నిపొందాలంటే ఆఖరికి మానవునికి కావలసినది, (అత్యున్నతమయినది, దివ్యమయినది) స్వచ్చమయిన, పవిత్రమయిన
మనస్సు. ఇది ముఖ్యమయినది.
మనసులో
పవిత్రత, స్వచ్చత లేకుండా మోక్షాన్ని పొందడానికి ప్రయత్నించడమంటే అంతా శుధ్ధదండగ. మనకు లభించిన జ్ఞానాన్ని ఇతరులకు ఆడంబరంగా ప్రదర్శించదానికే
తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు.
అధ్యాయం – 17
సత్
ప్రవర్తన లేకుండా మనస్సు స్వఛ్చంగా ఉండదు.
ఆలోచనలు కూడా చెడుగానే ఉంటాయి. సత్
ప్రవర్తనలో కూడా స్వఛ్చత ఉండాలని నా అభిప్రాయం.
ఎందుకనగా సమాజంలో అందరితోను ఎంతోమంచిగా ఉన్నట్లు ప్రవర్తించవచ్చు కాని, అంతరంగంలో
స్వఛ్చత ఉండదు. మన ప్రవర్తనలో ఎప్పుడయితే స్వఛ్చత ఉంటుందో అప్పుడే ఆలోచనలు కూడా పవిత్రంగా ఉంటాయి.
ఆలోచనలు పవిత్రంగా ఉంటే నడవడిక కూడా మంచిగానే ఉంటుంది. మన ధర్మశాస్త్రాలలో చెప్పినట్లుగా
మనం పనులు సరిగా నిర్వహించకపోయినట్లయితే మనస్సును స్వఛ్చంగా ఉంచుకోవడం సాధ్యంకాదు. పవిత్రమయిన మనస్సు, ఆలోచనలు లేకపోతే బ్రహ్మజ్ఞానం
సిధ్ధించదు. మానవుడు దుర్మార్గమునుండి బుధ్ధిని
మరలించనప్పుడు, తప్పులు చేయుట మాననప్పుడు, మనస్సును చలింపకుండ నిలబెట్టలేనప్పుడు జ్ఞానము
ద్వారాకూడా ఆత్మసాక్షాత్కారమును పొందలేడు.
అధ్యాయము – 17
ఈమానవ
జన్మలో ఎవరికి ఏవిధమయిన సూత్రాలు నిర్ణయింపబడ్డయో (వర్ణాశ్రమ ధర్మాలు) మొట్టమొదటగా
వాటి ప్రకారం నడచుకోవాలి. ఆవిధంగా చేసినట్లయితే
మనసుయొక్క నిర్మలత్వాన్ని సాధించగలం. దానివల్ల
బ్రహ్మజ్ఞానం సంప్రాప్తిస్తుంది.
అధ్యాయం – 37
నిర్మలమయిన
మనసును బ్రహ్మజ్ఞానం సాధించిన తరువాత కూడా స్థిరంగా నిలుపుకోగలగాలి. “తనకు ఏది మేలు చేయునో, ఏది చెడు చేయునో అర్ధం చేసుకోలేనివానికి,
ధర్మశాస్త్రాలలో నిషేధించిన, చేయకూడదని చెప్పిన పాపకార్యాలను నిరంతరం చేస్తూ ఉండేవానికి
బ్రహ్మజ్ఞానాన్ని అనుగ్రహించినా ఎటువంటి ఉపయోగం లేదు.” (25)
“బ్రహ్మజ్ఞానాన్ని
పొందిన తరువాత కూడా ఎవడయితే ప్రవర్తనా నియమాలను ఉల్లంఘించి అవినీతిగా ప్రవర్తిస్తూ
దుష్కర్మలు చేస్తాడో వాడు ఈభూమిపై గాని, స్వర్గంలో
గాని ఉండలేక త్రిశంకు స్వర్గంలో వ్రేలాడతాడు.
(49)
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment