16.09.2016 శుక్రవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయిబాబావారి
బోధనలు మరియు తత్వము
ఆంగ్ల
అనువాదం : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి. నింబాల్కర్
తెలుగు
అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు
13.
బ్రహ్మానందము (పరమ సుఖము) – 2వ.భాగమ్
ధబోల్కర్
గారు పదవీ విరమణ చేసిన తరువాత ఆయనకి మరొక ఉద్యోగం చూపించమని అణ్ణాచించణీకర్ బాబాను
అభ్యర్ధించినపుడు బాబా ఇదే విషయాన్ని చెప్పారు.
అతనిని నాసేవ చేసుకోనీ. సంసారంలో అతనికి
సుఖం లభిస్తుంది. అతని పళ్ళెం ఎల్లప్పుడు ఆహారంతో
నిండి ఉంటుంది. అతని జీవితాంతం అది ఏమాత్రం
ఖాళీగా ఉండదు. నియమం తప్పకుండా అతను భక్తితో
నాసేవ చేసుకుంటే (నన్నాశ్రయిస్తే) అతని సంకటాలన్నీ దూరమవుతాయి”.
అధ్యాయం – 3 ఓ.వి. 77
శ్రీసాయి
సత్ చరిత్ర 35వ.అధ్యాయంలో కాకామహాజని యజమాని ఠక్కర్ ధరమ్ సీ కి బాబా పరోక్షంగా ఎంత
అద్భుతమయిన సలహా ఇచ్చారో చూడండి. “అస్థిరమయిన
మనసుగల ఒక వ్యక్తి ఒకడుండేవాడు. ఇంటిలో ధనధాన్యాలు
సమృధ్ధిగా ఉండేవి. అతనికి శారీరకంగా గాని,
మానసికంగా గాని ఎటువంటి బాధాలేదు. అయినా అనవసరంగా
బాధపడటం అతనికి అలవాటు. అకారణంగా అతను తలమీద
లేనిపోని భారాలు మోస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉండేవాడు. మధ్యలో ఆభారాన్ని కిందపెట్టేవాడు. అంతలోనే మళ్ళి తలకెత్తుకునేవాడు. అతని మనసుకి శాంతి అన్నది లేకుండా పోయింది. అతని అవస్థ చూసి నాకు దయ కలిగింది. నేనతనితో ఇలా అన్నాను. “నీకిష్టమయినచోట ఆభారాన్ని కింద పెట్టేయ్. ఊరికే ఎందుకని తిరుగుతావు? ఒకేచోట హాయిగా కూర్చో”.
అధ్యాయం – 35
సాయిబాబా
ఇచ్చిన ఉపదేశం, సలహా పొందిన వాడు తృప్తి చెంది జీవితంలో ఆనందంగా ఉంటాడు. బాబా చేసె బోధనలు ఆవిధంగా ఉంటాయి. అదేవిధంగా మోక్షానికి చేసే ప్రయత్నంలో కూడా బ్రహ్మంలో
ఐక్యమవుదామని ఆలోచించేకంటే ప్రపంచంలో ఎల్లప్పుడూ పరమానందంతో జీవించాలి. ఒక్కసారి కనక మనం ఈస్థితిని పొందగలిగితే మన మనస్సు
ఎంతో ప్రశాంతిగా, ఆనందంగా, తృప్తిగా ఉంటుంది.
జీవితానికి కావలసిన పరమావధి ఇంతకన్నా ఇంకేమి కావాలి?
సాయిబాబాగారు
ఒక్కొక్కసారి కోపోద్రేకంతో ఉండేవారనీ, భక్తులను కూడా సటకాతో కొడతానని బెదిరిస్తూ వారివెంట
ఎందుకని తరుముతూ వెళ్ళేవారని ఈ సందర్భంగా కొంత మంది ప్రశ్నించవచ్చు. నిజమే, కాని ఆయనకు ఎప్పుడు కోపం వచ్చినా అది ఆయన
స్వాధీనంలోనే ఉండేది. ఆ కోపం కొద్ది నిమిషాలు
మాత్రమే. ఆ తరువాత మరలా మామూలు స్థితిలోకి
వచ్చేవారు. ఆయన హృదయంలో తన భక్తులపై అమితమయిన
ప్రేమ నిండి ఉండేది.
హేమాడ్
పంత్ శ్రీసాయి సత్ చరిత్ర 11వ.అధ్యాయంలో బాబా గురించి ఈవిధంగా వివరించారు. “ఆయన కోపోద్రేకంతో ఊగిపోతూ, క్రోధంతో కళ్ళు అగ్నిగోళాల్లా
తిప్పినప్పటికీ ఆయన మనసులో తల్లికి బిడ్దపై ఉండే కారుణ్యం, మమకారం ఉండేవి. మరుక్షణంలోనే మామూలు స్థితిలోకి వచ్చి, భక్తులను
కేకేసి పిలిపించి, నాభక్తులపై నేను కోపపడినట్లుగా నాకేమీ తెలియదు. నాభక్తులపై నేనెన్నడూ కోపగించను. తల్లి తన బిడ్డను కాలితో తన్నితేను, సముద్రం ఒకవేళ
నదిని వెనక్కి తిప్పిపంపితేను అప్పుడే నేను మిమ్మల్ని తరిమేస్తాను. అప్పుడే నేను మీయోగక్షేమాలను నిర్లక్ష్యం చేస్తాను. నేను నా భక్తులకు బానిసను. నేనెల్లప్పుడు వారి చెంతనే ఉంటాను. నా భక్తులు పిలిచిన వెంటనే పలుకుతాను.
అధ్యాయం – 11
నిజం
చెప్పాలంటే సాయిబాబా ప్రదర్శించే కోపమంతా పైపైనే.
అది నిజమయిన కోపం కాదు. ప్రజలంతా తనను
అనవసరంగా ఇబ్బంది పెట్టకుండా ఉండటానికి ఆయన ఆవిధంగా ప్రవర్తించేవారు. విషసర్పమయినా, విషరహిత సర్పమయినా పడగ ఎత్తవలసిందే. పడగ ఎత్తగానే ఎదటివారు భయంతో వణుకుతూ పరుగులెత్తవలసిందే.” ఏమయినప్పటికీ బాబా తన భక్తులకిచ్చిన సందేశం కోపాన్ని
త్యజించమని. (ఉదాహరణకి 46వ.అధ్యాయంలో రెండు
మేకల గత జన్మ వృత్తాంతం, 47వ. అధ్యాయంలో పాము, కప్పల వృత్తాంతం.)
(తరువాత
అధ్యాయం నిష్ఠ)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
(విజయవాడలో జరిగే సాయి సప్తాహ కార్యక్రమానికి రేపు విజయవాడ వెడుతున్న సందర్భంగా నిష్ఠ అధ్యాయం వీలును బట్టి రేపు ప్రచురిస్తాను. లేకపోతే 20వ.తేదీన ప్రచురిస్తాను.)
0 comments:
Post a Comment