20.09.2016 మంగళవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయిబాబావారి
బోధనలు మరియు తత్వము
ఆంగ్ల
మూలం : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి.నింబాల్కర్
తెలుగు
అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు
14.
నిష్ఠ (ధృఢమయిన నమ్మిక) 1 వ.భాగమ్
సాయిబాబా ఉపదేశించినవాటిలో అతి ముఖ్యమయిన మాటలు రెండు ఉన్నాయి. అవి శ్రధ్ధ, సబూరి (ధృఢమయిన భక్తి, ఓర్పు).
అందరికన్న
శక్తిమంతుడు, మన భూత భవిష్యత్, వర్తమానాలన్నిటిని తెలిసున్నవాడు, నిరంతరం మన యోగక్షేమాలను
గమనిస్తూ మనలని కనిపెట్టుకుని ఉండే మనం పూజించే దైవం మీద గాని, మన రక్షకుడయిన మహాపురుషుని
మీద గాని, స్థిరమయిన భక్తి కలిగి ఉండటమే నిష్ఠ. ఆ నమ్మకంతోనే వారిని మనం పూజిస్తాము,
కొలుస్తాము. ఎవరేమి చెప్పినా మనం కొలిచే దైవం
మీద మన భక్తి సడలకూడదు. అదే అచంచలమయిన భక్తి. మనం కొలిచే దైవం మీద మనకు పూర్తి అవగాహన ఉండాలి. మిడి మిడి జ్ఞానం పనికిరాదు. అటువంటి అజ్ఞానంవల్ల ఇతరులు చేసే నిందారోపణలు మన
మనసుపై ప్రభావాన్ని చూపుతాయి. ఎప్పుడయితే మనం పూర్తి
అవగాహన కలిగి ఉంటామో అప్పుడే మనం ఇతరులు చేసే అసందర్భపు వ్యాఖ్యలని ఖండించగలుగుతాము. బాబా నిర్ణయం ప్రకారం ఆయన తన భక్తునికి కష్టాలను
ఇచ్చినా, సుఖాలను ఇచ్చినా ఎప్పుడూ స్థితప్రజ్ఞునిగా ఆనందంగాను సంతోషంగాను ఉండాలనే నిర్ణయంతో
ఉన్న సాయి భక్తుడు ఈ ప్రపంచంలో ఎప్పుడూ సంతోషంగాను. మనశ్శాంతిగాను జీవిస్తాడు.
ఉదాహరణకి
శ్రీసాయి సత్ చరిత్ర 25వ.అధ్యాయం గమనించండి.
అహమ్మద్ నగర్ నివాసి అయిన దామూ అన్నాకు జట్టీవ్యాపారం చేసి లాభాలు గడిద్దామనే
తలంపుతో బాబాను సలహా అడిగాడు. బాబా “వద్దు”
అని చెప్పగానే చాలా నిరాశకు గురయ్యాడు. అనవసరంగా
బాబాను సలహా అడిగి మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నానే అని చాలా బాధపడ్డాడు. కాని ఆతరువాత ఆవ్యాపారంలో పెట్టుబడిపెట్టిన తన స్నేహితులు
చాలా నష్టపోయారని తెలిసిన తరవాత, అతనికి బాబాపై నమ్మకం మరింతగా పెరిగింది. కాకాసాహెబ్ దీక్షిత్, బాపూసాహెబ్ బుట్టిలాంటి గొప్ప
భక్తులు బాబాని సంప్రదించకుండా ఏపనీ చేసేవారు కాదంటే అందులో ఆశ్చర్యం లేదు. “కాకాసాహెబ్ దీక్షిత్ పూర్తిగా సాయిబాబా మీదనే ఆధారపడ్డాడు.
ఆయనను సంప్రదించకుండా ఏమీ చేసేవాడు కాదు. మొట్టమొదట
ఆయన సలహా తీసుకొనేవాడు. బాబామీద ఉన్న ధృఢమయిన
విశ్వాసం వల్లనే లక్షల రూపాయలు లాభాలను కూడా తృణప్రాయంగా తిరస్కరించాడు. తన నిశ్చయాన్ని తను మరణించేవరకు అలాగే నిలుపుకొన్నాడు.’ అధ్యాయం
– 45 ఓ.వీ. 100
బుట్టీకి
ఏదయినా ఆలోచన కలిగిందంటే మొదటగా బాబాను సంప్రదించిన తరువాతే ఏపనయినా ప్రారంభించేవాడు.
(150)
బాబా
సమ్మతి లేకుండా బుట్టి ఏదీ ప్రారంభించేవాడు కాదు. ఈ నియమాన్ని అతను ఎప్పుడూ పాటించేవాడు.
ఆత్మ
సాక్షాత్కారాన్ని సాధించాలంటే ముఖ్యంగా కావలసినది ఆధ్యాత్మిక గురువు (సద్గురువు) పై
నమ్మకం ఉండాలి. మోక్షసాధనకు పయనించే మార్గం
చాలా కఠినతరమయినదే కాక బాధాకరంగా ఉంటుంది.
అందుచేత ఈ అధ్యాత్మిక మార్గంలో సరియైన దారిలో నడవాలంటే సమర్ధుడయిన సద్గురువు
యొక్క మార్గదర్శకత్వం అవసరం. మన స్వంత తెలివితేటలు
గాని మన తర్కం గాని ఏమీ మనకు ఉపయోగపడవు. మన
బుధ్ధి చాతుర్యం చూపించవలసిన అవసరం లేదు. మన
సద్గురువు మీద మనకు అచంచలమయిన స్థిరమయిన నమ్మకం ఉండాలి.
“తర్క
కుతర్కాలతో పని లేదు. బుధ్ధి చాంచల్యం పనికిరాదు. శ్రధ్ధ లేకుండా కేవలం తర్కకుతర్కాలు చేసేవారు, వాదవివాదాలు
చేసేవారికి మహాత్ములనించి ఉత్తమ ఉపదేశం లభించదు.
స్థిరమయిన నమ్మకం ఉన్నవారికి అది సులభంగా లభిస్తుంది” అని బాబా తన భక్తులకి
ఉపదేశించారు.
అధ్యాయం – 35
తర్క
శాస్త్రంలో నిష్ణాతుడయినవాడికి ఇక్కడ స్థానం లేదు. అటువంటి వ్యక్తి అనుమానాలు, సందేహాలతో కొట్టుమిట్టాడుతూ
ఉంటాడు. పవిత్రమయిన ధర్మ శాస్తాలు అధ్యయనం
చేయకుండా, సద్గురువు సహాయం లేకుండా బ్రహ్మజ్ఞానాన్ని అర్ధం చేసుకోవటం, అవగాహన చేసుకోవడం
సాధ్యంకాని విషయం. వాదవివాదాలలో మునిగి ఉండేవానికి,
తర్కించేవానికి, ఎల్లప్పుడు అనుమానాలతోనే ఉండేవానికి ఆత్మజ్ఞానం బోధపడదు.
అజ్ఞానమనే
చీకటిని ఎవరి స్వంత జ్ఞానం ప్రారద్రోలలేదు.
వారిలో లెక్కలేనన్ని నక్షత్రాల వెలుగుతో సమానమయిన జ్ఞానమున్నా ఎందుకూ పనికిరాదు.
కానీ ఆపనిని పవిత్రమయిన వేదశాస్త్రాలు, లేక సద్గురువు అనే ఒక్క చంద్రుడు వల్ల మాత్రమే
సాధ్యమవుతుంది. అంతేకాక 84 లక్షల జననమరణ చక్రాలనుండి
కూడా వారు తప్పించగలరు. సద్గురువుని ధృఢంగా
ఆశ్రయిస్తే బ్రహ్మజ్ఞానం ప్రకటమౌతుంది.
అధ్యాయం -10
అందుచేతనే
సాయిబాబా తన భక్తులకు పదేపదే ఈవిధంగా చెప్పారు. “అతి తెలివి ఎందుకూ పనికిరాదు. ప్రతివారు పెద్దలు చెప్పిన సలహాను పాటించాలి".
ఈ
సందర్భంగా శ్రీసాయిబాబా తన అనుభవాన్ని 32వ.అధ్యాయంలో వివరించి చెప్పారు.
(వివరణ రేపటి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment