Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, May 20, 2017

ఈనాటి సమాజములో మానవత్వము ఇంకా బ్రతికేఉంది -3

Posted by tyagaraju on 5:16 AM
        Image result for images of shirdi sai baba hd
          Image result for images of rose hd
   

20.05.2017 శనివారమ్

ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు                                                                        ఈనాటి సమాజములో
మానవత్వము ఇంకా బ్రతికేఉంది
(శ్రీసాయిబానిస నిజ జీవితములోని అనుభవాలు)
సేకరణ : ఆత్రేయపురపు త్యాగరాజు

3.  డిసెంబరు నెల రాత్రి చలిలో మాతృప్రేమ
         Image result for images of mother's love
అది 1994.సంవత్సరం డిసెంబర్ నెల, తారీకు గుర్తు లేదునేను, మాసాయిదర్బార్ సభ్యులందరం కలిసి రాత్రి రోడ్ ప్రక్కన గట్టుమీద నిద్రించే బీదవారికి చలిబారినుండి కాపాడుకోవడానికి ఉన్ని దుప్పట్లు పంచాలని నిర్ణయించుకొన్నాము.  


ఆరోజు రాత్రి 11 గంటలకు రెండు కార్లలో మేము 100 ఉన్నిదుప్పట్లు తీసుకొని బయలుదేరాముముందుగా సికింద్రాబాద్ స్టేషన్ ప్రాంతంలో ఫుట్ పాత్ మీద నిద్రిస్తున్నవారిని లేపి వారికి ఉన్నిదుప్పట్లు ఇచ్చాము.

.     

తర్వాత మెట్టుగడ్డ ప్రాంతానికి వచ్చాముఅక్కడ ఉన్న చర్చి ప్రాంతంలో ఫుట్ పాత్ మీద నిద్రిస్తున్నవారిలో కొందరిని లేపి దుప్పట్లు ఇచ్చాముకొందరు గాఢ నిద్రలో ఉంటే వారిని లేపకుండా వారిపై ఉన్నిదుప్పట్లను కప్పాము సమయంలో అక్కడ చెత్త కుండీ ప్రక్కన ఒక స్త్రీ ఫుట్ పాత్ పై నిద్రించుట గమనించి ఆస్త్రీని నిద్రలేపి ఆమెకు ఒక ఉన్ని దుప్పటీని ఇచ్చానుఆస్త్రీ సంతోషంగా నాకు నమస్కరించి ఉన్నిదుప్పటిని స్వీకరించిందినేను అక్కడినుండి తిరిగి కారు ఎక్కడానికి నడవటం ప్రారంభించానుమనసులో భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకొన్నానుశ్రీసాయి నాచేత ఇటువంటి మానవతా కార్యక్రమము చేయించటము నా అదృష్టముగా భావించాను సంతోషములో కారు ఎక్కుతూ నేను దుప్పటిని ఇచ్చిన స్త్రీవైపు చూసానునాకళ్లను నేను నమ్మలేకపోయాను స్త్రీ నేను ఇచ్చిన కొత్త ఉన్నిదుప్పటిని నేలమీద పరచితన ప్రక్కనే ఉన్న మునిసిపాలిటీవారి చెత్త కుండీనుండి ఎండిన ఆకులు పైకి తీయనారంభించిందిఇంత రాత్రివేళ ఆమె ఎందుకు ఆచెత్త కుండీలోని చెత్తను పైకి తీస్తున్నది అని ఆతృతగా ఆమెవైపే చూడసాగానుఆమె చెత్త మధ్యనుండి తన రెండుసంవత్సరాల కుమారుడిని పైకి తీసి ఆబాలుడిని నేను ఇచ్చిన ఉన్నిదుప్పటిలో పరుండబెట్టి సగము దుప్పటి బాలునికి కప్పిందిఆమె తిరిగి ఆబాలుని ప్రక్కనే నేలమీద నిద్రించసాగిందిఈసంఘటన నాహృదయాన్ని కదలించివేసిందితల్లి తన పిల్లలకోసం చాలా త్యాగము చేస్తుంది అని పుస్తకాలలో చదివాను రోజున ఆతల్లి చలిబాధకు తన కుమారుడు తట్టుకోలేకపోవటం చేత తన కుమారుడిని చెత్త కుండీలో ఆకులమధ్య నిద్రింపచేసిందితనకు ఒక ఉన్నిదుప్పటి లభించగానే ఆదుప్పటిని చెత్తలో నిద్రించుతున్న తన కుమారునికి చుట్టింది
                     Image result for images of mother's love
             Image result for images of mothers love with quotes telugu
ఇది నిజమైన మానవత్వానికి ఉదాహరణగా భావించానుమానవతా దేవతకు నమస్కరించి కారు డిక్కీలోనుండి ఇంకొక ఉన్నిదుప్పటిని తీసుకొనివెళ్ళి స్త్రీకి ఇచ్చాను సమయములో ఆమె కండ్లలోని తృప్తిని చూసానుమానవతాదేవత నన్ను ఆశీర్వదించుతున్న భావన పొందాను స్త్రీలోని మాతృప్రేమకు నమస్కరించి తిరిగి రాత్రి 2 గంటలకు ఇంటికి చేరుకొన్నాను.

దయచేసి శ్రీసాయి సత్ చరిత్ర మూడవ అధ్యాయము ఒక్కసారి చదవండిఅందులో సాయిబాబాయొక్క మాతృప్రేమ గురించి ఈవిధముగా వివరింపబడింది.  “ఆవు తన దూడనెట్లు ప్రేమించునో మనందరికి తెలిసిన విషయమేదాని పొదుగెల్లపుడు పాలతో నిండియేయుండును
              Image result for images of indian cow and calf
దూడకు కావలసినప్పుడెల్ల కుడిచినచో పాలు ధారగాకారునుఅలాగునే బిడ్డకు ఎప్పుడు పాలు కావలెనో తల్లి గ్రహించి సకాలమందు పాలిచ్ఛునుబిడ్డకు గుడ్డలు తొడుగుటయందును, అలంకరించుటయందు తల్లి తగిన శ్రధ్ధ తీసుకొని సరిగా చేయును
              Image result for images of mother dressing her child

బిడ్దకు ఈవిషయమేమి తెలియదుకాని తల్లి తన బిడ్డలు చక్కగా దుస్తులు ధరించి అలంకరింపబడుట చూచి అమితానందమును పొందునుతల్లి ప్రేమకు సరిపోల్చదగినదేదియు లేదు.  
                      Image result for images of mother's love

అది అసామాన్యము, నిర్వ్యాజముసద్గురువులు కూడా మాతృప్రేమను వారి శిష్యులపై చూపుదురుశ్రీసాయిబాబా అట్టి సద్గురువుఈపేజీని నేను శ్రీసాయి సత్ చరిత్రలో చదివినపుడెల్లా డిసెంబర్ నెల చలిరాత్రిలో చెత్తకుండీ ప్రక్కన నిద్రించుతున్న మాతృమూర్తిని గుర్తు చేసుకొంటానునేను మాతృమూర్తిలో శ్రీసాయిని చూడగలిగాను అనే సంతృప్తితో రాత్రి రెండుగంటల ముప్పయి నిమిషాలకు నిద్రలోకి వెళ్ళిపోయానుఆనిద్రలో కలగన్నాను కలలో మాతృమూర్తిని ఆమె చిన్న కుమారుడిని చూసానుమానవతాదేవత ఆశీర్వచనాలు పొందగలిగాను.

జై సాయిరామ్

(రేపు మరొక మానవత్వమ్)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment